త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad IT Employees Drugs | సాఫ్ట్‌వేర్ ముసుగులో షాకింగ్ దందా: బెంగుళూరు టూ హైదరాబాద్.. అడ్డంగా దొరికిన ఐటీ ఉద్యోగులు

హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా చేస్తూ ముగ్గురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అడ్డంగా బుక్కయ్యారు. బెంగుళూరు నుంచి సరుకు తెచ్చి విక్రయిస్తున్న వీరిని ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అరెస్ట్ చేసింది.

J

Hyderabad | Published On May 6, 2026, 10.48 pm IST

Hyderabad IT Employees Drugs | సాఫ్ట్‌వేర్ ముసుగులో షాకింగ్ దందా: బెంగుళూరు టూ హైదరాబాద్.. అడ్డంగా దొరికిన ఐటీ ఉద్యోగులు
Advertisement

Hyderabad IT Employees Drugs | త్రినేత్ర.న్యూస్ : సాఫ్ట్‌వేర్ (Software) ఉద్యోగాలు చేస్తూ, లక్షల్లో జీతాలు తీసుకుంటున్న కొందరు యువకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఈజీ మనీ కోసం ఏకంగా డ్రగ్స్ దందా (Drug Peddling) మొదలుపెట్టారు. బెంగుళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ముగ్గురు ఐటీ ఉద్యోగుల (IT Employees) గుట్టును ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ (STF) రట్టు చేసింది. వారి వద్ద నుంచి 7.44 గ్రాముల ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్‌ను బుధవారం స్వాధీనం చేసుకుంది.

పెట్టుబడి ఒకరిది.. సరుకు తెచ్చేది మరొకరు

ఈ డ్రగ్స్ ముఠా కథ అంతా ముగ్గురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల చుట్టే తిరుగుతోంది. హయత్‌నగర్ పరిధిలోని సమన్ నగర్‌కు చెందిన అంజద్ అనే యువకుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసేవాడు. ఇటీవల అతని ఉద్యోగం పోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. ఇది గమనించిన హేమంత్ అనే మరో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అతనికి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తను పెట్టుబడి (Investment) పెడతానని, బెంగుళూరు వెళ్లి డ్రగ్స్ తీసుకొస్తే.. వచ్చే లాభాల్లో చెరిసగం పంచుకుందామని ప్లాన్ వేశాడు. దీనికి అంజద్ ఒప్పుకోవడంతో.. హేమంత్ డబ్బులు ఇచ్చి అతన్ని బెంగుళూరుకు పంపించాడు. అక్కడ 10 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ కొనుగోలు చేసి అంజద్ హైదరాబాద్‌కు చేరుకున్నాడు.

కొంటూ దొరికిపోయిన మరో టెక్కీ

ఇలా బెంగుళూరు నుంచి తీసుకొచ్చిన డ్రగ్స్‌ను హరీష్ అనే మరో సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి విక్రయించేందుకు సిద్ధమయ్యారు. హరీష్ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న పక్కా సమాచారంతో ఎక్సైజ్ ఎస్టీఎఫ్ 'బి' టీమ్ (STF B-Team) అక్కడికి చేరుకుని దాడులు నిర్వహించింది. డ్రగ్స్ అమ్ముతున్న, కొంటున్న ఈ ముగ్గురినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

రూ.2 వేలకు కొని.. పది వేలకు సేల్

పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. బెంగుళూరులో ఒక గ్రాము ఎండీఎంఏ డ్రగ్స్‌ను కేవలం రూ.2,000 కు కొనుగోలు చేస్తున్నారు. దాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చి.. ఇక్కడి అవసరాలను బట్టి గ్రాముకు రూ.8,000 నుంచి రూ.10,000 వరకు అమ్ముతూ భారీగా క్యాష్ (Cash) చేసుకుంటున్నారు.

ఎస్టీఎఫ్ 'బి' టీమ్ లీడర్ ప్రదీప్ రావు పర్యవేక్షణలో.. సీఐ భిక్షారెడ్డి, ఎస్సై బాలరాజు, సిబ్బంది ఈ ఆపరేషన్ నిర్వహించారు. అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులతో పాటు, స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను తదుపరి విచారణ నిమిత్తం హయత్‌నగర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement
Advertisement