Student shoots classmate | క్లాస్‌రూమ్‌లోనే విద్యార్థినిపై కాల్పులు జరిపి.. ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్
Student shoots classmate | పంజాబ్ (Punjab college) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తర్న్ తరన్ (Tarn Taran) జిల్లాలో ఓ విద్యార్థి తోటి విద్యార్థినిని క్లాస్‌రూమ్‌లోనే షూట్ (Student shoots classmate) చేశాడు.
Student shoots classmate | పంజాబ్ (Punjab college) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తర్న్ తరన్ (Tarn Taran) జిల్లాలో ఓ విద్యార్థి తోటి విద్యార్థినిని క్లాస్‌రూమ్‌లోనే షూట్ (Student shoots classmate) చేశాడు. అనంతరం అదే తుపాకీతో తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృష్యాలు క్లాస్‌రూమ్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
ఉస్మా (Usma)లోని మై భాగో లా కాలేజీ (Mai Bhago Law College)లో ఈ ఘటన జరిగింది. కాల్పులకు పాల్పడిన విద్యార్థి మల్లియన్ గ్రామానికి చెందిన ప్రిన్స్ రాజ్‌గా గుర్తించారు. యువతిని సందీప్ కౌర్‌గా గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కళాశాల వద్దకు చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లాస్ రూమ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణంగా భావిస్తున్నారు.
వీడియోలో ఏముందంటే..?
సీసీటీవీ వీడియో ప్రకారం.. రాజ్ బ్యాగ్ వేసుకొని క్లాస్‌రూమ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత ఇద్దరు యువతుల వద్దకు వెళ్లి ఏదో కాసేపు మాట్లాడాడు. కాసేపు ముగ్గురూ మాట్లాడుకున్న తర్వాత ఎవరి సీట్లల్లోకి వాళ్లు వచ్చి కూర్చున్నారు. ఆ తర్వాత కూడా ముగ్గురూ ఏదో మాట్లాడుతూ కనిపించారు. ఇంతలో రాజ్ తన బ్యాగ్‌లో ఉన్న గన్ తీసి కౌర్‌పై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత వెంటనే తాను కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో క్లాస్ రూమ్‌లో ఉన్న వారు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతోందో తెలియక.. బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



