త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rain Alert | రాగల 48 గంట‌ల్లో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాలు..!

Rain Alert | రుతుప‌వ‌నాల( Monsoon ) ప్ర‌భావంతో రాగ‌ల 48 గంట‌ల్లో గ్రేట‌ర్ హైద‌రాబాద్( Greater Hyderabad ) న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది.

S

Hyderabad | Published On Jul 2, 2026, 7.13 am IST

Rain Alert | రాగల 48 గంట‌ల్లో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాలు..!
Advertisement

Rain Alert | త్రినేత్ర‌.న్యూస్ : రుతుప‌వ‌నాల( Monsoon ) ప్ర‌భావంతో రాగ‌ల 48 గంట‌ల్లో గ్రేట‌ర్ హైద‌రాబాద్( Greater Hyderabad ) న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. ప‌లు ప్రాంతాల్లో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు, మ‌రికొన్ని ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు( Heavy Rains ) కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. ఈ క్ర‌మంలో న‌గ‌ర‌వాసులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది. ప్ర‌భుత్వ, ప్ర‌యివేటు ఉద్యోగులు ప‌క్కా ప్లానింగ్ చేసుకోవాల‌ని, లేదంటే ట్రాఫిక్‌( Traffic )లో ఇరుక్కుపోయే ప్ర‌మాదం ఉంద‌ని తెలిపింది.

కాగా నగరంలో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25.2 డిగ్రీలు, గాలిలో తేమ 64 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక జూన్ మాసంలో గ్రేట‌ర్ హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలో అత్య‌ధిక వ‌ర్ష‌పాతం న‌మోదైంది. జూన్‌లో ఏకంగా 16 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైనట్టు తెలంగాణ స్టేట్ ప్లానింగ్ డెవ‌ల‌ప్‌మెంట్ సొసైటీ అధికారులు వెల్లడించారు.

Advertisement
Advertisement