త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Praneeth Group | ప‌దో త‌ర‌గ‌తిలో 500పైగా మార్కులు సాధించిన ప్ర‌భుత్వ విద్యార్థుల‌కు రూ.50 వేల న‌గ‌దు బ‌హుమ‌తి: ప్ర‌ణీత్ గ్రూప్ చైర్మ‌న్‌

G

Hyderabad | Published On May 17, 2026, 10.03 am IST

Praneeth Group | ప‌దో త‌ర‌గ‌తిలో 500పైగా మార్కులు సాధించిన ప్ర‌భుత్వ విద్యార్థుల‌కు రూ.50 వేల న‌గ‌దు బ‌హుమ‌తి: ప్ర‌ణీత్ గ్రూప్ చైర్మ‌న్‌
Advertisement

Praneeth Group | త్రినేత్ర‌.న్యూస్‌: ప‌దో త‌ర‌గ‌తిలో అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన‌ ప్ర‌భుత్వ పాఠ‌శాల విద్యార్థుల‌కు (Govt School Students) ప్ర‌ణీత్ గ్రూప్‌న‌కు (Praneeth Group) చెందిన కామ‌రాజు అన్న‌పూర్ణ‌మ్మ చారిట‌బుల్ ట్ర‌స్ట్ భారీ న‌గ‌దు ప్రోత్సాహకాన్ని ప్ర‌క‌టించింది. హైద‌రాబాద్‌లోని వివిధ ప్ర‌భుత్వ బడుల్లో 500కుపైగా మార్కులు సాధించిన‌ 42 మంది విద్యార్థుల‌కు రూ.50 వేల చొప్పున మొత్తం రూ.21 ల‌క్ష‌లు అందించ‌నున్న‌ట్లు ప్ర‌ణీత్ గ్రూప్ చైర్మ‌న్ న‌రేంద్ర కుమార్ కామ‌రాజు తెలిపారు. బ‌డీచౌడీలోని న‌యాబ‌జార్‌లో ఉన్న గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్ విద్యార్థులు ముగ్గురు, మ‌ల్లంపేట్ జ‌డ్పీహెచ్ఎస్‌కు చెందిన 10 మంది, బాచుప‌ల్లి జ‌డ్పీహెచ్ఎస్‌కు చెందిన ఏగుడురు, నిజాంపేట జ‌డ్పీహెచ్ఎస్ విద్యార్థులు 12 మంది, ప్ర‌గ‌తీన‌గ‌ర్ విద్యార్థులు 10 మంది చొప్పున ఉన్నార‌ని వెల్ల‌డించారు.

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో మెరుగైన ఫ‌లితాల సాధ‌న‌కు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చెప్పారు. అదేవిధంగా పేద విద్యార్థులు ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించేందుకు, స‌ర్కారు బడుల్లో అడ్మిష‌న్ల‌ను పెంచెందుకు ఇది దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు.

Advertisement
Advertisement