త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Future City Police Commissionerate | ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధి ఖరారు: ఇబ్రహీంపట్నం డివిజన్‌లోకి అబ్దుల్లాపూర్ మెట్

ఫ్యూచర్ సిటీ పరిధిలోకి అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ చేరింది. కొత్తగా జోన్లు, డివిజన్లు, మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

J

Hyderabad | Published On Oct 6, 2026, 9.38 pm IST

Future City Police Commissionerate | ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధి ఖరారు: ఇబ్రహీంపట్నం డివిజన్‌లోకి అబ్దుల్లాపూర్ మెట్

సంక్షిప్త సారాంశం

తెలంగాణ ప్రభుత్వం జీవో నెం. 90 ద్వారా 'ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్' అధికారిక పరిధిని, పునర్వ్యవస్థీకరణను ఖరారు చేసింది. రాచకొండ పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్‌‌ను ఫ్యూచర్ సిటీ పరిధిలోని ఇబ్రహీంపట్నం డివిజన్ (మహేశ్వరం జోన్) పరిధిలోకి చేర్చారు. కొత్తగా అమన్‌‌గల్, కొత్తూరు, మొయినాబాద్ ఏసీపీ (ACP) డివిజన్లతో పాటు అజీజ్‌నగర్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. మహేశ్వరం, షాద్‌నగర్, చేవెళ్లలకు ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్లు (WPS), ట్రాఫిక్ జోన్లు/డివిజన్లను మంజూరు చేశారు.

Advertisement
  • కొత్తగా 3 ఏసీపీ ఆఫీసులు, మహిళా పీఎస్‌లు
  • భారీ మార్పులతో జీవో విడుదల

Future City Police Commissionerate | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన 'ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్' స్వరూపాన్ని ప్రభుత్వం సమగ్రంగా పునర్వ్యవస్థీకరించింది. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 7 కింద సంక్రమించిన అధికారాలతో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్ మంగళవారం రాత్రి అధికారికంగా జీవో నెం. 90 (G.O.Ms.No.90) జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం కొత్త జోన్లు, డివిజన్లు, పోలీస్ స్టేషన్లతో పాటు ట్రాఫిక్ విభాగాలను నోటిఫై చేశారు.

ఇబ్రహీంపట్నం డివిజన్‌లోకి అబ్దుల్లాపూర్ మెట్

ప్రస్తుతం మల్కాజ్‌గిరి (రాచకొండ) పరిధి ఎల్బీనగర్ జోన్, వనస్థలిపురం డివిజన్‌లో ఉన్న అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్‌ను ఫ్యూచర్ సిటీ పరిధిలోకి అధికారికంగా చేర్చారు. ఈ పీఎస్‌ను ఫ్యూచర్ సిటీ పరిధిలోని మహేశ్వరం లా అండ్ ఆర్డర్ జోన్, ఇబ్రహీంపట్నం డివిజన్ కిందికి తెచ్చారు. అబ్దుల్లాపూర్ మెట్, అనాజ్‌పూర్, బాటసింగారం, బండ్లరావిరాల, ఇనాంగూడ సహా మొత్తం 15 గ్రామాలు ఇకపై ఈ అధికార పరిధిలోనే కొనసాగుతాయి.

Also Read | బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్లు కాలుస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే..!

కొత్తగా మూడు ఏసీపీ డివిజన్లు – అజీజ్‌నగర్ పీఎస్

పరిపాలనా సౌలభ్యం, వేగవంతమైన ప్రజా సేవల నిమిత్తం కమిషనరేట్ పరిధిలో విస్తృత మార్పులు చేశారు.

కొత్త లా అండ్ ఆర్డర్ డివిజన్లు (ACP Offices): అమన్‌గల్, కొత్తూరు, మొయినాబాద్‌‌లను కొత్త సబ్-డివిజన్లుగా (ఏసీపీ ఆఫీసులు) ప్రభుత్వం ప్రకటించింది.

కొత్త పోలీస్ స్టేషన్: మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ కేంద్రంగా నూతనంగా 'అజీజ్‌నగర్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్' ఏర్పాటైంది.

పేర్ల మార్పు: గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్‌ను 'మీర్‌ఖాన్‌పేట్ పీఎస్'గా, శంషాబాద్ పరిధిలోని కొన్ని ప్రాంతాలతో ఏర్పాటైన విభాగాన్ని 'పెద్దషాపూర్ పీఎస్'గా పేరు మార్చారు.

ఇదీ చదవండి | లైంగిక ఆరోప‌ణ‌ల కేసు.. ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డికి బెయిల్

మహిళా రక్షణ, ట్రాఫిక్‌ విభాగాల బలోపేతం

మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మహేశ్వరం, షాద్‌నగర్, చేవెళ్ల లా అండ్ ఆర్డర్ జోన్ల పరిధిలో కొత్తగా మూడు ఉమెన్ పోలీస్ స్టేషన్లను (WPS) మంజూరు చేశారు.

అదేవిధంగా పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ జోన్-1, ట్రాఫిక్ జోన్-2లను ఏర్పాటు చేశారు. వీటికి అనుబంధంగా చేవెళ్ల, షాద్‌నగర్, మహేశ్వరం ట్రాఫిక్ డివిజన్లను.. మొయినాబాద్, కొత్తూరు, అమన్‌గల్ కేంద్రాలుగా సరికొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నూతనంగా నిర్దేశించిన ఈ సరిహద్దులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Also Read | బోరు నీరు.. నల్లా నీరు ఒక్కటి కాదు!

Advertisement

తాజావార్తలు

Advertisement