Telugu Serial | ఫ్యాన్స్‌కు షాకివ్వనున్న జీ తెలుగు – సూపర్ హిట్ సీరియల్‌కు శుభంకార్డు
జీ తెలుగులో లాంగెస్ట్ రన్నింగ్ సీరియల్స్‌లో ఒకటిగా కొనసాగుతోన్న పడమటి సంధ్యారాగం ఎండింగ్‌కు చేరుకుంది. ఈ వీక్‌లోనే ఈ సీరియల్‌కు జీ తెలుగు శుభం కార్డు వేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Apr 20, 2026, 7.39 pm IST
Telugu Serial | సీరియల్ ఫ్యాన్స్‌కు జీ తెలుగు పెద్ద షాకివ్వబోతుంది. పడమటి సంధ్యారాగం సీరియల్‌కు త్వరలోనే శుభంకార్డు వేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఈ సీరియల్ టైమింగ్‌ను మార్చేశారు. సాయంత్రం ఆరున్నరకు టెలికాస్ట్ అవుతోన్న పడమటి సంధ్యారాగాన్ని మధ్యాహ్నం మూడున్నరకు షిప్ట్ చేశారు. ఎండింగ్‌కు చేరుకోవడంతోనే టైమ్ స్లాట్‌ను మార్చినట్లు టాక్ వినిపిస్తోంది.
నాలుగేళ్లు టెలికాస్ట్...
2012లో పడమటి సంధ్యారాగం సీరియల్ లాంఛ్ అయ్యింది. నాలుగేళ్ల పాటు టెలికాస్ట్ అయ్యింది. జీ తెలుగులో టీఆర్‌పీ రేటింగ్ పరంగా టాప్‌లో నిలిచింది. రాను రాను కథను సాగదీయడం, ట్విస్ట్‌లు, టర్న్‌లు తేలిపోవడంతో సీరియల్ క్రేజ్ తగ్గుతూ వచ్చింది. రీసెంట్ టీఆర్‌పీలో కేవలం 2.99 రేటింగ్‌ను మాత్రమే సొంతం చేసుకుంది.
దాంతో పడమటి సంధ్యారాగం సీరియల్‌ను ఎండ్ చేయాలని మేకర్స్ ఫిక్సయ్యారట. ఏప్రిల్ 25న ఈ సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ తాలూకు షూటింగ్ కూడా పూర్తయ్యిందట.
1146 ఎపిసోడ్స్...
పడమటి సంధ్యారాగం ఫ్యాన్స్ మాత్రం సీరియల్‌ను ఎండ్ చేయద్దని కోరుతున్నారు. ఇంకొన్నాళ్లు ప్రసారం చేస్తే బాగుంటుందని కామెంట్స్ పెడుతోన్నారు. ప్రస్తుతం జీ తెలుగులో లాంగెస్ట్ రన్నింగ్ సీరియల్‌గా పడమటి సంధ్యారాగం కొనసాగుతోంది. ఇప్పటివరకు 1146 ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యాయి.
పడమటి సంధ్యారాగం సీరియల్ పృథ్వీరాజ్, జయశ్రీ, సాయికుమార్, ప్రీతి శర్మ, హాన్విక, అనిల్ అల్లం, సౌందర్య కీలక పాత్రలు పోషించారు. పడమటి సంధ్యారాగంతో పాటు మేఘ సందేశం, చామంతి, లక్ష్మినివాసం సీరియల్స్ టైమ్‌ను కూడా జీ తెలుగు ఛేంజ్ చేసింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



