త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bollywood | థియేట‌ర్ల‌లో వంద వారాలుగా ఆడుతోన్న బాలీవుడ్ మూవీ – 2024 నుంచి నాన్‌స్టాప్ స్క్రీనింగ్‌ – అస‌లు ట్విస్ట్ ఇదే!

2024లో రిలీజైన బాలీవుడ్ మూవీ అమీనా ముంబాయిలోని మూవీ టైమ్ మ‌ల్టీప్లెక్స్‌లో ఇప్ప‌టికీ ఆడుతోంది. మార్చి 6 నాటితో ఈ సినిమా వంద వారాలు పూర్తిచేసుకోబోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ రికార్డు వెనుక ఓ పెద్ద ట్విస్ట్ ఉంద‌ట‌. అదేమిటంటే?

N

Entertainment | Published On Mar 2, 2026, 8.08 pm IST

Bollywood | థియేట‌ర్ల‌లో వంద వారాలుగా ఆడుతోన్న బాలీవుడ్ మూవీ – 2024 నుంచి నాన్‌స్టాప్ స్క్రీనింగ్‌ – అస‌లు ట్విస్ట్ ఇదే!
Advertisement

Bollywood | ఒకప్పుడు సినిమాలు థియేట‌ర్ల‌లో అర్ధ‌శ‌త‌దినోత్స‌వాలు, శ‌త‌దినోత్స‌వాలు జ‌రుపుకునేవి. సంవ‌త్స‌రం పాటు ఆడిన సినిమాలు ఉన్నాయి. కానీ ఓటీటీ ట్రెండ్‌తో శ‌త‌దినోత్స‌వాల ట్రెండ్‌కు పుల్‌స్టాప్ ప‌డింది. ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా వారం నుంచి రెండు వారాలు ఆడ‌ట‌మే గొప్ప‌గా మారింది. రిజ‌ల్ట్ ఏ మాత్రం అటూ ఇటూ వారంలోనే సినిమాలుథియేట‌ర్ల‌లో క‌నిపించ‌కుండాపోతున్నాయి. కానీ ఓ బాలీవుడ్ మూవీ మాత్రం ఏకంగా వంద వారాలుగా థియేట‌ర్ల‌లో ఆడుతోంది. అలాగ‌ని అదేం స్టార్ ఉన్న సినిమా కాదు. పెద్ద డైరెక్ట‌ర్లు తెర‌కెక్కించ‌లేదు. అయినా గ‌త రెండేళ్లుగా నాన్‌స్టాప్‌గా థియేట‌ర్ల‌లో ఆడుతోంది. సినిమా పేరు అమీనా.

2024లో రిలీజ్‌...

అమీనా సినిమా 2024 ఏప్రిల్ 12న థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. అజయ్ దేవగన్ మైదాన్, అక్షయ్ కుమార్ బడే మియా ఛోటే మియా వంటి పెద్ద సినిమాల‌కు పోటీగా అమీనా మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. గ‌త రెండేళ్లుగా ముంబైలోని మూవీటైమ్ మ‌ల్టీప్లెక్స్‌లో అమీనా సినిమా ఇప్పటికీ మార్నింగ్ షోగా ప్రదర్శితమవుతోంది. ఈ శుక్రవారం (మార్చి 6) నాటికి ఈ సినిమా విజయవంతంగా 100 వారాలు పూర్తి చేసుకోనున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. థియేట‌ర్ల‌లో అత్య‌ధిక కాలం పాటు ప్ర‌ద‌ర్శిత‌మైన‌ బాలీవుడ్ సినిమాల్లో ఒక‌టిగా అమీనా రికార్డ్ క్రియేట్ చేసింది.

సోష‌ల్ మీడియాలో

సోష‌ల్ మీడియాలో మాత్రం అమీనా మూవీ వంద వారాల రికార్డును ట్రోల్ చేస్తున్నారు. నిర్మాత‌లు కావాల‌నే ప్ర‌తి రోజు ఒక షోను ఆడిస్తున్నార‌ని అంటున్నారు. రోజు ఇర‌వై టికెట్లు బుక్ చేస్తున్నార‌ట‌. కానీ సినిమా చూడ‌టానికి మాత్రం ఎవ‌రూ రావ‌డం లేద‌ట‌. కేవ‌లం రికార్డులు, త‌మ నెక్స్ట్ సినిమాల ఓటీటీ మార్కెట్ పెంచుకోవ‌డానికే ఆడిస్తున్నార‌ని అంటున్నారు. నిర్మాత మాత్రం ఈ రూమ‌ర్ల‌ను కొట్టిప‌డేస్తున్నారు. వంద వారాలు పూర్తిచేసుకోనున్న సంద‌ర్భంగా ఓ ప్రెస్‌మీట్ పెట్ట‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వీకెండ్స్‌తో పాటు సెల‌వుల్లో వంద శాతం ఆక్యుపెన్సీతో ఈ మూవీ ర‌న్ అవుతున్న‌ట్లు వెల్ల‌డించారు.యాక్ష‌న్ డ్రామా థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ మూవీలో రేఖా రానా, అనంత్ మ‌హ‌దేవ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. కుమార్ రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

Advertisement
Advertisement