Sandhya Theatre Case | సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుపై కోర్టు కీలక ఆదేశాలు – ఏం చెప్పిందంటే?
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణ జరుగుతోంనది, వాస్తవాలేమిటన్నది తేలకముందే ఎలాంటి నిరాధారమైన కథనాలు, ప్రచారాలు చేయద్దని ఆదేశించింది.
Entertainment | Published On Jun 14, 2026, 1.01 pm IST
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణ కొనసాగుతోందని, నిజానిజాలు తేలకముందే ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఎలాంటి అసత్య ప్రచారాలు, ఊహాగానాలు చేయద్దని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటోన్న అల్లు అర్జున్‌తో పాటు మిగిలిన వారిపై సోషల్ మీడియాలో అనేక పుకార్లు వ్యాప్తి అవుతోన్నాయి. వీటిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది వాస్తవాలేమిటన్నది నిర్ధారణ కాకముందే ఎలాంటి నిరాధార ఆరోపణలు చేయద్దని చెప్పింది. వాస్తవాలకు విరుద్ధమైన చర్చలు, టీవీ డిబేట్లను కూడా నిర్వహించదవద్దని కోర్టు అదేశించింది. అంతే కాకుండా అసత్య ప్రచారాలు చేస్తూ కథనాలు ప్రచురించవద్దని , సోషల్ మీడియా పోస్టులను పెట్టవద్దని కోరింది. తుది తీర్పు వెలువడే వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని జూన్ 4న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల్లో కోర్టు చెప్పింది.
అల్లు అర్జున్‌పై కేసు....
పుష్ప 2 రిలీజ్‌కు ముందు రోజు సంధ్య థియేటర్‌లో స్పెషల్ ప్రీమియర్‌ను ప్రదర్శించారు. ఈ ప్రీమియర్‌కు అల్లు అర్జున్ రావడంతో థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ చనిపోయింది. మరో చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ తొక్కిసలాటకు సంబంధించి అల్లు అర్జున్‌తో పాటు అతడి టీమ్, థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ తొక్కిసలాట కేసులో బెయిల్‌పై అల్లు అర్జున్ రిలీజయ్యాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణ సాగుతోంది. కాగా చనిపోయిన మహిళకు నష్టపరిహారాన్ని అందజేశాడు అల్లు అర్జున్. అతడితో పాటు పుష్ప టీమ్‌కు కూడా ఆ కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి ట్రీట్‌మెంట్‌కు అవసరమైన వైద్య ఖర్చులను కూడా అల్లు అర్జున్ కుటుంబమే భరిస్తోంది.
తాజావార్తలు
- ●Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం
- ●DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్
- ●CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి
- ●Tollywood Heroine | ఎన్టీఆర్ సింహాద్రి హీరోయిన్ - ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
- ●Malisetti Dancing Daffodils | ఘట్కేసర్లో ఆకాశహర్మ్యం: 72 అంతస్తులతో హైదరాబాద్‌కే ల్యాండ్‌మార్క్‌గా 'డ్యాన్సింగ్ డాఫోడిల్స్'!

Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం

DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్

CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి

Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి



