త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | నేడు ఫ్యూచ‌ర్ సిటీలో సీఎం రేవంత్ పర్య‌ట‌న‌.. పోలీస్ క‌మిష‌న‌రేట్ ప్రారంభం

Revanth Reddy | ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప‌ర్య‌టించ‌నున్నారు. ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేయ‌నున్నారు. ఫ్యూచ‌ర్ సిటీ (Future City) అభివృద్ధిపై స‌మీక్ష నిర్వ‌హిస్తారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు ఇబ్రహీంపట్నంలో కొత్తగా ఏర్పాటైన పోలీసు కమిషనరేట్ (Future City Police Commissionerate) కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారు.

G

Hyderabad | Published On Oct 19, 2026, 10.38 am IST

Revanth Reddy | నేడు ఫ్యూచ‌ర్ సిటీలో సీఎం రేవంత్ పర్య‌ట‌న‌.. పోలీస్ క‌మిష‌న‌రేట్ ప్రారంభం
Advertisement

Revanth Reddy | త్రినేత్ర న్యూస్‌: ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప‌ర్య‌టించ‌నున్నారు. ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేయ‌నున్నారు. ఫ్యూచ‌ర్ సిటీ (Future City) అభివృద్ధిపై స‌మీక్ష నిర్వ‌హిస్తారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు ఇబ్రహీంపట్నంలో కొత్తగా ఏర్పాటైన పోలీసు కమిషనరేట్ (Future City Police Commissionerate) కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ఫ్యూచర్‌సిటీలో నెలకొల్పనున్న యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీని సందర్శిస్తారు. సాయంత్రం 6 గంటలకు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మిద్ద గ్రామంలో నిర్మించనున్న నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బ‌న్ మేనేజ్‌మెంట్ (NIUM) క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.

ఫ్యూచ‌ర్ సిటీ వేదిక‌గా డిసెంబర్‌ 7 నుంచి 9 వ‌ర‌కు నిర్వహించనున్న `ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమిట్‌` ఏర్పాట్లను పరిశీలిస్తారు. అనంతరం ఫ్యూచర్‌సిటీ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

Advertisement
Advertisement