School Gunfire | స్కూల్‌లోకి చొరబడి విద్యార్థులపై గన్‌తో కాల్పులు.. నలుగురు మృతి
ఈ నెలలోనే టర్కీలోని రెండు స్కూళ్లలో గన్ కాల్పులు చోటు చేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా అన్ని ప్రాంతాల్లో భద్రతను పెంచారు.
Turkey School Gunfire | నిన్న గాక మొన్ననే టర్కీలోని ఓ స్కూల్‌లో విద్యార్థులపై ఓ వ్యక్తి గన్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో 16 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. అదే స్కూల్‌లో చదివిన విద్యార్థే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఘటన జరిగి రెండు రోజులు కూడా గడవక ముందే మరో స్కూల్‌లో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. టర్కీలోని సౌత్ ఈస్టర్న్ ప్రావిన్స్‌లోని ఒనికియుబాత్ జిల్లాలోని కహ్రమాన్మరాలో ఉన్న ఓ స్కూల్‌లోకి చొరబడ్డ ఆగంతకుడు విద్యార్థులపై విచక్షణారహితంగా గన్‌తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మరణించగా, 20 మందికి గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో ముగ్గురు విద్యార్థులు కాగా, ఒకరు స్కూల్ టీచర్‌గా గుర్తించారు. షూటర్ ఎవరు అనేది ఇంకా తెలియలేదు. స్కూల్‌లో చదివే విద్యార్థే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్కూల్‌లో ఎందుకు దాడికి పాల్పడ్డాడు అనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నెలలోనే టర్కీలోని రెండు స్కూళ్లలో గన్ కాల్పులు చోటు చేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా అన్ని ప్రాంతాల్లో భద్రతను పెంచారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



