త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rakul Preet Singh | అతనే నా బలం.. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..!

Rakul Preet Singh | తీవ్ర గాయంతో ఎదురైన కఠిన పరిస్థితుల్లో భర్త జాకీ భగ్నాని అండగా నిలిచాడని నటి ర‌కుల్ ప్రీత్ సింగ్ వెల్లడించింది. కోలుకునే ప్రయాణంలో ఆయన ఇచ్చిన మద్దతే తనకు అతిపెద్ద బలమని తెలిపింది.

P

Entertainment | Published On May 2, 2026, 11.30 am IST

Rakul Preet Singh | అతనే నా బలం.. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..!
Advertisement

Rakul Preet Singh | టాలీవుడ్‌ హీరోయిన్‌ ర‌కుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఇటీవల తన జీవితంలో ఎదురైన కఠిన పరిస్థితులను గుర్తు చేసుకుంది. తీవ్ర గాయానికి గురైన సమయంలో తన భర్త జాకీ భగ్నాని (Jackky Bhagnani) ప్రతి అడుగులోనూ అండగా నిలిచాడని వెల్లడించింది. తన భర్తతో కలిసి ఫేమస్లీ ఫిట్‌ విత్‌ సోఫీ (Famously Fit with Sophie) కార్యక్రమంలో పాల్గొన్న రకుల్‌, ఈ విషయాలను పంచుకుంది. ఈ షోను సోఫీ చౌదరీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రకుల్‌ మాట్లాడుతూ జాకీ తనకు అతిపెద్ద బలమని, కోలుకునే సమయంలో ఎప్పుడూ అసహనం చూపలేదని తెలిపింది.

ప్రతి పనిని కలిసి చేసినట్టు వెల్లడించింది. తాను మాట్లాడుతున్నప్పుడు ఆయన పూర్తిగా వినడం తనకు పెద్ద సహాయమని చెప్పింది. జాకీ–రకుల్‌ల పరిచయం రోజువారీ అలవాట్లు, ఒకరికొకరు అండగా నిలబడటం ద్వారా క్రమంగా బలపడిందని తెలిపారు. వ్యాయామం తమ జీవితంలో ముఖ్యమైన భాగమని స్పష్టం చేశారు. జాకీ మాట్లాడుతూ, జిమ్‌కు వెళ్లడం తమకు ప్రత్యేకం కాదని, స్నానం చేసినట్టే ఇది కూడా రోజువారీ అలవాటని చెప్పారు. దీనిపై రకుల్‌ స్పందిస్తూ కొందరు ప్రతిరోజూ పుస్తకాలు చదువుతారని, మరికొందరు ప్రత్యేక ఆహారం తీసుకుంటారని పేర్కొంది. తమకు ఉదయం లేచిన వెంటనే వ్యాయామం చేయడం అలవాటని, ఇది బరువు తగ్గడానికి లేదా ఇతరులు చూసేందుకు కాదని స్పష్టం చేసింది.

నిర్మాతగా తన అనుభవాన్ని జాకీ వివరిస్తూ.. ‘నిర్మాణం సులభం కాదు. అది నన్ను మరింత వినయంగా మార్చింది. జీవితాన్ని అర్థం చేసుకోవడం నేర్పింది’ అని పేర్కొన్నాడు. ఈ ఎపిసోడ్‌ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. రకుల్–జాకీ తమ ప్రేమను 2021లో ప్రకటించగా, 2024లో గోవాలో సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నారు. కార్యక్రమాన్ని అమెజాన్‌ ఎక్స్‌ ప్లేయర్‌ (Amazon MX Player) నిర్మించింది. రకుల్‌ సినిమాల విషయానికి వస్తే పతి పత్ని ఔర్‌ వో దో మూవీలో నటిస్తుంది. అయుష్మాన్‌ ఖురానా, సారా అలీఖాన్‌, వామికా గబ్బి తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 15న విడుదల కానుంది.

Advertisement
Advertisement