RanaBaali | రణబాలి అంటే అర్థం ఏమిటి? – విజయ్ దేవరకొండ సినిమాకు ఆ నవల ఆధారమా?
విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతోన్న హిస్టారికల్ మూవీకి రణబాలి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కాగా ఈ సినిమా బండి నారాయణస్వామి రాసిన శప్తభూమి అనే నవల ఆధారంగా తెరకెక్కుతోన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Jan 27, 2026, 3.50 pm IST
RanaBaali | విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హిస్టారికల్ మూవీకి రణబాలి అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను రిపబ్లిక్ డే సందర్భంగా సోమవారం రిలీజ్ చేశారు. బ్రిటీషర్ల దోపిడీ, వారు సాగించిన మారణకాండ నేపథ్యంలో ఈ మూవీ సాగబోతున్నట్లు గ్లింప్స్ ద్వారా హింట్ ఇచ్చారు. బ్రిటీషర్లను ఎదురించి పోరాడిన యోధుడిగా విజయ్ దేవరకొండ ఈ మూవీలో కనిపించబోతున్నట్లు గ్లింప్స్‌లో చూపించారు. విజువల్స్, టైటిల్, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లుక్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. సెప్టెంబర్ 11న ఈ హిస్టారికల్ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
బండి నారాయణస్వామి నవల...
కాగా రణబాలి మూవీ బండి నారాయణస్వామి రాసిన శప్తభూమి నవల ఆధారంగా రూపొందుతోన్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ నవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును గెలచుకుంది.
18వ శతాబ్దంలో రాయలసీమ చరిత్ర, పాలెగాళ్ల సంస్థానాల సంస్కృతి, చరిత్ర, ఆచారాలను కళ్లకు కట్టినట్టుగా ఈ నవలలో ఆవిష్కరించారు బండి నారాయణస్వామి. పాలెగాళ్ల మధ్య ఐక్యతను దెబ్బతీసి వారిని బ్రిటీషర్లు ఎలా దోచుకున్నారన్నది ఈ నవలలో చర్చించారు రచయిత.
ఈ నవల ఆధారంగానే రణబాలి మూవీని దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించబోతున్నట్లు గ్లింప్స్ చూస్తుంటే తెలుస్తోంది. రణబాలి గ్లింప్స్‌లో సర్ థియోడర్ హెక్టర్ అనే పాత్రలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లో కనిపించబోతున్నట్లు చూపించారు. శప్తభూమి నవలలో ఈ థియోడర్ హెక్టర్ పాత్ర ఉంటుంది. అనంతపురం జిల్లా కలెక్టర్‌గా హెక్టర్ ఈ నవలలో కనిపిస్తాడు. ప్రజలకు అండగా నిలిచే బ్రిటీషర్‌గా పాజిటివ్ కోణంలోనే అతడి పాత్ర సాగుతుంది.
ఎల్లప్ప జెట్టీ...
శప్తభూమి నవలలోని ఎల్లప్ప జెట్టీ పాత్రను విజయ్ దేవరకొండ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సామాన్యుడిగా జీవితాన్ని మొదలుపెట్టిన ఎల్లప్ప పాలెగాళ్ల సంస్థానానికి అమరనాయకుడిగా ఎలా నియమించబడ్డాడు? బ్రిటీషర్లతో పాటు శత్రువుల కుట్రలను ఎదురించి తమ దేశం, రాజ్యం కోసం ఎలాంటి పోరాటాన్ని సాగించాడన్నది స్ఫూర్తిదాయకంగా ఈ నవలలో కనిపిస్తుంది. ఎల్లప్ప పాత్ర ఈ నవలలో రణబాలిగా ఆచారానికి బలైనట్లుగా కనిపిస్తుంది. పాలెగాళ్ల ప్రాంత గౌరవాన్ని కాపాడటం కోసం....శత్రువుల మీద విజయం సాధించే క్రమంలో చేసే ప్రాణత్యాగాన్ని రణబాలి ఆచారంగా ఈ నవలలో చూపించారు రచయిత.
ప్రేమకథ...
కేవలం ఎల్లప్ప జెట్టి పరాక్రమమే కాకుండా భార్య ఇమ్మడమ్మతో అతడి ప్రేమకథను హృద్యంగా ఈ నవలలో ఆవిష్కరించారు రచయిత. ఇమ్మడమ్మ పాత్రను రణబాలి సినిమాలో రష్మిక మందన్న చేయబోతున్నట్లు సమాచారం. ఇమ్మడమ్మ పేరును సినిమా కోసం జయమ్మగా మార్చినట్లు తెలుస్తోంది.
శప్తభూమి నవలలోని మూలకథకు కమర్షియల్ హంగులను మేళవించి ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు సమాచారం. దేశభక్తి కోణాన్ని ఈ నవలలో హైలైట్ చేయబోతున్నట్లు కనిపిస్తోంది. ఎల్లప్ప జెట్టీ పాత్ర శప్తభూమి నవలలో విషాదంగా ముగుస్తుంది. సినిమాలో అలాగే ఉంచుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | హీరోయిన్ అందాన్ని పొగుడుతూ నోరుజారిన రష్మిక – బోల్డ్ కామెంట్స్ వైరల్
మే 18, 2026

Tollywood | నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్ల వివాదం – రామ్‌చరణ్ పెద్దిపై ఎఫెక్ట్ – మెగా ఫ్యాన్స్‌లో టెన్షన్
మే 14, 2026

Kriti Sanon | నేను నెపోటిజం బాధితురాలినే – బాలీవుడ్లో హీరోయిన్లపై వివక్ష ఎక్కువే – కృతి సనన్ కామెంట్స్
మే 10, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



