త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Madame Tussauds London | భారత సెలబ్రిటీల మైనపు విగ్రహాలను చూస్తారా? మే 1 నుంచి మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రదర్శన స్టార్ట్

ఇప్పటికే లండన్‌లో భారతీయులు ఉంటే, లేదా జూన్ 30 లోపు లండన్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటే మేడమ్ టుస్సాడ్స్‌ను కూడా సందర్శించి పలువురు భారత ప్రముఖుల మైనపు విగ్రహాల ప్రదర్శనను చూడొచ్చు. సాధారణ ఎంట్రీ టికెట్‌తోనే ఈ ప్రదర్శనకు మ్యూజియం అనుమతినిస్తోంది.

J

International | Published On May 3, 2026, 6.56 pm IST

Madame Tussauds London | భారత సెలబ్రిటీల మైనపు విగ్రహాలను చూస్తారా? మే 1 నుంచి మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రదర్శన స్టార్ట్
Advertisement

Madame Tussauds London | లండన్‌లో ఉన్న ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం తెలుసు కదా. ఈ మ్యూజియంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తుల మైనపు విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. మన దేశం నుంచి ఇప్పటికే ఇక్కడ బాలీవుడ్, టాలీవుడ్, క్రికెట్ ప్రముఖుల మైనపు విగ్రహాలను ఏర్పాటు చేశారు. బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్, ఐశ్వర్యారాయ్, దీపికా పడుకోణ్, ప్రియాంకా చోప్రా, హృతిక్ రోషన్, రణ్‌వీర్ సింగ్, కత్రినా కైఫ్, మాధురీ దీక్షిత్, టాలీవుడ్ నుంచి కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. క్రికెట్ ప్రముఖులైన సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీ విగ్రహాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు హాలీవుడ్ ప్రముఖులు, వరల్డ్ సెలబ్రిటీల మైనపు విగ్రహాలు కూడా అక్కడ కొలువుదీరాయి. ఈనేపథ్యంలో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మే 1 నుంచి ఆయా మైనపు విగ్రహాల ప్రదర్శనను ప్రారంభించారు.

madame Tussauds London launches icons of india exhibition from may 1st 2026

జూన్ 30 వరకు ప్రదర్శన

మే 1 నుంచి జూన్ 30 వరకు రెండు నెలల పాటు ఈ ప్రదర్శన అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే ఉన్న విగ్రహాలతో పాటు మరికొన్ని విగ్రహాలను సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ నుంచి తీసుకొచ్చి ప్రదర్శనలో ఉంచుతున్నారు. సింగపూర్ నుంచి కాజల్ అగర్వాల్ విగ్రహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ప్రదర్శనలో ఉంచారు. కేవలం భారతీయుల కోసమే ప్రత్యేకంగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ ప్రదర్శనను తీర్చిదిద్దారు.

madame Tussauds London launches icons of india exhibition from may 1st 2026

ఇప్పటికే లండన్‌లో భారతీయులు ఉంటే, లేదా జూన్ 30 లోపు లండన్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటే మేడమ్ టుస్సాడ్స్‌ను కూడా సందర్శించి పలువురు భారత ప్రముఖుల మైనపు విగ్రహాల ప్రదర్శనను చూడొచ్చు. సాధారణ ఎంట్రీ టికెట్‌తోనే ఈ ప్రదర్శనకు మ్యూజియం అనుమతినిస్తోంది.

madame Tussauds London launches icons of india exhibition from may 1st 2026 madame Tussauds London launches icons of india exhibition from may 1st 2026

Advertisement
Advertisement