త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India Condoles Khamenei Death | ఖమేనీ మరణంపై భారత్ సంతాపం.. ఇరాన్ రాయబారిని కలిసిన విదేశాంగ కార్యదర్శి

ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణంపై భారత్ అధికారికంగా సంతాపం వ్యక్తం చేసింది. దౌత్యపరమైన వ్యూహంతో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి ఇరాన్ రాయబారిని కలిసి సానుభూతి తెలిపారు.

J

International | Published On Mar 5, 2026, 5.11 pm IST

India Condoles Khamenei Death | ఖమేనీ మరణంపై భారత్ సంతాపం.. ఇరాన్ రాయబారిని కలిసిన విదేశాంగ కార్యదర్శి
Advertisement

India Condoles Khamenei Death | త్రినేత్ర.న్యూస్ : ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం పట్ల భారత ప్రభుత్వం అధికారికంగా సంతాపం ప్రకటించింది. అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానికి దాడుల్లో ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించి, సంతాప పుస్తకంలో సంతకం చేశారు. ఇరాన్ రాయబారిని కలిసి, భారత ప్రభుత్వం తరపున ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

వ్యూహాత్మక మౌనం వీడిన భారత్

శనివారం టెహ్రాన్‌పై అమెరికా - ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడుల్లో 86 ఏళ్ల ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి జరిగిన వెంటనే భారత్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినప్పటికీ, భారత్ "వేచి చూసే" ధోరణిని అవలంబించింది. అయితే, తాజాగా విదేశాంగ కార్యదర్శి స్వయంగా వెళ్లి సంతాపం తెలపడం ద్వారా భారత్ తన దౌత్యపరమైన వైఖరిని స్పష్టం చేసింది.

శాంతికి ప్రధాని మోదీ పిలుపు

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. "ఏ సమస్యనైనా చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ ఎప్పుడూ కోరుకుంటుంది. యుద్ధం దేనికీ పరిష్కారం కాదు," అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే గల్ఫ్ దేశాల నేతలతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడి, అక్కడి భారతీయుల భద్రతపై సమీక్షించారు.

ఖమేనీ మరణాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు. "చరిత్రలోనే అత్యంత క్రూరమైన వ్యక్తులలో ఒకరైన ఖమేనీ అంతం కావడమే న్యాయం. ఇది ఇరాన్ ప్రజలకు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే గొప్ప అవకాశం," అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌ను అమెరికా, ఇజ్రాయెల్ అత్యంత రహస్యంగా, సమర్థవంతంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

Advertisement
Advertisement