Salman Khan | అసలు టార్గెట్ సల్మాన్.. టైగర్ ష్రాఫ్ కాదు.. దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు
Salman Khan | టైగర్ ష్రాఫ్ (Tiger Shroff)పై కాల్పుల ఘటనపై దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమ అసలు టార్గెట్ టైగర్ ష్రాఫ్ కాదని.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) అని నిందితులు విచారణలో అంగీకరించారు.
Salman Khan | త్రినేత్ర న్యూస్ : బాలీవుడ్లో సంచలనం రేపిన నటుడు టైగర్ ష్రాఫ్ (Tiger Shroff)పై కాల్పుల ఘటనపై అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు (Lawrence Bishnoi Gang) చెందిన పలువురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమ అసలు టార్గెట్ టైగర్ ష్రాఫ్ కాదని.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) అని నిందితులు విచారణలో అంగీకరించారు. అయితే, సల్మాన్ ఇంటి వద్ద పోలీసు భద్రత కారణంగా ఆ ప్లాన్‌ను విరమించుకున్నట్లు నిందితులు తెలిపినట్లు దర్యాప్తు అధికారులు తాజాగా వెల్లడించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. షూటర్లు మొదట సల్మాన్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. అయితే, అక్కడ పోలీసు బందోబస్తు ఎక్కువగా ఉండటంతో తమ ప్లాన్‌ను విరమించుకున్నారు. మరో టార్గెట్ కోసం వెతుకుతుండగా వారి దృష్టి టైగర్ ష్రాఫ్‌పై పడింది. ఆయన కదలికలను నిరంతరం పర్యవేక్షించారు. ఆయన ప్రతి ఆదివారం జుహూ ప్రాంతంలోని ఫుట్ బాల్ గ్రౌండ్‌కు క్రమం తప్పకుండా వస్తారని తెలుసుకున్నారు. ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించారు. అక్కడ భద్రత కూడా తక్కువగా ఉంటుందని గ్రహించిన షూటర్లు ఆదివారం సాయంత్రం టైగర్ ష్రాఫ్‌ను టార్గెట్ చేసి కాల్పులు జరిపినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు.
తాజా పరిణామంతో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద పోలీసులు భద్రతను మళ్లీ కట్టుదిట్టం చేశారు. భవనం లోపల, బయట, రోడ్డుకు ఇరువైపులా భారీగా పోలీసులను మోహరించారు. ఒక పెట్రోలింగ్ వాహనాన్ని కూడా అక్కడ అందుబాటులో ఉంచారు. కాగా, ఈ కేసుకు సంబంధించి హర్యానాకు చెందిన ఇద్దరు షూటర్లను, బీహార్‌కు చెందిన మరొకరిని రాజస్థాన్‌లో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఈ కాల్పుల ఘటనలో ఆయుధాలు సరఫరా చేశారన్నా ఆరోపణలతో ఇద్దరు మహిళలు సహా నలుగురిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
Also Read..
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. రూ.50,000 ఫైన్
బంగారం కొనేవారికి అలర్ట్.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
జియో ఐపీఓ నేడే ప్రారంభం.. జీఎంపీ వివరాలివే.. బ్రోకరేజీలు ఏమంటున్నాయి..?
సంబంధిత వార్తలు

Tiger Shroff | గన్ జామ్ కావడంతో ప్రాణాలతో బయటపడ్డ నటుడు.. టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసులో కీలక విషయాలు..
అక్టోబర్ 20, 2026

Sanjay Singh on Tiger Shroff Firing | గుజరాత్ జైలు నుంచే టైగర్ ష్రాఫ్‌పై దాడికి స్కెచ్
అక్టోబర్ 19, 2026

Lawrence Bishnoi Sahab | గ్యాంగ్‌స్టర్‌కు ‘సాహెబ్’ మర్యాదా? టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల వేళ పోలీసుల పాత వీడియోతో దుమారం
అక్టోబర్ 19, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | బంగారం కొనేవారికి అలర్ట్.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
- ●TTD Recommendation Letters Cancelled | తిరుమల వెళ్తున్నారా? ఆ లేఖలు చెల్లవు.. టీటీడీ కీలక ప్రకటన
- ●Bhagwant Mann | ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. రూ.50,000 ఫైన్
- ●Jio IPO | జియో ఐపీఓ నేడే ప్రారంభం.. జీఎంపీ వివరాలివే.. బ్రోకరేజీలు ఏమంటున్నాయి..?
- ●Krishna Godavari River Management Board | కృష్ణా, గోదావరి జలాలపై మళ్లీ రగడ: 70:30 వాటాపై తెలంగాణ పట్టు.. ఈ నెల 26, 30 భేటీల్లో తేలేదేంటి?
- ●Stock Markets | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 500 పాయింట్లు జంప్..

Gold And Silver Prices Today | బంగారం కొనేవారికి అలర్ట్.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..

TTD Recommendation Letters Cancelled | తిరుమల వెళ్తున్నారా? ఆ లేఖలు చెల్లవు.. టీటీడీ కీలక ప్రకటన

Bhagwant Mann | ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. రూ.50,000 ఫైన్

Jio IPO | జియో ఐపీఓ నేడే ప్రారంభం.. జీఎంపీ వివరాలివే.. బ్రోకరేజీలు ఏమంటున్నాయి..?



