TCS Nashik Harassment Case | “నా చీర కొంగు లాగారు.. తొడపై చేయి వేశారు”: టీసీఎస్‌లో మహిళా ఉద్యోగికి నరకం
టీసీఎస్ (TCS) నాసిక్ బ్రాంచ్‌లో చోటుచేసుకున్న లైంగిక వేధింపుల వ్యవహారం సంచలనంగా మారింది. కొత్తగా పెళ్లైన ఓ మహిళా ఉద్యోగిని తోటి కలీగ్స్ 'ప్లేయర్', 'జీరో ఫిగర్' అంటూ కామెంట్లతో పాటు అసభ్యంగా తాకుతూ వేధించిన తీరుపై ఆమె పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.
TCS Nashik Harassment Case | త్రినేత్ర.న్యూస్ : భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నాసిక్ ఆఫీసులో ఓ మహిళా ఉద్యోగిపై జరిగిన దారుణమైన లైంగిక వేధింపుల వ్యవహారం వెలుగుచూసింది. కొత్తగా పెళ్లైన ఆమెపై తోటి ఉద్యోగులు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ, శారీరకంగా, మానసికంగా వేధించినట్లు పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. ఈ కేసులో నాసిక్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఇప్పటివరకు ఒక మహిళా ఆపరేషన్స్ మేనేజర్‌తో సహా ఎనిమిది మందిని అరెస్టు చేసింది.
శిక్షణ సమయంలోనే వేధింపులు షురూ..
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు తాను ఎదుర్కొన్న నరకాన్ని పూసగుచ్చినట్లు వివరించింది. ఆమె భర్త పూణేలో పనిచేస్తుండటంతో, నాసిక్‌లో అత్తమామలతో కలిసి ఉంటూ జూన్ 20, 2025న టీసీఎస్ నాసిక్ బ్రాంచ్‌లో 'అసోసియేట్'గా చేరారు. ఆమె శిక్షణకు షారుఖ్ ఖురేషీ, జయేష్ గుంజాల్ నాయకత్వం వహించారు. అయితే, లోన్స్ బ్రాంచ్ టీమ్ లీడర్ అయిన రజా మీనన్ అనే వ్యక్తికి శిక్షణతో సంబంధం లేకపోయినా పదేపదే ఆమె దగ్గరకు వచ్చి వ్యక్తిగత జీవితం గురించి ఆరా తీసేవాడని ఆమె పేర్కొన్నారు.
"మీ భర్త దూరంగా ఉంటున్నాడు కదా, ఎలా మేనేజ్ చేస్తున్నావు? భయం వేయదా? నేను ఎప్పుడైనా నీకు అండగా ఉంటాను" అని రజా అనేవాడని బాధితురాలు తెలిపారు. ఆమె వివాహమై నెల రోజులే అయినప్పటికీ హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లారు? అక్కడ ఏం చేశారు? అంటూ ఇబ్బంది పెట్టేవాడని వాపోయింది. రజా అలా మాట్లాడుతుంటే ఆమె టీమ్ లీడర్ షారుఖ్ ఖురేషీ ప్రోత్సహించేవాడని, ఆమెది లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా? అని పదేపదే అడిగేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రజా మీనన్ ఆమెను 'ప్లేయర్' (Player) అని పిలుస్తూ.. "నీకు ఇంతకు ముందు చాలా మంది బాయ్‌ఫ్రెండ్స్ ఉండి ఉంటారు. వాళ్లందరినీ వదిలేసి ఎలా పెళ్లి చేసుకున్నావు? వాళ్లు మళ్లీ నీ వెంట పడితే నీ భర్తకు తెలిస్తే ఏమవుతుంది?" అంటూ మానసికంగా వేధించినట్లు పోలీసులకు వివరించారు.
చీర కొంగు లాగి.. అసభ్యంగా తాకి..
ఈ ఏడాది మార్చిలో గుడిపడ్వా పండుగ రోజున తాను చీర కట్టుకుని ఆఫీసుకు వెళ్లగా, లాబీలో నడుస్తుండగా రజా తన చీర కొంగును లాగాడని, వెనక్కి తిరిగి చూసేసరికి అసభ్యకరంగా చూస్తూ నవ్వాడని బాధితురాలు సంచలన ఆరోపణలు చేశారు.
ట్రైనింగ్ ముగిసిన తర్వాత అతుల్ పాండే నేతృత్వంలోని టీమ్‌లో ఆమె జాయిన్ అయ్యారు. ఆ సమయంలో ఆసిఫ్ అన్సారీ అనే మరో ఉద్యోగి ఆమెను భౌతికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఖాళీ సీట్లు ఉన్నప్పటికీ ఆమె పక్కనే కూర్చుని, ఆమె శరీరాన్ని తాకడం, తొడపై, భుజంపై చెయ్యి వేయడం వంటివి చేసేవాడని ఆమె వాపోయింది. "నీకు 'జీరో ఫిగర్' ఉంది అంటూ పొట్ట, నడుము భాగాల్లో తాకాడు. ఓసారి గ్యాలరీలో ఉండగా నన్ను గట్టిగా కౌగిలించుకోగా, నేను కోపంతో నెట్టివేసి అక్కడినుంచి పారిపోయాను" అని బాధితురాలు వాపోయింది. ఆసిఫ్ ఆఫీసులోనే కాకుండా ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్‌ఇన్ ద్వారా కూడా ఆమెను వెంబడించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మతపరమైన వ్యాఖ్యలు.. సీఎం ఫడ్నవీస్ సీరియస్
నిందితులు హిందూ దేవుళ్లపై కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పాటు బలవంతపు మత మార్పిడులకు ప్రోత్సహిస్తున్నారని ఏడుగురి కంటే ఎక్కువ మంది మహిళలు ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. ఇది 'కార్పొరేట్ జిహాద్' (Corporate Jihad) కు నిదర్శనమని, అత్యంత ఆందోళన కలిగించే అంశమని ఆయన పేర్కొన్నారు.
టీసీఎస్ చర్యలు.. నిందితుల కుటుంబాల స్పందన
ఈ ఘటనపై స్పందించిన టీసీఎస్ (TCS) యాజమాన్యం.. వేధింపుల పట్ల తమకు 'జీరో టాలరెన్స్' (Zero-Tolerance) విధానం ఉందని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేసింది. అయితే ప్రాథమిక నివేదికలో తమకు పీఓఎస్‌హెచ్ (POSH) కమిటీ ద్వారా ఎటువంటి ఫిర్యాదు అందలేదని కంపెనీ పేర్కొంది. అంతర్గత విచారణ కోసం ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.
మరోవైపు, ప్రధాన నిందితుడు రజా మీనన్ కుటుంబ సభ్యులు ఈ ఆరోపణలను ఖండించారు. ఇదంతా ఆఫీసులోని ప్రొఫెషనల్ పాలిటిక్స్, మతపరమైన వివక్షలో భాగంగా అల్లిన 'కుట్ర' అని రజా మీనన్ మామ అయాజ్ ఖాజీ ఆరోపించారు. ఉన్నతాధికారులు వేరే మతానికి చెందినవారని, కావాలనే రజాను టార్గెట్ చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



