Gajakesari Raja Yoga | నవంబర్ 3న గజకేసరి రాజయోగం.. ఈ 3 రాశులకు ఆర్థికంగా అన్నీ లాభాలే..!
Gajakesari Raja Yoga | నవంబర్ 3న గురుడు, చంద్రుడి కలయికతో గజకేసరి యోగం ఏర్పడనుంది. ఈ యోగం మూడు రాశుల వారికి ఆర్థికంగా అనుకూల ఫలితాలు కలుగనున్నాయి. ఉద్యోగులకు కెరీర్‌లో పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, వ్యాపార విస్తరణకు మార్గాలు కనిపించనున్నాయి.
Gajakesari Raja Yoga | నవంబర్ 3న గురుడు, చంద్రుడి కలయికతో గజకేసరి యోగం ఏర్పడనుంది. ఈ యోగం మూడు రాశుల వారికి ఆర్థికంగా అనుకూల ఫలితాలు కలుగనున్నాయి. ఉద్యోగులకు కెరీర్‌లో పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, వ్యాపార విస్తరణకు మార్గాలు కనిపించనున్నాయి. ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త అవకాశాలు అందివచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబ జీవితంలో సుఖసంతోషాలు, సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి ఈ రాజయోగం అనుకూలంగా ఉండనుంది.
గజకేసరి రాజయోగం అంటే ఏమిటి?
వేద జ్యోతిష్య శాస్త్రంలో గజకేసరి రాజయోగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. చంద్రుడి నుంచి గురుడు కేంద్ర స్థానాలైన ఒకటి, నాలుగు, ఏడు, పది స్థానాల్లో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. గురుడిని జ్ఞానం, వివేకం, అభివృద్ధి, సంపదకు కారకుడిగా.. చంద్రుడిని మనసు, భావోద్వేగాలు, మానసిక స్థితికి కారకుడిగా పరిగణిస్తారు. ఈ రెండు గ్రహాల అనుకూల స్థితి వల్ల ఆత్మవిశ్వాసం, ఆర్థిక పురోగతి, సామాజిక గౌరవం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతాయని జ్యోతిష్య విశ్వాసం. అయితే, ఈ యోగం ఫలితాలు వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితులు అనుకూలంగా ఉంటాయని పండితులు పేర్కొంటున్నారు.
మేష రాశి
మేష రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉండనుంది. ఉద్యోగులకు పనితీరును మెరుగుపరుచుకునే అవకాశాలు కలగనున్నాయి. కష్టానికి తగిన గుర్తింపు లభించనుంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. చాలాకాలంగా ఉద్యోగ మార్పు లేదా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. వ్యాపారులకు పాత ఒప్పందాల ద్వారా లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. కొత్త వ్యాపార పరిచయాలు ఏర్పడనున్నాయి. గతంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలు చేతికి అందే సూచనలు ఉన్నాయి. దీంతో ఆర్థిక ఒత్తిడి తగ్గనుంది. పెట్టుబడులకు సంబంధించి కొత్త అవకాశాలు వచ్చినప్పటికీ.. పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి.
సింహ రాశి
సింహ రాశి వారికి గజకేసరి రాజయోగం కెరీర్, ఆర్థిక పరిస్థితుల పరంగా ప్రాధాన్యం సంతరించుకోనుంది. ఉద్యోగ రంగంలో తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు కలగనున్నాయి. కొత్త బాధ్యతలు, పదోన్నతులు, వేతన పెంపునకు సంబంధించిన అవకాశాలు కనిపించనున్నాయి. కొత్త ప్రాజెక్టులపై పనిచేస్తున్న వారికి పురోగతి సాధించే మార్గాలు అందుబాటులోకి రానున్నాయి. వ్యాపారులకు కొత్త క్లయింట్లతో పరిచయాలు ఏర్పడనున్నాయి. వ్యాపార విస్తరణకు, కీలక ప్రాజెక్టులు ప్రారంభించేందుకు అవకాశాలు కలగనున్నాయి. ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషించనున్నారు. కుటుంబ సౌకర్యాలకు సంబంధించిన ప్రణాళికలు ముందుకు సాగనున్నాయి. అయితే, ఆదాయం పెరుగుతుందనే అంచనాతో అనవసర ఖర్చులు చేయకుండా పొదుపుపై దృష్టి పెట్టాలి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి గజకేసరి రాజయోగం పురోగతి, ఆర్థిక లాభాల పరంగా అనుకూలంగా ఉండనుంది. ఉద్యోగులకు తమ ప్రతిభను చాటుకునే అవకాశాలు కలగనున్నాయి. కొత్త బాధ్యతలు చేపట్టడం లేదా కీలకమైన పనులను పూర్తి చేయడం ద్వారా కెరీర్‌లో ముందడుగు వేస్తారు. చాలాకాలంగా ఒక లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తున్న వారు తమ వ్యూహాలను మెరుగుపరుచుకోవడం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. వ్యాపారులకు కొత్త పరిచయాలు, వ్యాపార ప్రణాళికలు కలిసిరానున్నాయి. అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించే అవకాశాలు ఉన్నాయి. గతంలో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తికావడంతో ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఊరట లభించనుంది. కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టే ముందు లాభనష్టాలను అంచనా వేయాలి. సరైన ప్రణాళిక, నిరంతర కృషి, ఆచితూచి తీసుకునే నిర్ణయాలతో లక్ష్యాల దిశగా ముందుకు సాగుతారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Traffic Restrictions | ఈ నెల 22 వరకు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●Horoscope | అక్టోబర్ 20 రాశిఫలాలు.. ఈ రాశి వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి..!
- ●Lucky Horoscope | దసరా వేళ మూడు రాశులవారికి అదృష్టం.. ఆర్థిక లాభాలు, పెండింగ్ పనుల్లో పురోగతి!
- ●Shami Puja | శమీ శమయతే పాపం.. విజయాన్నిచ్చే జమ్మి పూజ!
- ●KCR | తెలంగాణ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Trivikram | త్రివిక్రమ్ పెళ్లి సీక్రెట్ బయటపెట్టిన సునీల్ - జయమ్ము నిశ్చయమ్మురా ప్రోమో రిలీజ్

Traffic Restrictions | ఈ నెల 22 వరకు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు

Horoscope | అక్టోబర్ 20 రాశిఫలాలు.. ఈ రాశి వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి..!

Lucky Horoscope | దసరా వేళ మూడు రాశులవారికి అదృష్టం.. ఆర్థిక లాభాలు, పెండింగ్ పనుల్లో పురోగతి!

Shami Puja | శమీ శమయతే పాపం.. విజయాన్నిచ్చే జమ్మి పూజ!



