Sridhar Babu | ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ.. మార్పునకు చిరునామాగా హైదరాబాద్ అభివృద్ధి: మంత్రి శ్రీధర్ బాబు
Sridhar Babu | హైదరాబాద్‌ను సిగ్నల్ రహిత నగరంగా మార్చాలన్న సంకల్పంతో ఎస్‌ఆర్‌డీపీ పథకంలో భాగంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శాస్త్రీపురంలో నిర్మించిన ఆర్వోబీని మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) ప్రారంభించారు.
Sridhar Babu | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌ను సిగ్నల్ రహిత నగరంగా మార్చాలన్న సంకల్పంతో ఎస్‌ఆర్‌డీపీ పథకంలో భాగంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శాస్త్రీపురంలో (Shastripuram ROB) నిర్మించిన ఆర్వోబీని మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) ప్రారంభించారు. సికింద్రాబాద్-ఫలక్‌నుమా-శివరాంపల్లి రైల్వే లైన్ మధ్య శాస్త్రిపురం వద్ద లెవల్ క్రాసింగ్ కారణంగా ఎదురవుతున్న ట్రాఫిక్ చికులకు శాశ్వత పరిషారం చూపేలా రూ.71 కోట్లతో జీహెచ్ఎంసీ నిర్మించిన ఈ ఆర్వోబీని మండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ప్రజలకు అంకితం చేశారు. అదేవిధంగా ఫలక్‌నుమా బస్ డిపో నుంచి మైలార్‌దేవ్‌పల్లి వరకు 490 మీటర్ల మేర నిర్మించిన 4 లైన్ల రోడ్డును కూడా ప్రారంభించారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..
ఓల్డ్ సిటీ అనకుండా ఒరిజినల్ సిటీగా జీహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్‌ను దేశంలోనే గొప్ప అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో మహానగరంగా తీర్చిదిద్దుతామన్నారు. మార్పునకు చిరునామాగా కోట్లాది రూపాయల నిధులతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్ అభివృద్ధి వేగంగా సాగుతుందని చెప్పారు. ముఖ్యంగా పర్యాటక ప్రాంతంగా హైదరాబాద్ మహానగరాన్ని తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుతూ పోకుండా ప్రణాళిక బద్దంగా హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
ఆర్వోబీతో 30 నిమిషాలు ఆదా..
ఈ ఆర్వోబీ అందుబాటులోకి రావడంతో మైలార్ దేవ్ పల్లి నుంచి వట్టేపల్లి మీదుగా ఫలక్ నుమా డిపోకు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి. ఇప్పటివరకు రైల్వే గేటు పడిన ప్రతిసారీ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయేది. ఈ బ్రిడ్జి ద్వారా ప్రయాణ సమయం సుమారు 30 నిమిషాల మేర ఆదా కానుంది. దీంతో నిత్యం రైల్వే గేటు పడటంతో అసహననాకి గురయ్యే వాహనదారుల ఇబ్బందులు తీరనున్నాయి.
సంబంధిత వార్తలు

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



