త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Flesh Eating Bacteria | అమెరికాలో మాంసాన్ని తినే బ్యాక్టీరియా గుర్తింపు.. వ్యాపిస్తే 48 గంట‌ల్లో మ‌ర‌ణం..

Flesh Eating Bacteria | అమెరికాలోని లాంగ్ ఐలాండ్ అనే ప్రాంతంలో ఉన్న నీటి వ‌న‌రుల్లో మాంసాన్ని తినే (flesh-eating) బ్యాక్టీరియా ఉన్నట్లు శాస్త్ర‌వేత్త‌ల ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. ఈ బ్యాక్టీరియా సోకిన వ్య‌క్తుల‌కు 48 గంట‌ల్లో మ‌ర‌ణం సంభ‌వించే అవ‌కాశాలు 20 శాతం వ‌ర‌కు ఉన్నాయ‌ని సైంటిస్టులు హెచ్చ‌రిస్తున్నారు.

S

Lifestyle | Published On Apr 24, 2026, 2.46 pm IST

Flesh Eating Bacteria | అమెరికాలో మాంసాన్ని తినే బ్యాక్టీరియా గుర్తింపు.. వ్యాపిస్తే 48 గంట‌ల్లో మ‌ర‌ణం..
Advertisement

Flesh Eating Bacteria | అమెరికాలోని లాంగ్ ఐలాండ్ అనే ప్రాంతంలో ఉన్న నీటి వ‌న‌రుల్లో మాంసాన్ని తినే (flesh-eating) బ్యాక్టీరియా ఉన్నట్లు శాస్త్ర‌వేత్త‌ల ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. ఈ బ్యాక్టీరియా సోకిన వ్య‌క్తుల‌కు 48 గంట‌ల్లో మ‌ర‌ణం సంభ‌వించే అవ‌కాశాలు 20 శాతం వ‌ర‌కు ఉన్నాయ‌ని సైంటిస్టులు హెచ్చ‌రిస్తున్నారు. Vibrio vulnificus అనే ఈ బ్యాక్టీరియా శరీరంలో వేగంగా వ్యాప్తి చెందుతుంద‌ని, వెంటనే చికిత్స చేయకపోతే ప్రాణాంతక సమస్యలకు దారి తీస్తుంద‌ని తెలిపారు. స్టోనీ బ్రుక్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.

48 గంటల్లో 20 శాతం మ‌ర‌ణ ప్ర‌మాదం..

పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ క్రిస్టొఫ‌ర్ గాబ్ల‌ర్ మాట్లాడుతూ ఈ బ్యాక్టీరియా ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువ ప్రమాదకరమ‌ని తెలిపారు. వేడి నీటి వ‌ల్ల ఈ బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంద‌ని అన్నారు. ఈ బ్యాక్టీరియాను ఇప్పటికే సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ “ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియాగా పేర్కొన్న‌ట్లు తెలిపారు. ఈ బ్యాక్టీరియా గాయాలు లేదా కోతల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంద‌ని గాబ్లర్ హెచ్చరించారు. ఇది చాలా తీవ్రమైన ఇన్ఫెక్షన్ అని, గాయాలు లేదా పుండ్ల‌ను స‌రిగ్గా మూసి ఉంచ‌క‌పోతే శరీరంలోకి చేరుతుందని తెలిపారు. ఈ బ్యాక్టీరియా సోకినవారికి కేవలం 48 గంటల్లోనే 20 శాతం మరణ ప్రమాదం ఉంటుంద‌ని ఆయన తెలిపారు.

ప్ర‌మాద‌క‌రంగా మారిన చెరువులు, స‌రస్సులు..

ఈ సమస్య కొన్ని చెరువులకు మాత్రమే పరిమితం కాదని, East Quogue వంటి ప్రాంతాల్లో కూడా నీరు కలుషితమై, షెల్‌ఫిష్ తినడానికి కూడా ప్రమాదకరంగా మారిందని ఆయన చెప్పారు. స్థానిక నివాసితులు కూడా నీటి నాణ్యత తగ్గిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాబ్లర్ తెలిపిన ప్రకారం లాంగ్ ఐలాండ్‌లోని స‌గ‌పొనాక్‌, మెకాక్స్ బే, జార్జికా వంటి అనేక సరస్సులు, చెరువుల్లో హానికర అల్గీ బ్లూమ్స్ పెరుగుతున్నాయ‌ని తెలిపారు. ఇవి విషపదార్థాలను విడుదల చేసి సముద్ర జీవాలకు, ఆస్టర్ పరిశ్రమకు, మనుషులకు కూడా హానికరం అవుతున్నాయని పేర్కొన్నారు. భూమి నుంచి సముద్రానికి చేరే నైట్రోజన్ ప్రధాన కారణమని, సఫ్ఫోక్ కౌంటీలో సెప్టిక్ సిస్టమ్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతోంద‌ని తెలిపారు.

2023లో తొలిసారిగా గుర్తింపు..

కాగా ఈ బ్యాక్టీరియా మొదటగా గల్ఫ్ ఆఫ్ మెక్సికో వంటి వేడి తీర ప్రాంత జలాల్లో కనిపించింది. 2023లో లాంగ్ ఐలాండ్ సౌండ్‌లో మొదట గుర్తించిన‌ ఈ బ్యాక్టీరియా ఇప్ప‌టికే మూడు మరణాలకు కారణమైంది. అప్పటి నుంచి ఇది మరిన్ని నీటి వనరులకు వ్యాపించింది. లాంగ్ ఐలాండ్‌లో కుక్కలు సరస్సు నీరు తాగి అనారోగ్యానికి గురై మరణించిన ఘటనలు కూడా ఉన్నాయ‌ని గాబ్లర్ పేర్కొన్నారు. 2023 తరువాత కొత్త మరణాలు నమోదుకాలేదని చెప్పినా, ముఖ్యంగా వేసవి కాలంలో ఈ బ్యాక్టీరియా ప్రమాదం ఇంకా కొనసాగుతూనే ఉందని హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement