Musi Riverfront | ఆదిత్య అపార్ట్‌మెంట్‌ను ఎందుకు ముట్టుకోవడం లేదు..? రేవంత్‌కు మూసీ బాధితుడి సూటి ప్రశ్న
Musi Riverfront | బఫర్ జోన్‌లో ఉన్న నివాసాలను కూల్చేసి.. మూసీ సుందరీకరణ చేపడుతామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డికి మూసీ బాధితుడు సాయి రెడ్డి ఓ ప్రశ్న సూటిగా సంధించారు. మూసీకి నదికి దూరంలో ఉన్న మధుపార్కు రిడ్జ్‌ను కూల్చేస్తామని అంటున్నారు. మరి నార్సింగి వద్ద మూసీకి అనుకుని ఉన్న ఆదిత్య అపార్ట్‌మెంట్ జోలికి ఎందుకు వెళ్లడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు.
Musi Riverfront | త్రినేత్ర.న్యూస్ : బఫర్ జోన్‌లో ఉన్న నివాసాలను కూల్చేసి.. మూసీ సుందరీకరణ చేపడుతామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డికి మూసీ బాధితుడు సాయి రెడ్డి ఓ ప్రశ్న సూటిగా సంధించారు. మూసీకి నదికి దూరంలో ఉన్న మధుపార్కు రిడ్జ్‌ను కూల్చేస్తామని అంటున్నారు. మరి నార్సింగి వద్ద మూసీకి అనుకుని ఉన్న ఆదిత్య అపార్ట్‌మెంట్ జోలికి ఎందుకు వెళ్లడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు.
మూసీ బాధితుల తరపున బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ వర్సెస్ పబ్లిక్ పాయింట్ కార్యక్రమంలో సాయి రెడ్డి అనే వ్యక్తి ఆవేదనతో మాట్లాడారు. ఫిబ్రవరి 12న నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్పటి వరకు మూసీ సుందరీకరణ గురించి మాకు నాలెడ్జ్ లేదు. అప్పట్నుంచి భయం మొదలైంది. కుమిలిపోతున్నాం. మా బాధ ఎలా చెప్పుకోవాలో తెలియదు. 19న గ్రామసభకు రండి అని నోటీసులు ఇచ్చారు. అవకాశం దొరికిందని గ్రామసభకు వెళ్లాం. ఆర్డీవో వెంకట్ రెడ్డిని కలిసి మూసీ రివర్ ఫ్రంట్ మంచిదే. ప్రజా ప్రయోజనార్థం అంటే ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందని ప్రశ్నించాం. కానీ ఇప్పటి వరకు సమాధానం లేదు. తల్లిదండ్రి లేని అనాథ పిల్లలుగా ఉన్నాం. సర్వే కోసం వచ్చిన అధికారులను ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పకుండానే, సర్వే చేయకుండానే వెళ్లిపోయారని సాయిరెడ్డి తెలిపారు.
హిమాయత్ సాగర్ పరిధిలోని 115 నుంచి 126 సర్వే నంబర్ వరకు నోటిఫికేషన్ జారీ చేశారు. 117 సర్వే నంబర్‌లో ఓఆర్ఆర్‌లో భాగంగా ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు ఇచ్చిన ప్లాట్లు. మీరు ఇచ్చిన ఇండ్లు కూడా బఫర్ జోన్‌లో ఉన్నాయని ఎలా నిర్ధారిస్తారు. మా ఇండ్లను గుంజుకోవడానికి అధికారం ఎక్కడుంది. ఇది జీరో వాల్యూ అని చెప్పి ఖాళీ చేయాలని బెదిరించారు అధికారులు. ఇంటి పన్ను, నీటి పన్ను వసూలు చేస్తున్నారు. రేవంత్ మాటల్లో నమ్మకం లేదు. రైతుబంధు విషయంలోనే నమ్మలేకపోతున్నాం. ఆర్థిక ఇబ్బందులు అనుకున్నాం. మున్సిపల్ ఎన్నికలు అయిపోయాయి.. ఓట్లు వేయరనే భయంతో ఇలాగే ప్రతి విషయంలో అబద్ధాలు చెబుతున్నారు. మూసీ సుందరీకరణ చేయాల్నా వద్దా డ్రాప్ అయిపోతాను అని సీఎం అంటున్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పటి వరకు మూసీని ఆపేయమని చెప్పలేదు. కానీ మధ్య తరగతి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చేయాలని కోరుతున్నారు. ప్రజలను కాపాడే ఆలోచన చేయడం లేదు. ఒకసారి ప్రేమిస్తే గుండెల్లో పెట్టి చూసుకుంటారు తెలంగాణ ప్రజలు. ఎంతో ఆశలతో అందలమెక్కిస్తే.. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. మరి ఇంత దూరంలో ఉన్న మధు పార్కు రిడ్జ్‌ను కూల్చేస్తామని అంటున్నారు.. మరి నార్సింగి వద్ద ఉన్న ఆదిత్య అపార్ట్‌మెంట్‌ను ఎందుకు ముట్టుకోవడం లేదని సాయిరెడ్డి నిలదీశారు.
సంబంధిత వార్తలు

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



