Qatar Helicopter Crash | ఖతార్‌లో హెలికాప్టర్ ప్రమాదం.. ఆరుగురు మృతి, మరొకరు గల్లంతు
Qatar Helicopter Crash | వెస్ట్ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఖతార్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కతార్ సముద్ర జలాల్లో ఆదివారం తెల్లవారు జామున హెలికాప్టర్ కూలిపోయింది.
International | Published On Mar 22, 2026, 2.45 pm IST
Qatar Helicopter Crash | వెస్ట్ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఖతార్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కతార్ సముద్ర జలాల్లో ఆదివారం తెల్లవారు జామున హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో గురు మృతి చెందగా, మరొకరు గల్లంతయ్యారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రమాదం అనంతరం తక్షణం సహాయక చర్యలు అధికారులు ప్రారంభించారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. సముద్ర తీర భద్రతా బృందాలు, రక్షణ సిబ్బంది తక్షణమే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, సముద్ర పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో రక్షణ చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి.
ఈ ఘటనను మొదట ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ గుర్తించినట్లు సమాచారం. అనంతరం ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం పలు విభాగాలు కలిసి పని చేస్తున్నాయని పేర్కొంది. సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా రక్షణ నౌకలు, నిఘా పరికరాలు, శిక్షణ పొందిన సిబ్బందిని వినియోగిస్తున్నారు. గాలింపు వేగవంతం చేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సముద్రం, వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తున్నారు. రక్షణ చర్యలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. గల్లంతైన వ్యక్తిని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం పేర్కొంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






