త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Techie Drowns In Noida Ditch | నోయిడాలో ఘోరం: 70 అడుగుల లోతు గుంతలో పడ్డ కారు.. తండ్రికి ఫోన్ చేసి ప్రాధేయపడినా దక్కని ప్రాణం

ఆ ప్రాంతంలో ఓ మాల్ నిర్మాణం జరుగుతోందట. అందుకోసమే భారీగా గుంత తవ్వి.. కింది నుంచి బేస్‌మెంట్ నిర్మాణం చేపడుతున్నారు. దాని నిర్మాణం ఇంకా పూర్తికాకపోవడం వల్ల, అక్కడ మురుగు నీరు చేరింది.

J

Crime | Published On Jan 18, 2026, 3.00 pm IST

Techie Drowns In Noida Ditch | నోయిడాలో ఘోరం: 70 అడుగుల లోతు గుంతలో పడ్డ కారు.. తండ్రికి ఫోన్ చేసి ప్రాధేయపడినా దక్కని ప్రాణం
Advertisement

Techie Drowns In Noida Ditch | గ్రేటర్ నోయిడాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న మురుగు కాలువలో కారు పడటంతో అందులో ఉన్న మురుగు నీటిలో కారు మునిగి అందులో ఉన్న 27 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ యువ్‌రాజ్ మెహతా మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి సెక్టార్ 150కి సమీపంలో చోటు చేసుకుంది. యువ్‌రాజ్ ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కనే మురుగు నీటి నిర్వహణ కోసం అధికారులు పెద్ద గుంత తీశారు. అందులో మురుగు నీరు ఉంది. ఓవైపు పొగమంచుతో రోడ్డు సరిగ్గా కనిపించకపోవడంతో రోడ్డు పక్కనే ఉన్న డ్రైనేజీ బేసిన్ రిడ్జ్‌ని తాగిన కారు అదుపుతప్పి నేరుగా మురుగు కాలువలోకి దూసుకెళ్లింది. ఆ మురుగుకాలువలో 70 ఫీట్ల మేర మురుగు నీరు ఉండటంతో క్షణాల్లో కారు అందులో మునిగిపోయింది. వెంటనే తేరుకున్న యువ్‌రాజ్ తన తండ్రికి ఫోన్ చేసి ప్రమాదం గురించి చెప్పాడు. తనకు చావాలని లేదని.. ఎలాగైనా తనను కాపాడాలని వేడుకున్నాడు. కారు నుంచి బయటికి వెళ్లే చాన్స్ లేకపోవడంతో అందులోనే మునిగి చనిపోయాడు. వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్.. 5 గంటల పాటు కష్టపడి కారును వెలికితీయగా.. కారులోనే విగతజీవిగా యువ్‌రాజ్ కనిపించడంతో యువ్‌రాజ్ కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

యువ్‌రాజ్‌ని కాపాడేందుకు యత్నించిన డెలివరీ బాయ్

కారు గుంతలో పడటాన్ని గమనించిన మోనిందర్ అనే డెలివరీ ఏజెంట్ వెంటనే ఆ గుంత దగ్గరికి వెళ్లి యువ్‌రాజ్‌ని కాపాడే ప్రయత్నం చేశాడు. యువ్‌రాజ్‌కి ఊపిరి ఆడటం లేదని గుర్తించి తన నడుముకు తాడు కట్టుకొని డ్రైనేజీలోకి దూకాడు. కానీ.. అప్పటికే యువ్‌రాజ్ మృతి చెందడంతో మునిందర్ తిరిగి పైకి వచ్చేశాడు.

man died after his car fell into a ditch in Greater Noida

అధికారులే బాధ్యులు

10 రోజుల కిందనే ఇదే మురుగు కాలువలో ఓ ట్రక్ పడిందని.. రోడ్డు పక్కనే ఇంత పెద్ద మురుగు కాలువను తవ్వడం, ఎలాంటి ఇండికేషన్స్ లేకుండా ఉండటం వల్ల వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని, అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని మోనిందర్ మండిపడ్డాడు.

అయితే.. ఆ ప్రాంతంలో ఓ మాల్ నిర్మాణం జరుగుతోందట. అందుకోసమే భారీగా గుంత తవ్వి.. కింది నుంచి బేస్‌మెంట్ నిర్మాణం చేపడుతున్నారు. దాని నిర్మాణం ఇంకా పూర్తికాకపోవడం వల్ల, అక్కడ మురుగు నీరు చేరింది. డ్రైనేజీ నీరు రోజు అందులో కలుస్తుండటం వల్ల అది డేంజర్‌గా మారి ఇలా ప్రాణాలు తీస్తోంది. ఈ ఘటనపై స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement