NIN | క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే జీర్ణవ్యవస్థకు ఎంతో లాభం.. వెల్లడించిన అధ్యయనం..
NIN | క్రమం తప్పకుండా, దీర్ఘకాలంగా వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని అనేక జీవక్రియ వ్యవస్థలపై సానుకూల ప్రభావం ఉంటుందని హైదరాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) తాజా అధ్యయనం వెల్లడించింది.
NIN | క్రమం తప్పకుండా, దీర్ఘకాలంగా వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని అనేక జీవక్రియ వ్యవస్థలపై సానుకూల ప్రభావం ఉంటుందని హైదరాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) తాజా అధ్యయనం వెల్లడించింది. శరీర నిర్మాణం, జీవక్రియల ఆరోగ్యం, ఎముకల దృఢత్వం, గట్ మైక్రోబయోమ్ (జీర్ణవ్యవస్థలోని మంచి బ్యాక్టీరియా) తదితర అంశాల్లో గణనీయమైన మార్పులు కనిపించాయని, దీంతో క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలకు మరిన్ని శాస్త్రీయ ఆధారాలు లభించాయని పరిశోధకులు తెలిపారు. అంతర్జాతీయ జర్నల్ ఫ్రంటియర్స్ ఇన్ న్యూట్రిషన్ లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం.. ఎండ్యూరెన్స్ అథ్లెట్లు సాధారణంగా మరింత సన్నగా ఉండటంతోపాటు విశ్రాంతి సమయంలో కొవ్వును ఎక్కువగా వినియోగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అలాగే వారి రక్తంలో ఆక్సిజన్ రవాణాను మెరుగుపరిచే లక్షణాలు ఎక్కువగా కనిపించాయి. ఇవి ఎక్కువసేపు ఏరోబిక్ పనితీరును కొనసాగించేందుకు సహాయపడే శారీరక అవసరాలుగా పరిశోధకులు పేర్కొన్నారు.
వ్యాయామం చేసే వారిలో మెరుగ్గా మంచి బ్యాక్టీరియా..
ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన సైంటిస్టు డాక్టర్ కె. వెంకటేష్ మాట్లాడుతూ శక్తి ఆధారిత క్రీడల్లో పాల్గొనే అథ్లెట్లలో అస్థిపంజర కండరాల పరిమాణం అధికంగా ఉండటంతోపాటు ఎముకల ఖనిజ సాంద్రత, విశ్రాంతి సమయంలో జీవక్రియల రేటు కూడా ఎక్కువగా నమోదైందన్నారు. ఇవన్నీ రెసిస్టెన్స్ ఆధారిత శిక్షణ, పవర్ స్పోర్ట్స్ అవసరాలకు అనుగుణంగా ఏర్పడే శారీరక మార్పులేనని వివరించారు. ట్రైనింగ్ మోడాలిటీ స్పెసిఫిక్ డిఫరెన్సెస్ ఇన్ బాడీ కంపోజిషన్, రెస్టింగ్ మెటబాలిక్ రేట్, డైట్ అండ్ గట్ మైక్రోబియల్ సిగ్నేచర్స్ ఇన్ ఎలైట్ ఎండ్యూరెన్స్ అండ్ స్ట్రెంగ్త్ అథ్లెట్స్ పేరుతో వెలువడిన ఈ అధ్యయనంలో అథ్లెట్లలో ప్రత్యేకమైన గట్ మైక్రోబయోమ్ లక్షణాలను కూడా గుర్తించారు. వ్యాయామం చేయని వ్యక్తులతో పోలిస్తే ఎలైట్ అథ్లెట్లలో ప్రోటీన్, కొవ్వు జీవక్రియలకు తోడ్పడే బ్యాక్టీరియా అధికంగా ఉండగా, వ్యాయామం చేయని వారిలో లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా స్థాయిలు ఎక్కువగా కనిపించాయి. అలాగే ఎండ్యూరెన్స్, స్ట్రెంగ్త్ అథ్లెట్ల మధ్య కూడా గట్ మైక్రోబయోమ్‌లో తేడాలు గుర్తించడంతో, దీర్ఘకాలిక శిక్షణ, ఆహారపు అలవాట్లు క్రీడల స్వభావానికి అనుగుణంగా గట్ మైక్రోబయోమ్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉందని అధ్యయనం సూచించింది.
శారీరక అవసరాలకు అనుగుణంగా పోషకాహారం..
ఎన్‌ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ భారతి కులకర్ణి మాట్లాడుతూ ఈ అధ్యయనం వివిధ క్రీడల శారీరక అవసరాలకు అనుగుణంగా వ్యక్తిగత పోషకాహారం, శిక్షణ ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరాన్ని మరింత బలపరుస్తోందన్నారు. ఈ శారీరక మార్పులను అర్థం చేసుకోవడం ద్వారా అథ్లెట్ల పనితీరును మెరుగుపరచడం, త్వరగా కోలుకునేలా చేయడం, గాయాల ప్రమాదాన్ని తగ్గించడం సాధ్యమవుతుందని తెలిపారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Lok Sabha | లోక్‌సభ నిరవధిక వాయిదా.. వందేమాతరంతో ముగింపు.. చరిత్రలో తొలిసారి
- ●Black Magic | మహాదేవ్‌పూర్‌లో క్షుద్రపూజల కలకలం.. భయాందోళనలో ప్రజలు
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయమిదే..?
- ●Bigg Boss Kalyan | హీరోగా మారిన బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల - రియల్ లైఫ్ బ్రేకప్ లవ్‌స్టోరీతో డెబ్యూ మూవీ
- ●Red Fort Attack | ఢిల్లీ పేలుడు వెనుక ఆల్‌ఖైదా హస్తం.. UNSC సంచలన నివేదిక
- ●Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు

Lok Sabha | లోక్‌సభ నిరవధిక వాయిదా.. వందేమాతరంతో ముగింపు.. చరిత్రలో తొలిసారి

Black Magic | మహాదేవ్‌పూర్‌లో క్షుద్రపూజల కలకలం.. భయాందోళనలో ప్రజలు

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయమిదే..?

Bigg Boss Kalyan | హీరోగా మారిన బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల - రియల్ లైఫ్ బ్రేకప్ లవ్‌స్టోరీతో డెబ్యూ మూవీ




