త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chiranjeevi | నా బ‌లం నువ్వే.. భార్య‌పై ప్రేమ‌ను చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela) స‌తీమ‌ణి సురేఖ కొణిదెల (Surekha Konidela) పుట్టిన‌రోజు నేడు. ఈ సంద‌ర్భంగా త‌న అర్ధాంగికి మెగాస్టార్ ప్ర‌త్యేకంగా జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు.

D

Entertainment | Published On Feb 18, 2026, 4.22 pm IST

Chiranjeevi | నా బ‌లం నువ్వే.. భార్య‌పై ప్రేమ‌ను చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి
Advertisement

Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela) స‌తీమ‌ణి సురేఖ కొణిదెల (Surekha Konidela) పుట్టిన‌రోజు నేడు. ఈ సంద‌ర్భంగా త‌న అర్ధాంగికి మెగాస్టార్ ప్ర‌త్యేకంగా జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. నువ్వే నా బ‌లం అంటూ భార్య‌పై త‌న‌కున్న ప్రేమ‌ను వెల్ల‌డించారు. ఈ మేర‌కు నా ప్రతి అడుగులో నా వెంట నడిచిన సురేఖ కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఎక్స్ వేదిక‌గా భావోద్వేగ పోస్టు పెట్టారు.

"నా సురేఖ‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. 1980 ఫిబ్ర‌వ‌రి 20న మ‌న పెళ్లి జ‌రిగిన నాటి నుంచి నువ్వే నా బ‌లంగా మారావు. ఈ రోజు నీ పుట్టిన‌రోజుతోపాటూ రెండు రోజుల ముందే మ‌న పెళ్లి రోజునుకూడా జ‌రుపుకోవ‌డం సంతోషంగా ఉంది. కుటుంబానికి మెయిన్ పిల్ల‌ర్ నువ్వు. నీ ప్రేమ‌, ఆప్యాయ‌త‌తో కుటుంబం మొత్తాన్ని ఒక‌తాటిపై ముందుకు న‌డిపిస్తున్నావు. మా అమ్మ‌ను సొంత బిడ్డ‌లా చూసుకుంటున్నావు. నా ప్ర‌తి విజ‌యం వెనుకా ఉన్నది నువ్వే. కుటుంబం బాధ్య‌త‌ను నీ భుజాన వేసుకున్నావు కాబ‌ట్టే నేను సినిమాల్లో రాణిస్తున్నాను. నీ వ‌ల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను" అంటూ చిరు త‌న పోస్టులో రాసుకొచ్చారు. ఈ మేర‌కు కొన్ని ఫొటోలు షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ పోస్టు వైర‌ల్ అవుతోంది. ఇది చూసిన నెటిజ‌న్లు, మెగా అభిమానులు సురేఖ‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.

https://x.com/KChiruTweets/status/2024020844427833694

Advertisement
Advertisement