త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UNSC | గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ఆపాలి.. ఐరాస‌లో తీర్మానం

UNSC | ఇజ్రాయెల్‌, అమెరికా దాడుల‌కు ప్ర‌తీకారంగా గ‌ల్ఫ్ దేశాల‌పై (Gulf Countries) ఇరాన్ (Iran) కొన‌సాగిస్తున్న ప్ర‌తీకార దాడుల‌ను ఐక్య‌రాజ్య స‌మితి భ‌ద్రతా మండ‌లి (United Nations Security Council) తీవ్రంగా ఖండించింది.

D

International | Published On Mar 12, 2026, 3.28 pm IST

UNSC | గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ఆపాలి.. ఐరాస‌లో తీర్మానం
Advertisement

UNSC | ఇజ్రాయెల్‌, అమెరికా దాడుల‌కు ప్ర‌తీకారంగా గ‌ల్ఫ్ దేశాల‌పై (Gulf Countries) ఇరాన్ (Iran) కొన‌సాగిస్తున్న ప్ర‌తీకార దాడుల‌ను ఐక్య‌రాజ్య స‌మితి భ‌ద్రతా మండ‌లి (United Nations Security Council) తీవ్రంగా ఖండించింది. గ‌ల్ఫ్ దేశాల‌పై దాడుల‌ను ఆపాలని డిమాండ్ చేసింది. ఈ మేర‌కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రవేశ పెట్టిన తీర్మానం భారీ మెజారిటీతో ఆమోదం పొందింది. ఈ తీర్మానానికి భారతదేశం కో-స్పాన్సర్‌‌గా నిలిచి తన వ్యూహాత్మక మద్దతును ప్రకటించడం విశేషం.

గ‌ల్ఫ్ దేశాల‌పై ఇరాన్ చేప‌డుతున్న దాడుల‌ను ఆపాలని డిమాండ్ చేస్తూ బ‌హ్రెయిన్ ఈ తీర్మానాన్ని ఐరాస (UNSC)లో ప్ర‌వేశ‌పెట్టింది. బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, జోర్డాన్ వంటి దేశాలపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేసింది. ఈ తీర్మానానికి భార‌త్ స‌హా 135 దేశాలు కో స్పాన్స‌ర్స్‌గా ఉన్నాయి. ఇరాన్ దాడులు అంత‌ర్జాతీయ చ‌ట్టాల‌ను ఉల్లంఘిస్తున్నాయ‌ని.. ఇది ప్రపంచ శాంతికి పెను ముప్పుగా మారిందని తీర్మానం పేర్కొంది. భద్రతా మండలిలో మొత్తం 15 సభ్య దేశాలు ఉండగా.. 13 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి.

ఈ తీర్మానానికి వ్య‌తిరేకంగా ఎవ‌రూ ఓటు వేయ‌లేదు. ఇరాన్ మిత్ర‌దేశాలైన చైనా, ర‌ష్యా దేశాలు ఈ తీర్మానానికి క‌నీసం అడ్డుకూడా చెప్ప‌లేదు. ఈ రెండు దేశాలూ ఓటింగ్ ప్ర‌క్రియ‌కు దూరంగా ఉన్నాయి. అయితే, ఈ తీర్మానంపై మాత్రం అసంతృప్తి వ్య‌క్తం చేశాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడ‌ర్ అయ‌తొల్లా అలీ ఖ‌మేనీ మ‌ర‌ణించిన విష‌యాన్ని తీర్మానంలో ప్ర‌స్తావించ‌క‌పోవ‌డాన్ని తీవ్రంగా త‌ప్పుబ‌ట్టాయి.

Also Read..

Explosions In Dubai | ఇరాన్ డ్రోన్ల దాడి.. భారీ శ‌బ్దాల‌తో ద‌ద్ద‌రిల్లిన దుబాయ్ న‌గ‌రం

లాక్‌డౌన్‌ను గుర్తు చేస్తున్న ఎల్పీజీ కొర‌త‌.. ఉపాధి కోల్పోయి రోడ్డున ప‌డుతున్న కార్మికులు

ప్ర‌ధాని అయినా స‌రే ముందుగా నోటీసు ఇవ్వాల్సిందే.. ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడే హ‌క్కు ఎవ‌రికీ లేదు : ఓం బిర్లా

Advertisement
Advertisement