త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dangerous Countries in the World | ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన టాప్ 40 దేశాలు ఇవే.. ఈ ప్రాంతాలకు వెళ్లే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి!

ప్రపంచవ్యాప్తంగా నేరాల రేటు, భద్రతా ప్రమాణాల ఆధారంగా 2026 సంవత్సరానికి గాను అత్యంత ప్రమాదకరమైన 40 దేశాల జాబితాను 'నంబియో' (Numbeo) సంస్థ విడుదల చేసింది. దొంగతనాలు, దాడులు, అవినీతి వంటి పలు అంశాల ఆధారంగా రూపొందించిన ఈ జాబితాలో పాపువా న్యూ గినియా మొదటి స్థానంలో నిలవగా, ఫ్రాన్స్ లాంటి అభివృద్ధి చెందిన దేశం కూడా ఉండటం గమనార్హం.

J

International | Published On Mar 17, 2026, 12.02 pm IST

Dangerous Countries in the World | ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన టాప్ 40 దేశాలు ఇవే.. ఈ ప్రాంతాలకు వెళ్లే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి!
Advertisement

Dangerous Countries in the World | త్రినేత్ర.న్యూస్ : ప్రశాంతతను కోరుకోని మనిషి ఉండడు. కానీ రోజురోజుకూ పెరుగుతున్న నేరాలు, హింస కారణంగా కొన్ని దేశాల్లో బతకడం అంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవడమే. తాజాగా, ప్రముఖ గ్లోబల్ డేటా ప్లాట్‌ఫారమ్ 'నంబియో' (Numbeo) 2026 సంవత్సరానికి సంబంధించిన 'క్రైమ్ ఇండెక్స్' (Crime Index) నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 40 దేశాల జాబితాను వెల్లడించింది. పర్యాటకంగా లేదా ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లాలనుకునే వారు తప్పక తెలుసుకోవాల్సిన జాబితా ఇది.

ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన టాప్ 40 దేశాలు (2026)

  • పాపువా న్యూ గినియా (Papua New Guinea)
  • వెనిజులా (Venezuela)
  • హైతీ (Haiti)
  • ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan)
  • దక్షిణాఫ్రికా (South Africa)
  • హోండురాస్ (Honduras)
  • ట్రినిడాడ్ అండ్ టొబాగో (Trinidad and Tobago)
  • సిరియా (Syria)
  • జమైకా (Jamaica)
  • గయానా (Guyana)
  • పెరూ (Peru)
  • కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ (DR Congo)
  • నైజీరియా (Nigeria)
  • కామెరూన్ (Cameroon)
  • అంగోలా (Angola)
  • బొలీవియా (Bolivia)
  • బ్రెజిల్ (Brazil)
  • నమీబియా (Namibia)
  • అర్జెంటీనా (Argentina)
  • సోమాలియా (Somalia)
  • ఈక్వెడార్ (Ecuador)
  • యెమెన్ (Yemen)
  • బంగ్లాదేశ్ (Bangladesh)
  • ప్యూర్టో రికో (Puerto Rico)
  • కొలంబియా (Colombia)
  • మొజాంబిక్ (Mozambique)
  • చిలీ (Chile)
  • జింబాబ్వే (Zimbabwe)
  • డొమినికన్ రిపబ్లిక్ (Dominican Republic)
  • పరాగ్వే (Paraguay)
  • యుఎస్ వర్జిన్ ఐలాండ్స్ (US Virgin Islands)
  • గ్వాటెమాల (Guatemala)
  • బహామాస్ (Bahamas)
  • ఎల్ సాల్వడార్ (El Salvador)
  • ఫిజీ (Fiji)
  • ఫ్రాన్స్ (France)
  • లిబియా (Libya)
  • ఐవరీ కోస్ట్ (Ivory Coast)
  • కెన్యా (Kenya)
  • ఉగాండా (Uganda)

ఈ ర్యాంకింగ్స్ దేని ఆధారంగా ఇస్తారు? (Crime Index Factors)

నంబియో సంస్థ ఏవో సాధారణ లెక్కల ఆధారంగా కాకుండా.. ఆయా దేశాల్లోని పరిస్థితులను, ప్రజల భద్రతను విశ్లేషించి ఈ జాబితాను రూపొందించింది. ప్రధానంగా ఈ క్రింది అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.

ప్రజల్లో భయం (Overall crime perception): ఆ దేశంలో నేరాలపై ప్రజల్లో ఉన్న అవగాహన, భయం.

ఒంటరి ప్రయాణం (Safety walking alone): పగలు లేదా రాత్రి వేళల్లో ఒంటరిగా రోడ్డుపై నడిచి వెళ్లగల భద్రత.

దోపిడీలు (Mugging and robbery risk): దారిన పోయే వారిని బెదిరించి దోచుకోవడం.

వాహనాల చోరీ (Car theft risk): కార్లు, ఇతర వాహనాల దొంగతనాలు.

ఇళ్లలో దొంగతనాలు (Burglary risk): ఇళ్లు, దుకాణాలను పగులగొట్టి చేసే దొంగతనాలు.

భౌతిక దాడులు (Physical attack risk): వ్యక్తులపై జరిగే భౌతిక దాడుల ముప్పు.

వేధింపులు (Harassment risk): బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, ఇతర వర్గాలపై జరిగే వేధింపులు.

మాదకద్రవ్యాలు (Drug issues): డ్రగ్స్ వాడకం, సరఫరా వల్ల తలెత్తే సమస్యలు.

ఆస్తి నేరాలు (Property crime level): ఆస్తుల ఆక్రమణ, విధ్వంసానికి సంబంధించిన నేరాలు.

హింసాత్మక నేరాలు (Violent crime level): తీవ్రమైన గాయాలు, ప్రాణనష్టం కలిగించే దాడులు.

అవినీతి (Corruption and bribery): ప్రభుత్వ, ప్రైవేటు వ్యవస్థల్లో పేరుకుపోయిన లంచగొండితనం.

ముఖ్యంగా పాపువా న్యూ గినియా, వెనిజులా, హైతీ వంటి దేశాలలో అంతర్గత కలహాలు, ఆర్థిక మాంద్యం కారణంగా నేరాల రేటు విపరీతంగా పెరిగిపోయిందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

Top 40 Most Dangerous Countries in the World for 2026 by Numbeo Crime Index

Advertisement
Advertisement