Khaleda Zia | బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ‘ఖలీదా జియా’ కన్నుమూత.. సామాన్య గృహిణి నుంచి దేశ ప్రధానిగా.. తొలి మహిళా పీఎంగా రికార్డు
బంగ్లాదేశ్ మరో మాజీ ప్రధాని షేక్ హసీనా కూడా రాజకీయాల్లో రాణించడంతో షేక్ హసీనా వర్సెస్ ఖలీదా జియా అన్నట్లుగా రాజకీయాలు నడిచాయి. వీళ్లను బ్యాట్లింగ్ బేగమ్స్ అని కూడా పిలిచేవారు.
International | Published On Dec 30, 2025, 10.24 am IST
Khaleda Zia | బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి, తొలి మహిళా ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) అధినేత్రి ఖలీదా జియా కన్నుమూశారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జియా ఢాకాలోని ఎవర్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఖలీదా జియా మరణంపై బీఎన్‌పీ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
నవంబర్ 23న ఆసుపత్రిలో చేరిన జియా
గత నెల నవంబర్ 23 న ఆమె ఊపిరితిత్తులు, గుండె సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆమె పరిస్థితి క్రిటికల్‌గానే ఉంది. అప్పటి నుంచి ఆమెకు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన పలువురు డాక్టర్లు చికిత్స అందించారు. లివర్ సిరోసిస్, ఆర్థరైటిస్, డయాబెటిస్, కిడ్నీ ఇన్ఫెక్షన్, ఇతర సమస్యలతో ఆమె పరిస్థితి రోజురోజుకి క్షీణించడంతో విదేశాలకు తరలించి చికిత్స అందించాలని డాక్టర్లు సూచించారు. కానీ విదేశాలకు తరలించేందుకు ఆమె ఆరోగ్యం సహకరించలేదు. చివరకు ఆరోగ్యం విషమించి మంగళవారం ఉదయం ఖలీదా కన్నుమూశారు.

తన తల్లి ఆరోగ్యం బాగోలేదని తెలిసి ఇటీవలే తన కొడుకు తారిఖ్ రహ్మాన్ ఆమెను చూసేందుకు బంగ్లాదేశ్‌కి వచ్చిన విషయం తెలిసిందే. 17 ఏళ్ల తర్వాత ఆయన డిసెంబర్ 25న బంగ్లాదేశ్‌కి తిరిగి వచ్చి తన తల్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. తారిఖ్ బంగ్లాదేశ్‌లో అడుగు పెట్టగానే లక్షల మంది అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత జరిగిన సభలోనూ ప్రసంగిస్తూ బంగ్లాదేశ్ భవిష్యత్తు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తారిఖ్ రహ్మాన్.. ఆమె పెద్ద కొడుకు. చిన్న కొడుకు అరాఫత్ రహ్మాన్ కోకో కొన్ని సంవత్సరాల క్రితం మలేషియాలో మరణించారు. దీంతో తారిఖ్ రహ్మాన్ ప్రస్తుతం బీఎన్‌పీ పార్టీకి తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
Khaleda Zia | ఖలీదా జియా రాజకీయ ప్రస్థానం ఇదే
ఒక సామాన్య గృహిణి స్థాయి నుంచి దేశ ప్రధాని వరకు ఖలీదా జియా ఎదగడం అనేది సామాన్య విషయం కాదు. ఖలీదా 1945 లో జన్మించారు. బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియార్ రహ్మాన్‌ను పెళ్లి చేసుకున్న ఖలీదా.. 1981 లో ఆయన హత్య తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు.

1991 లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో ఖలీదా జియా విజయం సాధించి బంగ్లాదేశ్‌కి తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికై సరికొత్త చరిత్ర నెలకొల్పారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యం
అప్పటి వరకు బంగ్లాదేశ్‌లో ఉన్న అధ్యక్ష తరహా పాలనను రద్దు చేసి.. పార్లమెంటరీ ప్రజాస్వామ్య పాలనను ప్రవేశపెట్టడంలో ఖలీదా జియా కీలక పాత్ర పోషించారు. ఆమె హయాంలో బంగ్లాదేశ్‌లో ఎన్నో సంస్కరణలు రూపుదిద్దుకున్నాయి. విదేశీ పెట్టుబడుల సరళీకరణ, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య లాంటి సంస్కరణలకు ఆమె శ్రీకారం చుట్టారు.

మూడుసార్లు ప్రధాని పదవి
తన రాజకీయ జీవితంలో ఖలీదా జియా మూడు సార్లు బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1991 లో తొలి సారి, ఆ తర్వాత 1996 లో రెండో సారి, 2001 లో మూడోసారి.. ఇలా మూడుసార్లు బంగ్లాదేశ్ ప్రధానిగా మరో రికార్డు క్రియేట్ చేశారు.

షేక్ హసీనా వర్సెస్ ఖలీదా జియా
బంగ్లాదేశ్ మరో మాజీ ప్రధాని షేక్ హసీనా కూడా రాజకీయాల్లో రాణించడంతో షేక్ హసీనా వర్సెస్ ఖలీదా జియా అన్నట్లుగా రాజకీయాలు నడిచాయి. వీళ్లను బ్యాట్లింగ్ బేగమ్స్ అని కూడా పిలిచేవారు. 2018 లో అవినీతి కేసులో ఖలీదాకు జైలు శిక్ష పడటంతో ఆమె కొన్ని రోజులు జైలులో ఉన్నా.. ఆ తర్వాత మార్చి 2020 నుంచి ఆమెను గృహ నిర్బంధం చేశారు. ఆగస్టు 2024 లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఆమెకు గృహ నిర్బంధం నుంచి విముక్తి లభించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆమెపై ఉన్న కేసులన్నింటినీ కొట్టేసింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





