Pet Dogs Escape | మాంసం కోసం ఎత్తుకెళ్తుండగా ట్రక్ నుంచి దూకిన పెంపుడు కుక్కలు.. ఆ తర్వాత ఏమైందంటే? VIDEO
ఒకే ప్రాంతానికి చెందిన కుక్కలు కావడంతో అవన్నీ ఇది వరకు చాలాసార్లు కలిసి తిరగడం వల్ల అన్నీ కలిసి తమ ఓనర్స్ వద్దకు వెళ్లేందుకు కలిసికట్టుగా ముందుకు సాగాయని రెస్క్యూ టీమ్ తెలిపింది.
Viral news | Published On Mar 24, 2026, 3.44 pm IST
Pet Dogs Escape | మాంసం కోసం కోళ్లు, మేకలను పెంచుకుంటాం. వాటిని కోసుకొని తింటాం. కానీ.. కుక్కలను మన దగ్గర ఎవ్వరూ తినరు. కానీ.. కొన్ని దేశాల్లో కుక్కలనే ఎక్కువగా మాంసం కోసం వినియోగిస్తుంటారు. చైనా లాంటి దేశాల్లో అయితే పెంపుడు కుక్కలను కూడా వదలరు. వాటిని ఎత్తుకెళ్లి మరీ మాంసం కోసం చంపేస్తుంటారు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఖరీదైన బ్రీడ్‌కి చెందిన పెంపుడు కుక్కలు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లడం వాహనదారుల కంట పడింది. అసలు ఏం జరిగింది అని ఆరా తీయగా ఆ పెంపుడు కుక్కలను మాంసం కోసం ట్రక్‌లో దొంగతనంగా తీసుకెళ్తుండగా అవి ట్రక్ నుంచి దూకి తప్పించుకున్నాయి. అక్కడి నుంచి 17 కిమీలు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లి తమ ఓనర్స్ ఇంటికి చేరుకున్నాయి. అందులో కొర్గి అనే బ్రీడ్‌కి చెందిన కుక్క మిగితా కుక్కలకు దారి చూపిస్తూ వాటిని తమ ఓనర్స్ ఇంటికి చేరుకునేలా కృషి చేసింది. ఆ కుక్కల్లో జెర్మన్ షెఫర్డ్, గోల్డెన్ రిట్రీవర్స్, లాబ్రడార్స్, పెకింగెస్, ఇంకా కొన్ని ఇతర బ్రీడ్స్‌కి చెందిన కుక్కలు ఉన్నాయి. అవన్నీ జిలిన్ ప్రావిన్స్‌లో ఉండే కుక్కలు. వాటిని జిలిన్ ప్రావిన్స్‌లోని మూడు ఇళ్లలో నుంచి దొంగలించి ట్రక్‌లో తరలించబోయారు.
బిజీ హైవేపై క్రమశిక్షణతో నడుస్తూ
చాంగ్‌షువాంగ్ ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్న ట్రక్ నుంచి దూకిన ఆ కుక్కలు క్రమశిక్షణతో ఒక కుక్క వాటికి సూచనలు ఇస్తున్నట్టుగా కనిపిస్తుండగా, మిగితా కుక్కలు దాన్ని ఫాలో అవుతూ హైవే సైడ్‌లో వాహనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుచుకుంటూ వెళ్లడం చూసి వాహనదారులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన మార్చి 15న జరిగినట్లు తెలుస్తోంది. వాటి క్రమశిక్షణ చూసి వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది.
ఒక కుక్కకు గాయమైనా వదలకుండా..
వాటిలో జెర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన కుక్కకి గాయాలయినా దాన్ని వదలకుండా దాన్ని కూడా జాగ్రత్తగా వాటితో పాటే తీసుకెళ్లడం వీడియోలో చూడొచ్చు. హైవేపై 17 కిమీలు అలాగే నడుచుకుంటూ వెళ్లాయి. లోకల్ వాలంటీర్లకు ఈ విషయం తెలియడంతో వెంటనే వాటిని రక్షించి ఓనర్స్‌కి వాటిని అప్పగించారు.
ఒకే ప్రాంతానికి చెందిన కుక్కలు కావడంతో అవన్నీ ఇది వరకు చాలాసార్లు కలిసి తిరగడం వల్ల అన్నీ కలిసి తమ ఓనర్స్ వద్దకు వెళ్లేందుకు కలిసికట్టుగా ముందుకు సాగాయని రెస్క్యూ టీమ్ తెలిపింది.
https://x.com/Yoda4ever/status/2036105694357897479
తాజావార్తలు
- ●TN CM Vijay | రోజుకు 20 గంటల పని.. ఉదయం 4కే మంత్రులకు ఫోన్స్ చేస్తున్న తమిళనాడు సీఎం విజయ్
- ●Minister Uttam | ప్రతి చుక్కకూ లెక్కుండాలి
- ●MoRTH | గ్రీన్ వాహన యజమానులకు గుడ్ న్యూస్.. మరో 5 ఏళ్లు పెరగనున్న లైఫ్..
- ●CM Revanth Reddy | కులవృత్తులను కొనసాగించండి.. సీఎం రేవంత్ పిలుపు
- ●Chiranjeevi | ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ - 71 ఏళ్ల వయసులో మెగాస్టార్ స్టైలిష్ ఫొటోషూట్
- ●Mahesh Kumar | సీఎం రేవంత్‌రెడ్డి కాదు.. రేవంత్ గౌడ్.. ఆయన మాకు సోదరుడి లాంటివారు

TN CM Vijay | రోజుకు 20 గంటల పని.. ఉదయం 4కే మంత్రులకు ఫోన్స్ చేస్తున్న తమిళనాడు సీఎం విజయ్

Minister Uttam | ప్రతి చుక్కకూ లెక్కుండాలి

MoRTH | గ్రీన్ వాహన యజమానులకు గుడ్ న్యూస్.. మరో 5 ఏళ్లు పెరగనున్న లైఫ్..

CM Revanth Reddy | కులవృత్తులను కొనసాగించండి.. సీఎం రేవంత్ పిలుపు






