త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manish Kumar Japan Deportation | జపాన్‌లో భారతీయుడికి కన్నీటి కష్టాలు: 30 ఏళ్ల తర్వాత ‘గో బ్యాక్ టు ఇండియా’ అంటున్న అధికారులు.. కారణం ఇదే!

జపాన్‌లో 18 ఏళ్లుగా రెస్టారెంట్ నడుపుతున్న భారతీయుడికి చేదు అనుభవం ఎదురైంది. వీసా రెన్యువల్ నిరాకరించిన అధికారులు, వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. అసలేం జరిగిందంటే?

J

International | Published On May 16, 2026, 6.28 pm IST

Manish Kumar Japan Deportation | జపాన్‌లో భారతీయుడికి కన్నీటి కష్టాలు: 30 ఏళ్ల తర్వాత ‘గో బ్యాక్ టు ఇండియా’ అంటున్న అధికారులు.. కారణం ఇదే!
Advertisement
  • జపాన్‌లో 18 ఏళ్లుగా ఇండియన్ రెస్టారెంట్ నడుపుతున్న మనీష్ కుమార్‌కు షాకిచ్చిన ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అధికారులు 
  • ఆయన బిజినెస్ మేనేజర్ వీసా రెన్యువల్‌ను రిజెక్ట్ చేసి, వెంటనే ఇండియాకు వెళ్లిపోవాలంటూ ఆదేశాలు
  • అక్టోబర్ 2025లో జపాన్ వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో ఇలాంటి చిన్న విదేశీ వ్యాపారులపై తీవ్ర ప్రభావం
  • కనీస పెట్టుబడి పరిమితిని భారీగా పెంచడం, స్థానికులకు ఉద్యోగం తప్పనిసరి చేయడం లాంటి కఠిన నిబంధనలతో 96% పడిపోయిన జపాన్ వీసా దరఖాస్తులు

Manish Kumar Japan Deportation | త్రినేత్ర.న్యూస్ : జపాన్ (Japan) దేశంలో మూడు దశాబ్దాలుగా నివసిస్తూ, సొంతంగా ఓ రెస్టారెంట్ నడుపుకుంటున్న ఒక భారతీయుడికి అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు కోలుకోలేని షాకిచ్చారు. ఆయన 'బిజినెస్ మేనేజర్ వీసా' (Business manager visa) రెన్యువల్ అప్లికేషన్‌ను రిజెక్ట్ చేసిన అధికారులు, వెంటనే 'ఇండియాకు వెళ్లిపోవాలి' అంటూ ఆదేశాలు జారీ చేశారు. జపాన్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కఠినమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలే ఇప్పుడు ఆయన పాలిట శాపంగా మారాయి.

సైతామా ప్రిఫెక్చర్‌లో (Saitama Prefecture) 18 ఏళ్లుగా మనీష్ కుమార్ ఒక ఇండియన్ రెస్టారెంట్ నడుపుతున్నాడు. అయితే, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఏజెన్సీ (ISA) అకస్మాత్తుగా వీసా నిరాకరించడంతో టోక్యోలో జరిగిన ఓ నిరసన కార్యక్రమంలో ఆయన కన్నీటి పర్యంతమయ్యాడు. "నా పిల్లలు జపాన్‌లోనే పుట్టి పెరిగారు. వారికి జపనీస్ భాష మాత్రమే వచ్చు. వారి స్నేహితులు కూడా జపనీయులే. కానీ మమ్మల్ని ఉన్నఫళంగా ఇండియాకు వెళ్లిపోమంటున్నారు. ఇప్పుడు మేం ఎక్కడికి వెళ్లాలి?" అంటూ మనీష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

మనీష్ కుమార్ లాంటి ఎంతో మంది చిన్న విదేశీ వ్యాపారులకు జపాన్ కొత్త రూల్స్ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అక్టోబర్ 2025లో అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలతో బిజినెస్ వీసా దరఖాస్తులు ఏకంగా 96 శాతం పడిపోయాయి. నెలకు సగటున 1,700 వచ్చే దరఖాస్తులు కాస్తా ఇప్పుడు కేవలం 70కి పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వీసాలను దుర్వినియోగం చేస్తున్న వారిని అడ్డుకునేందుకే ఈ కఠిన నిబంధనలు తెచ్చామని అధికారులు చెబుతున్నా, నిజాయితీగా వ్యాపారం చేసుకునే చిన్న వ్యాపారులు (Small business owners) తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శకులు మండిపడుతున్నారు.

మారిన జపాన్ వీసా రూల్స్‌ ఇవే

పెట్టుబడి పరిమితి పెంపు (Capital Requirement): గతంలో వ్యాపారం కోసం 5 మిలియన్ యెన్లు (సుమారు రూ.30 లక్షలు) చూపిస్తే సరిపోయేది. దాన్ని ఇప్పుడు ఏకంగా 30 మిలియన్ యెన్లకు (సుమారు రూ.2 కోట్లు) పెంచారు. దీంతో చిన్న వ్యాపారులకు వీసా అర్హత దొరకడం కష్టంగా మారింది.

ఉద్యోగుల నియామకం (Mandatory Full-Time Employee): కొత్త రూల్స్ ప్రకారం వ్యాపారంలో తప్పనిసరిగా కనీసం ఒక స్థానిక జపనీస్ వర్కర్‌ను ఫుల్-టైమ్ (Full-time) జాబ్‌లోకి తీసుకోవాలి. గతంలో పెట్టుబడి నిబంధన పాటిస్తే ఇది ఆప్షనల్‌గా ఉండేది.

భాషా నైపుణ్యాలు (Language Skills): దరఖాస్తుదారులకు లేదా వారి ఫుల్-టైమ్ ఉద్యోగుల్లో ఎవరికైనా ఒకరికి జపనీస్ భాషా పరిజ్ఞానం (JLPT N2 స్థాయి) తప్పనిసరి.

కఠినమైన బ్యాక్‌గ్రౌండ్ చెక్ (Strict Scrutiny): వ్యాపార అనుభవాన్ని కచ్చితంగా నిరూపించుకోవాలి లేదంటే సరైన బిజినెస్ సర్టిఫికేషన్ ఉండాలి. అలాగే బిజినెస్ ప్లాన్స్‌ను మరింత లోతుగా స్క్రూటినీ చేస్తున్నారు. ట్యాక్స్ రికార్డులను చెక్ చేయడంతో పాటు, హోమ్ ఆఫీస్‌లను (Home offices) ఇకపై ఏమాత్రం అనుమతించరని తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by 井戸乃めだか (@idono_medaka)

Advertisement
Advertisement