త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lucky Horoscope | దసరా వేళ మూడు రాశులవారికి అదృష్టం.. ఆర్థిక లాభాలు, పెండింగ్ పనుల్లో పురోగతి!

Lucky Horoscope | దసరా పండుగ వేళ మూడు రాశుల వారికి శుభ ఫలితాలు కలుగనున్నాయి. ఈ సారి దసర పండుగకు ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నది. దసరా, మహానవమి తేదీల కలయికతో పాటు తులారాశిలో బుధుడు, సూర్యుడు, శుక్రుడు కలవడం జ్యోతిష్యపరంగా ప్రత్యేకతను సంతరించుకుంది.

P

Horoscope | Published On Oct 20, 2026, 6.25 am IST

Lucky Horoscope | దసరా వేళ మూడు రాశులవారికి అదృష్టం.. ఆర్థిక లాభాలు, పెండింగ్ పనుల్లో పురోగతి!
Advertisement

Lucky Horoscope | దసరా పండుగ వేళ మూడు రాశుల వారికి శుభ ఫలితాలు కలుగనున్నాయి. ఈ సారి దసర పండుగకు ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నది. దసరా, మహానవమి తేదీల కలయికతో పాటు తులారాశిలో బుధుడు, సూర్యుడు, శుక్రుడు కలవడం జ్యోతిష్యపరంగా ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ గ్రహాల కలయికతో శుక్రాదిత్య యోగం, బుధాదిత్య యోగం ఏర్పడనున్నాయి. ఈ యోగాల ప్రభావం మొత్తం 12 రాశులపై ఉన్నప్పటికీ.. మేషం, తుల, ధనుస్సు రాశుల వారికి ప్రత్యేకంగా అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలున్నాయి. ఆర్థికంగా లాభపడటంతో పాటు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనుల్లో పురోగతి సాధించే సూచనలు గోచరిస్తున్నాయి.

మేష రాశి

దసరా సమయంలో మేష రాశి వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయి. ఉద్యోగ రంగంలో కష్టానికి తగిన గుర్తింపు లభించవచ్చు. ఉన్నత స్థాయికి ఎదిగేందుకు కొత్త అవకాశాలు అందివస్తాయి. వ్యాపారులకు కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంటుంది. అయితే, ఏ పని ప్రారంభించినా ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులకు కెరీర్‌కు సంబంధించి కొత్త మార్గాలు కనిపిస్తాయి. చాలాకాలంగా కొనసాగుతున్న న్యాయపరమైన వివాదాల్లోనూ ఊరట లభించే అవకాశాలున్నాయి.

తుల రాశి

తుల రాశి వారికి ఈ దసరా అదృష్టాన్ని తీసుకురానుందని తెలుస్తుంది. గతంలో చేసిన ప్రయత్నాలకు సానుకూల ఫలితాలు దక్కే అవకాశం కనిపిస్తోంది. వ్యాపారులకు లాభాలు ఆర్జించేందుకు కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. వ్యక్తిగత జీవితంలో సంతోషం పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. శుభకార్యాలు చేపట్టేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చు. చేపట్టిన పనుల్లో అదృష్టం కలిసివచ్చే సూచనలు ఉన్నాయి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి దసరా కాలం ప్రయోజనకరంగా ఉండే అవకాశాలున్నాయి. కొత్త పనులు, ఉద్యోగ అవకాశాలు అందివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత ఉపశమనం లభించవచ్చు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలనుకునేవారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. లక్ష్యాల సాధన దిశగా ముందడుగు వేసేందుకు ఈ సమయం అనుకూలంగా ఉండొచ్చు. ఆర్థికంగా లాభాలు పొందడంతో పాటు వృత్తి, వ్యాపార రంగాల్లో పురోగతి సాధించే అవకాశాలున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అందుకుంటారు.

Advertisement
Advertisement