US F-35 | రెండో ఎఫ్-35ను కూల్చివేశాం : ఇరాన్
US F-35 | అమెరికాకు చెందిన రెండో ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్‌ను (US F-35) కూల్చివేసినట్లు ఇరాన్ తాజాగా ప్రకటించింది. కూలిన వెంటనే విమానం పేలిపోయినట్లు తెలిపింది. ఈ ఘటనలో పైలట్ బతికే అవకాశం లేదని పేర్కొంది.
International | Published On Apr 3, 2026, 12.29 pm IST
US F-35 | మధ్యప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ (Iran)పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులను కొనసాగిస్తున్నాయి. టెహ్రాన్ సైతం శత్రు దాడులను ధీటుగా ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన రెండో ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్‌ను (US F-35) కూల్చివేసినట్లు ఇరాన్ తాజాగా ప్రకటించింది. కూలిన వెంటనే విమానం పేలిపోయినట్లు తెలిపింది. ఈ ఘటనలో పైలట్ బతికే అవకాశం లేదని పేర్కొంది. కాగా, ఎఫ్-35 కూలిన ఫొటోను ఇరాన్ మీడియా విడుదల చేసింది. అయితే, ఆ ఫొటోలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవి ఎఫ్-35 శకలాలు కాదని, ఎఫ్-15 ఫైటర్ జెట్‌కు చెందినవని ఏరోస్పేస్ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ దాడిపై అమెరికా ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
కాగా, ప్రపంచంలోనే అత్యాధునిక ఫైటర్ జెట్‌గా పేరుపొందిన అమెరికా ఎఫ్-35 లైట్నింగ్-2 యుద్ధ విమానం (F-35 Fighter Jet) గత నెల ఎమర్జెన్సీ లాండింగ్ (Emergency Landing) కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇరాన్‌పై సైనిక చర్యల్లో పాలుపంచుకున్న ఆ యుద్ధ విమానం అకస్మాత్తుగా వెనుదిరిగి సమీపంలోని అమెరికా సైనిక స్థావరంలో అత్యవసరంగా దిగిపోయింది. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ (US Central Command) కూడా ధ్రువీకరించింది. ఎఫ్-35 విమానం సురక్షితంగా లాండ్ అయ్యిందని, పైలట్ సేఫ్‌గా ఉన్నారని వెల్లడించింది. అయితే, ఆ విమానంపై తామే దాడి చేసినట్లు ఇరాన్ అప్పట్లో ప్రకటించింది. యూఎస్ ఎఫ్-35 యుద్ధ విమానంపై తాము దాడి చేశామని ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. కానీ ఐఈఆర్‌జీసీ ప్రకటనను అమెరికా ఖండించింది. కేవలం ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యిందని తెలిపింది.
Also Read..
ఆలయ ఉత్సవం.. ఐదు గంటలపాటూ విమాన రాకపోకలు నిలిపివేత
విమానాల్లో 60 శాతం ఉచిత సీట్ల ఉత్తర్వులను నిలిపివేసిన కేంద్రం
మౌనమే.. కానీ, ఓటమి కాదు.. ఆప్‌ను ఉద్దేశించి రాఘవ్ చద్ధా ఆసక్తికర వీడియో
సంబంధిత వార్తలు

US Senate | ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్ దూకుడుకు అమెరికా సెనేట్ బ్రేక్
మే 20, 2026

Barakah nuclear facility | ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
మే 18, 2026

PM Modi | ఇది 12 ఏళ్ల మోదీ ప్రభుత్వ పాలన వైఫల్యానికి నిదర్శనం.. ప్రధాని పొదుపు సూచనలపై విపక్షాలు ఫైర్
మే 11, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



