Minister Sridhar Babu | మూడు కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్ : మంత్రి శ్రీధర్ బాబు
Minister Sridhar Babu | గ్రేటర్ హైదరాబాద్‌ను 3 కార్పొరేషన్లుగా విభజించాలని ప్రాథమికంగా అనుకుంటున్నాం అని మంత్రి శ్రీధర్ బాబు శాసనసభా వేదికగా ప్రకటించారు.
Minister Sridhar Babu | త్రినేత్ర.న్యూస్ : గ్రేటర్ హైదరాబాద్‌ను 3 కార్పొరేషన్లుగా విభజించాలని ప్రాథమికంగా అనుకుంటున్నాం అని మంత్రి శ్రీధర్ బాబు శాసనసభా వేదికగా ప్రకటించారు. అసెంబ్లీలో పురపాలక, జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడారు.
మున్సిపల్ పరిపాలన వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ముందుకు వెళ్తున్నాం. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే గ్రేటర్‌లో మున్సిపాలిటీల విలీనం చేశాం. జీహెచ్‌ఎంసీలో పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రణాళిక రూపొందించాం. హైదరాబాద్‌ను మళ్లీ ఎన్ని కార్పొరేషన్లుగా విభజిస్తామో ఇంకా నిర్ణయించలేదు. ఎన్ని కార్పొరేషన్లుగా విభజించాలో అందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకెళ్తాం. గ్రేటర్ హైదరాబాద్‌ను 3 కార్పొరేషన్లుగా విభజించాలని ప్రాథమికంగా అనుకుంటున్నామని శ్రీధర్ బాబు తెలిపారు.
ప్రస్తుతం హైదరాబాద్ ఎయిర్ క్వాలిటి ఇండెక్స్ 174 పాయింట్లు ఉంది. నగరంలో గాలి నాణ్యత మున్ముందు మరింత పడిపోకూడదని భావిస్తున్నాం. కాలుష్యం నియంత్రణకే.. నగరంలోని పరిశ్రమలను ఓఆర్‌ఆర్ అవతలకు తరలించే ప్రక్రియ చేపట్టాం. హైదరాబాద్‌లో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే తిరిగేలా చూస్తాం. హైదరాబాద్‌ను 360 డిగ్రీలు కవర్ చేసేలా.. మెట్రో విస్తరణ చేపట్టాలని నిర్ణయించాం. అనుమతులు, నిర్వహణలో సమస్యలు రావొద్దనే మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వం టేకోవర్ చేస్తోంది. జీహెచ్‌ఎంసీ వార్డుల విభజనలో సమస్యలుంటే పరిష్కరిస్తాం అని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



