Telugu student dies in US | అమెరికాలో విషాదం : ముగ్గురి ప్రాణాలు కాపాడి.. ప్రాణాలు వదిలిన తెలుగు విద్యార్థి
అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. నదిలో మునిగిపోతున్న ముగ్గురు స్నేహితులను కాపాడిన హైదరాబాద్‌కు చెందిన అనురుప్ రెడ్డి (24) ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయాడు.
International | Published On May 31, 2026, 5.12 pm IST
- స్నేహితుల కోసం ప్రాణత్యాగం
- అమెరికా నదిలో మునిగిపోయి హైదరాబాద్ విద్యార్థి దుర్మరణం
Telugu student dies in US | త్రినేత్ర.న్యూస్ : అమెరికాలో (US) మరో తెలుగోడు ప్రాణాలు కోల్పోయాడు. సరదాగా స్విమ్మింగ్ చేద్దామని వెళ్లిన ఆ యువకుడు.. తన కళ్లెదుటే నీటమునిగిపోతున్న ముగ్గురు స్నేహితులను సురక్షితంగా కాపాడాడు. కానీ, దురదృష్టవశాత్తూ అదే నదిలో కాలికి తాడు చుట్టుకోవడంతో అతను మాత్రం నీటిలో మునిగి ప్రాణాలు వదిలాడు. లూసియానా (Louisiana) రాష్ట్రంలో జరిగిన ఈ విషాద ఘటనలో హైదరాబాద్‌కు చెందిన అనురుప్ రెడ్డి (24) మృతి చెందాడు.
అసలేం జరిగిందంటే
స్థానిక రిపోర్ట్స్ ప్రకారం.. అనురుప్ తన స్నేహితులతో కలిసి టోరో రోడ్ పార్క్ సమీపంలోని సబైన్ రివర్‌లో (Sabine River) ఔటింగ్ కు వెళ్లాడు. ఆ సమయంలో నీటిలో దిగిన ముగ్గురు ఫ్రెండ్స్ ప్రవాహానికి కొట్టుకుపోతూ ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్నారు. ఇది గమనించిన అనురుప్ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే నీటిలోకి దూకి ఆ ముగ్గురినీ ఒక్కొక్కరిగా సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు.
అయితే, వారిని కాపాడి తిరిగి ఒడ్డుకు వచ్చే క్రమంలో అనురుప్ కాలికి చేపలు పట్టే తాడు (Fishing line) గట్టిగా చుట్టుకుంది. దీంతో అతడు కదలలేకపోయాడు. అదే సమయంలో నదిలో నీటి ప్రవాహం ఉధృతం కావడంతో అతడు పైకి రాలేకపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయింది. అతడిని బయటకు తీసి దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే అనురుప్ చనిపోయినట్లు డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు.
ఉద్యోగ వేటలో ఉండగానే
అనురుప్ రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని కవాడిపల్లి గ్రామం. రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేందర్ రెడ్డికి ఇతడు రెండో కుమారుడు. ఉన్నత చదువుల (Higher education) కోసం ఐదేళ్ల క్రితం తన అన్న ఆశ్రిత్ రెడ్డితో కలిసి అనురుప్ అమెరికా వెళ్లాడు. నార్త్ టెక్సాస్ యూనివర్సిటీ నుంచి రీసెంట్‌గానే కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ (MS) కంప్లీట్ చేశాడు. తన ప్రొఫెషనల్ కెరీర్ స్టార్ట్ చేద్దామనుకుంటున్న టైమ్‌లో ఇలా జరగడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
అనురుప్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు, అమెరికాలోని స్థానిక ఎన్నారై (NRI) సంఘాలు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి.
తాజావార్తలు
- ●US NRI Returning To India | NRIలు ఇండియాకు ఎందుకు తిరిగి రారు? ఈ నిజాలు తెలిస్తే షాక్!
- ●Bulandshahr Monkey Viral Video | వర్షంలా రాలిన రూ.500 నోట్లు.. లాయర్ బ్యాగ్ లాక్కొని చెట్టెక్కిన కోతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- ●Sridhar Vembu AI Bubble | 1999 డాట్-కామ్ క్రాష్ రిపీట్ కాబోతోందా? 'AI బబుల్'పై జోహో ఫౌండర్ శ్రీధర్ వేంబు స్ట్రాంగ్ వార్నింగ్
- ●Harish Rao | 'రైతు డిస్కం' వ్యవసాయానికి ఉరితాడు.. సోలార్ పవర్‌తో 24 గంటల కరెంట్ ఎలా ఇస్తారు? సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్
- ●Mallu Ravi | కేటీఆర్, హరీష్ రావులకు మతిస్థిమితం లేదు.. కూల్చేస్తాం, పేల్చేస్తాం అంటారా? ఎంపీ మల్లు రవి ఫైర్
- ●Kajal Aggarwal | పొట్టి డ్రెస్‌లో కాజల్ అందాల విందు

US NRI Returning To India | NRIలు ఇండియాకు ఎందుకు తిరిగి రారు? ఈ నిజాలు తెలిస్తే షాక్!

Bulandshahr Monkey Viral Video | వర్షంలా రాలిన రూ.500 నోట్లు.. లాయర్ బ్యాగ్ లాక్కొని చెట్టెక్కిన కోతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Sridhar Vembu AI Bubble | 1999 డాట్-కామ్ క్రాష్ రిపీట్ కాబోతోందా? 'AI బబుల్'పై జోహో ఫౌండర్ శ్రీధర్ వేంబు స్ట్రాంగ్ వార్నింగ్

Harish Rao | 'రైతు డిస్కం' వ్యవసాయానికి ఉరితాడు.. సోలార్ పవర్‌తో 24 గంటల కరెంట్ ఎలా ఇస్తారు? సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్



