త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Music Director Deva | దిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కుడు దేవా క‌న్నుమూత – నాలుగు వంద‌ల సినిమాల‌కు స్వ‌ర‌క‌ర్త‌గా…

ద‌క్షిణాది దిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కుడు డైరెక్ట‌ర్ దేవా శ‌నివారం గుండెపోటుతో చెన్నైలో క‌న్నుమూశారు. మూడు ద‌శాబ్దాల సినీ ప్ర‌యాణంలో తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో క‌లిపి నాలుగు వంద‌ల‌కుపైగా సినిమాల‌కు సంగీతం అందించారు. భాష‌, తొలి ప్రేమ‌, అరుణాచ‌లం, మాస్ట‌ర్‌, ప్రేమ‌లేఖ‌తో పాటు ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాల‌కు దేవా అందించిన పాట‌లు సంగీత ప్రియుల‌ను మెప్పించాయి.

N

Entertainment | Published On Oct 17, 2026, 1.56 pm IST

Music Director Deva | దిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కుడు దేవా క‌న్నుమూత – నాలుగు వంద‌ల సినిమాల‌కు స్వ‌ర‌క‌ర్త‌గా…
Advertisement

Music Director Deva | ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటుచేసుకుంది. దిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కుడు దేవా (75) గుండెపోటుతో శ‌నివారం చెన్నైలో క‌న్నుమూశారు. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో క‌లిపి నాలుగు వంద‌ల‌కుపైగా సినిమాల‌కు సంగీతం అందించారు దేవా. ర‌జ‌నీకాంత్‌, చిరంజీవి, క‌మ‌ల్‌హాస‌న్‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ వంటి సూప‌ర్ స్టార్ల‌తో క‌లిసి ప‌నిచేశారు.

ఇళ‌య‌రాజా గురువు...

దేవా అస‌లు  పేరు దేవ‌నేశ‌న్ చొక్క‌లింగం. 1950లో చెన్నైలో జ‌న్మించారు. దేవా మ్యూజిక్ జ‌ర్నీ దూర‌ద‌ర్శ‌న్‌తో మొద‌లైంది. టీవీ సీరియ‌ల్స్‌, షోల‌కు సంగీతం అందించారు. ఇళ‌య‌రాజాకు గురువైన ధ‌న‌రాజ్ వ‌ద్దే దేవా కూడా సంగీత పాఠాలు నేర్చుకున్నారు. 1986లో వ‌చ్చిన మాట్టుక‌ర మ‌న్నారా మూవీతో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఆయన జ‌ర్నీ మొద‌లైంది. వైగ‌సి పొరందాసు సినిమాతో తొలి విజ‌యాన్ని అందుకున్నారు. ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ సినిమాతో త‌మిళ‌నాట దేవా పేరు మారుమోగింది. 1992లో ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టించిన అన్నామ‌లై దేవా సినీ ప్ర‌యాణాన్ని మ‌లుపుతిప్పింది. ర‌జ‌నీకాంత్ కెరీర్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్లుగా బాషా, అరుణాచ‌లం విజ‌యాల్లో దేవా మ్యూజిక్ పాత్ర కూడా ఉంది.

తెలుగులో...

మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా దేవా తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడే. చిరంజీవి మాస్ట‌ర్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ తొలి ప్రేమ‌తో పాటు ప‌లు విజ‌య‌వంత‌మైన సినిమాల‌కు సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌నిచేశారు. ఈ సినిమాల్లో మెలోడీ ప్ర‌ధానంగా దేవా అందించిన పాట‌లు పెద్ద హిట్ట‌య్యాయి. టాలీవుడ్ లో ఆటోడ్రైవ‌ర్‌, గ్రీకువీరుడు, క‌లుసుకోవాల‌ని, నాగ‌, నాయుడ‌మ్మ‌, విజ‌య‌ద‌శ‌మితో పాటు సంగీత ద‌ర్శ‌కుడిగా చాలానే సినిమాలు చేశారు దేవా. ప్రేమ‌లేఖ వంటి డ‌బ్బింగ్ సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. మెలోడీ, మాస్‌..భ‌క్తి... బాణీ ఏదైనా దానికి త‌గ్గ‌ట్లుగా మ్యూజిక్ అందించ‌డంలో సిద్ధ‌హ‌స్తులుగా పేరుతెచ్చుకున్నారు. ర‌జ‌నీకాంత్ ఇంట్ర‌డ‌క్ష‌న్ కోసం ఇప్ప‌టికీ దేవా మ్యూజిక్‌నే సినిమాల్లో వాడుతున్నారు.

ఏఆర్ రెహ‌మాన్‌తో పోటీ...

ఇళ‌య‌రాజా, ఏఆర్ రెహ‌మాన్ వంటి దిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కుల‌తో పోటీని త‌ట్టుకొని త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌దైన ముద్ర‌వేశారు దేవా. ఒకానొక ద‌శ‌లో వారికి గ‌ట్టి పోటీ ఇచ్చారు. 1996లో ఒకే ఏడాది 36 సినిమాల‌కు సంగీతం అందించి రికార్డ్ క్రియేట్ చేశారు. గానా అనే చెన్నై జాన‌ప‌ద శైలిని సినిమా రంగానికి ప‌రిచ‌యం చేసింది దేవానే.

త‌న‌యుడు...

దేవా కుటుంబం మొత్తం సంగీతక‌ళ‌కే ప‌రిమిత‌మైంది. దేవా త‌న‌యుడు శ్రీకాంత్ దేవాతో పాటు సోద‌రులు స‌బేష్ - ముర‌ళి ప‌లు త‌మిళ, తెలుగు సినిమాల‌కు మ్యూజిక్ డైరెక్ట‌ర్లుగా ప‌నిచేశారు. మేన‌ల్లుడు జై త‌మిళంలో హీరోగా కొన‌సాగుతోన్నారు.

దేవా తెలుగు సూప‌ర్ హిట్ సాంగ్స్‌

స్టైలు స్టైలురా (బాషా)
బాషా చూడూ (బాషా)
తమ్ముడూ.. అరే తమ్ముడూ (మాస్టర్)
ఏప్రిల్ మాసంలో (వాలి)
సోనా సోనా (వాలి)
ఈ మ‌న‌సే ( తొలి ప్రేమ‌)
ఏమి సోద‌రా (తొలి ప్రేమ‌)
గ‌గ‌నానికి ఉద‌యం ఒక‌టే (తొలి ప్రేమ‌)
తిలోత్త‌మా (మాస్ట‌ర్‌)
చంద‌మామ (ఆటో డ్రైవ‌ర్‌)

 

Advertisement
Advertisement