త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Sudheer Reddy | దోమ‌ల‌ను అరిక‌ట్టలేని ప్ర‌భుత్వం అవ‌స‌ర‌మా..? : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

MLA Sudheer Reddy | హైద‌రాబాద్ న‌గ‌రంలో దోమ‌లు స్వైర‌విహారం చేస్తున్నాయ‌ని ఎల్‌బీన‌గ‌ర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మండిప‌డ్డారు. దోమ‌ల‌ను అరిక‌ట్ట‌లేని ప్ర‌భుత్వం అవ‌స‌ర‌మా..? అని ప్ర‌జ‌లు భావిస్తున్నార‌ని పేర్కొన్నారు.

S

Hyderabad | Published On Apr 2, 2026, 1.53 pm IST

MLA Sudheer Reddy | దోమ‌ల‌ను అరిక‌ట్టలేని ప్ర‌భుత్వం అవ‌స‌ర‌మా..? : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Advertisement

MLA Sudheer Reddy | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో దోమ‌లు స్వైర‌విహారం చేస్తున్నాయ‌ని ఎల్‌బీన‌గ‌ర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మండిప‌డ్డారు. దోమ‌ల‌ను అరిక‌ట్ట‌లేని ప్ర‌భుత్వం అవ‌స‌ర‌మా..? అని ప్ర‌జ‌లు భావిస్తున్నార‌ని పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా హాల్‌లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దోమ‌తెర‌తో కుట్టించిన గౌన్ ధ‌రించి గురువారం మీడియాతో మాట్లాడారు.

హైదరాబాద్‌లో నోరు తెరిస్తే నోట్లోకి దోమలు పోతున్నాయి. దోమలతో హైదరాబాద్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మా హయంలో నాలుగైదు సార్లు దోమల బెడద లేకుండా చర్యలు తీసుకునే వాళ్ళం. దోమ‌ల నివార‌ణ‌కు ఈ ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు. దీంతో డెంగీ, మ‌లేరియా వంటి వ్యాధుల బారిన ప‌డి ఆస్ప‌త్రుల పాల‌వుతున్నారని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్‌ను మూడు ముక్కలు చేసి మరిన్ని సమస్యలకు కారణం చేశారు. దోమల బెడదకు భయపడి ఎవరు హైదరాబాద్ రావడం లేదు. హైదరాబాద్ లో దోమల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. లేదంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు మరింత నష్టం జరిగే అవకాశం ఉంది. ప్ర‌తి డివిజన్‌కు 10 ఫాగింగ్ మిషన్‌లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం సాధించిందని సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ ప్రజలు దోమ తెర కుట్టించుకునే పరిస్థితి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే. కరోనా వచ్చినప్పుడు మాస్క్‌ ఎలా పెట్టుకున్నామో , హైదరబాద్‌లో దోమల బెడద తట్టుకోలేక దోమ తెర కుట్టించుకునే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్‌లో దోమల బెడదను నివారించడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైంద‌ని సుధీర్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు.

Advertisement
Advertisement