MLA Sudheer Reddy | మూసీ సుందరీకరణ.. రోడ్డున పడనున్న 11 వేల కుటుంబాలు : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
MLA Sudheer Reddy | మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లను కూలగొట్టే ప్రక్రియ చేపట్టడంతో 11 వేల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.
MLA Sudheer Reddy | త్రినేత్ర.న్యూస్ : మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లను కూలగొట్టే ప్రక్రియ చేపట్టడంతో 11 వేల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగోల్ ఎస్టీపీ ప్లాంట్‌ను పరిశీలించిన సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడారు.
మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు. మూసీ పరివాహక ప్రాంత ఇండ్లను కూలగొట్టేందుకు బీఆర్ఎస్ వ్యతిరేకం. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. అందుకే ఈ రోజు నాగోల్ ఎస్టీపీ ప్లాంట్‌ను కేటీఆర్ పరిశీలించారు. మూసీ శుద్ధి కోసం బీఆర్ఎస్ హయంలో మొదటి దశలో 35 ఎస్టీపీ ప్లాంట్లను నిర్మించాం. ఎస్టీపీ ప్లాంట్‌లతో మూసీ వాటర్‌ను శుద్ధి చేసుకోవచ్చు అని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మూసీ సుందరీకరణ పేరుతో ఇండ్లను కూలగొట్టేందుకు సిద్ధమయ్యారు. 11 వేల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. బీఆర్ఎస్ హయంలో మూసీ శుద్ధి కోసం ఎస్టీపీ ప్లాంట్‌లను నిర్మిస్తే మూసీ ప్రాంత ప్రజలు ఆందోళన చెందలేదు. రూ. 5 వేల కోట్లతో గాంధీ సరోవర్ నిర్మించాల్సిన అవసరం ఏముంది..? గాంధీ సరోవర్ కోసం చుట్టూ పక్కల ఇండ్లను కూలగొట్టేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ హయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టాచ్యూ నిర్మించాం. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి తేవడం లేదు. ఇవ్వాళ గాంధీ సరోవర్ పేరుతో మూసీ పరివాహక ప్రాంత ప్రజల ఇండ్లను కూలగొట్టడం సరికాదని సుధీర్ రెడ్డి మండిపడ్డారు.
సంబంధిత వార్తలు

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



