త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Singer Keneesha | జ‌యం ర‌వితో బ్రేక‌ప్ – సోష‌ల్ మీడియాలో సింగ‌ర్ కెనీషా ఎమోష‌న‌ల్ పోస్ట్‌

కోలీవుడ్ హీరో జ‌యం ర‌వితో సింగ‌ర్ కెనీషా డేటింగ్‌లో ఉన్న‌ట్లుగా చాలా కాలంగా రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. జ‌యం ర‌వికి అత‌డి భార్య అర్తికి మ‌ధ్య విభేదాలు, విడాకుల‌కు కెనీషానే కార‌ణ‌మంటూ నెటిజ‌న్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఈ విమ‌ర్శ‌ల‌పై కెనీషా రియాక్ట్ అయ్యింది. జ‌యం ర‌వికి దూర‌మ‌వుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

N

Entertainment | Published On May 16, 2026, 11.46 am IST

Singer Keneesha | జ‌యం ర‌వితో బ్రేక‌ప్ – సోష‌ల్ మీడియాలో సింగ‌ర్ కెనీషా ఎమోష‌న‌ల్ పోస్ట్‌
Advertisement

Singer Keneesha |  జ‌యం ర‌వితో సింగ‌ర్ కెనీషా డేటింగ్‌లో ఉన్న‌ట్లు గ‌త రెండేళ్లుగా రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. ప‌లు త‌మిళ‌ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో వీరిద్ద‌రు జంట‌గా క‌నిపించారు. క‌లిసే టూర్ల‌కు వెళ్ల‌డంతో జ‌యం ర‌వి, కెనీషా ప్రేమ‌లో ఉన్న‌ది నిజ‌మేన‌ని అంతా అనుకున్నారు. ఇటీవ‌ల త‌మిళ‌నాడు ఎన్నిక‌ల రోజున కూడా కెనీషాతో క‌లిసి జ‌యం ర‌వి తిరుమ‌ల వ‌చ్చారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్నారు. త‌న భార్య అర్తి నుంచి 2024లో జ‌యం ర‌వి విడిపోయారు. ఆర్తికి విడాకులు ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఈ విడాకుల‌కు కెనీషానే కార‌ణ‌మంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సింగ‌ర్‌పై సోష‌ల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ వ‌స్తున్నాయి. ఈ విమ‌ర్శ‌ల‌పై ఎట్ట‌కేల‌కు సింగ‌ర్ కెనీషా రియాక్ట్ అయ్యింది. జ‌యం ర‌వికి దూర‌మ‌వుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అంతే కాకుండా ఇన్‌స్టా అకౌంట్‌ను డిలీట్ చేయ‌డ‌మే కాకుండా తాను చెన్నై కూడా వ‌దిలిపెడుతున్న‌ట్లు కెనీషా ప్ర‌క‌టించింది.

జ‌యం ర‌వి ఇష్టం...

జ‌యం ర‌వి ఆర్తి విడాకుల‌కు తానే కార‌ణ‌మంటూ జ‌రుగుతోన్న దుష్ప్రచారం చేస్తున్నార‌ని, లీగ‌ల్ నోటీసులు పంపించిన కూడా త‌న‌పై నింద‌లు వేయ‌డం ఆప‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. "ఎవ‌రితో క‌లిసి ఉండాలి, స్నేహం చేయాలి అన్న‌ది జ‌యం ర‌వి ఇష్ట‌మ‌ని అన్న‌ది. నిజానిజాలు తెలుసుకోకుండా త‌న‌ను విమ‌ర్శించే హ‌క్కు ఎవ‌రికి లేద‌ని" అన్న‌ది.

మంచిత‌నానికి చోటు లేదు...

"ప్ర‌పంచం మొత్తం అవాస్త‌వాల‌తో నిండిపోయింది. ఇక్క‌డ మంచిత‌నానికి చోటు లేదు. క‌ష్టాల్లో ఉన్న ఒక మంచి వ్య‌క్తికి అండ‌గా నిల‌బ‌డాల‌ని అనుకోవ‌డం, అత‌డి జీవితాన్ని చ‌క్క‌దిద్దేందుకు సాయం చేయాల‌ని అనుకోవ‌డం మూర్ఖ‌త్వ‌మే అని అర్థమైంది.ఇక‌పై యుద్దాలు చేసే శ‌క్తి నాకు లేదు. పోరాటాలు చేయ‌లేను. అందుకే ప్రేమ‌తోనే అత‌డి నుంచి దూరం అవుతున్నాను. అత‌డిని పూర్తిగా వ‌దిలేస్తున్నాను. అత‌డి కోసం నేను నాపై వేసుకున్న బాధ్య‌త‌ల‌న్నింటి నుంచి కూడా వైదొలుగుతున్నాను. ఇక‌పై అత‌డు పూర్తిగా మీవాడే. నేను అన్నింటిలో ఓడిపోయాను. సంగీతంతో పాటు చెన్నైని కూడా వ‌దిలేస్తున్నాను. ఆన్‌లైన్ వేధింపులు, ట్రోలింగ్‌కు దూరంగా ఉండాల‌నే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను కూడా డిలీట్ చేస్తున్నాను" అని కెనీషా త‌న పోస్ట్‌లో పేర్కొన్న‌ది. ఆమె పోస్ట్ వైర‌ల్ అవుతోంది.

 

Advertisement
Advertisement