త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad Biryani Joints | వేల కోట్ల పన్నులు ఎగ్గొట్టిన హైదరాబాద్ బిర్యానీ హోటళ్లు.. ఏఐతో గుట్టురట్టు

హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్లపై ఐటీ శాఖ జరిపిన లోతైన విచారణలో భారీ ట్యాక్స్ ఎగవేత స్కామ్ బయటపడింది. డిజిటల్ రికార్డులు, రహస్య ఖాతాల ద్వారా ఆదాయాన్ని మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఈ స్కామ్ నెట్‌వర్క్ దేశంలోని ఇతర నగరాలకు కూడా విస్తరించినట్లు సమాచారం.

J

Hyderabad | Published On Feb 19, 2026, 5.09 pm IST

Hyderabad Biryani Joints | వేల కోట్ల పన్నులు ఎగ్గొట్టిన హైదరాబాద్ బిర్యానీ హోటళ్లు.. ఏఐతో గుట్టురట్టు
Advertisement

Hyderabad Biryani Joints |  త్రినేత్ర.న్యూస్ : భాగ్యనగరం అంటేనే బిర్యానీకి ఫేమస్. అందుకే హైదరాబాద్‌లో ఏ మూలకు వెళ్లినా బిర్యానీ దొరుకుతుంది. వేల కొద్ది బిర్యానీ హోటళ్లు నగరంలో ఎక్కడ చూసినా దర్శనమిస్తాయి. ఈ రుచికరమైన బిర్యానీ వెనుక భారీ స్థాయిలో పన్ను ఎగవేత చీకటి కోణం దాగి ఉందని తాజాగా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ గుర్తించింది. నగరంలోని ప్రముఖ బిర్యానీ సంస్థలపై ఇటీవల జరిగిన దాడులు, విచారణలో దేశవ్యాప్తంగా పన్ను ఎగవేత కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

60 టెరా బైట్ల బిల్లింగ్ డేటా ఏఐతో ట్రాక్

ప్రముఖ హోటళ్లు ఎక్కువ శాతం ఓ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌ను వాడుతాయి. ఆ సాఫ్ట్‌వేర్‌ సాయంతో లెక్కల నుంచి కొన్ని పేమెంట్లను తప్పించి కంపెనీలు వందల కోట్ల ట్యాక్సులు ఎగ్గొట్టినట్లు అధికారులు గుర్తించారు. బిర్యానీ ద్వారా వచ్చిన వందల కోట్ల ఆదాయాన్ని లెక్కల్లో చూపకుండా మళ్లించినట్లు తేలింది. కస్టమర్ల నుంచి నగదు రూపంలో తీసుకునే పేమెంట్లను అధికారిక రికార్డుల్లో నమోదు చేయకుండా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సాయంతో లెక్కల నుంచి తప్పిస్తున్నారు. అమ్మకాలు తక్కువ చేసి చూపేందుకు ప్రత్యేకమైన సేల్స్ సప్రెషన్ సాఫ్ట్‌వేర్లను వాడుతున్నారు. వీళ్లు గుట్టును అధికారులు డేటా అనాలిసిస్, ఏఐ టూల్స్ ఉపయోగించి డేటాను ప్రాసెస్ చేసి ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు ఏం చేశారో కనిపెట్టగలిగారు. 60 టెరాబైట్ల డేటాను అధికారులు ఏఐ టూల్‌తో అనాలిసిస్ చేసి స్పష్టమైన వివరాలను రాబట్టగలిగారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ హోటళ్లు అన్నీ కలిసి రూ.70 వేల కోట్ల ఆదాయాన్ని లెక్కల నుంచి తప్పించాయి. తద్వారా వందల కోట్ల ట్యాక్స్‌ను ఎగ్గొట్టాయి.

హైదరాబాద్‌లోనే కాదు

ఈ స్కామ్ హైదరాబాద్ మాత్రమే కాదు.. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా జరుగుతోంది. హైదరాబాద్‌కు చెందిన పలు ప్రముఖ హోటళ్ల ఫ్రాంచైజీలు ఇతర నగరాల్లో ఉన్నాయి. అక్కడ కూడా ఇదే నకిలీ సాఫ్ట్‌వేర్ వినియోగించి పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు ఐటీ విచారణలో తేలింది.

బినామీ పెట్టుబడులు

పన్ను ఎగ్గొట్టిన సొమ్మును రియల్ ఎస్టేట్ రంగంలో, బినామీ పేర్లతో ఇతర వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టినట్లు ఐటీ శాఖ అనుమానిస్తోంది. దాడుల సమయంలో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లు, ఫోన్లు, డైరీలలో కోట్ల రూపాయల లావాదేవీల చిట్టా బయటపడింది.

ప్రస్తుతం ఐటీ అధికారులు ఈ సంస్థల అకౌంటెంట్లు, డైరెక్టర్లను విచారిస్తున్నారు. పన్ను ఎగవేతతో పాటు, విదేశాలకు నిధులు మళ్లించినట్లు తేలితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఈ పరిణామం నగరంలోని ఇతర హోటల్ యజమానుల్లో కలకలం రేపుతోంది.

Advertisement
Advertisement