త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Father Kills Twin Daughters | దారుణం: కవల కుమార్తెల గొంతు కోసి చంపిన కన్నతండ్రి

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య ప్రవర్తనపై అనుమానంతో 11 ఏళ్ల కవల కుమార్తెలను కన్నతండ్రే గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయాడు.

J

Crime | Published On Apr 19, 2026, 3.01 pm IST

Father Kills Twin Daughters | దారుణం: కవల కుమార్తెల గొంతు కోసి చంపిన కన్నతండ్రి
Advertisement

Father Kills Twin Daughters | త్రినేత్ర.న్యూస్ : కన్నతండ్రే కాలయముడిగా మారాడు. ప్రాణంగా చూసుకోవాల్సిన కూతుళ్లను అత్యంత కిరాతకంగా గొంతు కోసి హతమార్చాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆదివారం తెల్లవారుజామున వెలుగుచూసింది. భార్యపై ఉన్న అనుమానంతో 11 ఏళ్ల కవల కుమార్తెలను తండ్రి హత్య చేశాడు. అనంతరం నేరాన్ని అంగీకరిస్తూ స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయాడు.

అసలేం జరిగిందంటే

కాన్పూర్‌లోని నౌబస్తా పోలీస్ స్టేషన్ పరిధిలోని త్రిమూర్తి అపార్ట్‌మెంట్‌లో శశి రంజన్ మిశ్రా (48), అతడి భార్య రేష్మ, 11 ఏళ్ల కవల కుమార్తెలు రిద్ధి, సిద్ధి, ఆరేళ్ల కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నాడు. బీహార్‌కు చెందిన శశి రంజన్ మిశ్రా వృత్తిరీత్యా మెడికల్ రిప్రజెంటేటివ్. శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత శశి తన ఇద్దరు కుమార్తెలను నిద్రపుచ్చేందుకు గదిలోకి తీసుకెళ్లాడు.

భార్య రేష్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున సుమారు 2:30 గంటల ప్రాంతంలో ఒక కుమార్తెను వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత లైట్లు ఆర్పేశాడు. సరిగ్గా రెండు గంటల తర్వాత, తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ నెంబర్ (UP-112) కు ఫోన్ చేసి తన ఇద్దరు కుమార్తెలను హత్య చేసినట్లు పోలీసులకు సమాచారం అందించాడు.

Kanpur Horror Father Slits Throats of 11-Year-Old Twin Daughters Arrested

భార్యపై అనుమానంతోనే ఘాతుకం

పోలీసుల ప్రాథమిక విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. తన భార్యకు వేరొకరితో సంబంధం ఉందనే అనుమానంతో శశి రంజన్ తీవ్ర డిప్రెషన్‌కు లోనయ్యాడు. కుమారుడిని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని, కుమార్తెలను తనే పెంచుకుంటానని తరచుగా భార్యతో గొడవ పడేవాడు. ఇంట్లో భార్య కదలికలపై నిఘా ఉంచేందుకు పలు సీసీటీవీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశాడు. కనీసం కుమార్తెల గదిలోకి భార్యను కూడా వెళ్లనిచ్చేవాడు కాదు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రేష్మ... కాన్పూర్‌లోని ఓ బ్యూటీ పార్లర్‌లో పనిచేస్తున్న సమయంలో శషితో పరిచయం ఏర్పడి, 2014లో వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు.

రంగంలోకి పోలీసులు.. నిందితుడి అరెస్ట్

సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు, నౌబస్తా పోలీసులు, ఫోరెన్సిక్ బృందం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పదునైన ఆయుధంతో గొంతు కోయడంతో, రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్న చిన్నారుల మృతదేహాలను చూసి పోలీసులు చలించిపోయారు. ఇంట్లోనే ఉన్న నిందితుడు శశి రంజన్‌ను అదుపులోకి తీసుకుని క్రైమ్ సీన్ నుంచి ఆధారాలు సేకరించారు.

డీసీపీ సౌత్ దీపేంద్ర నాథ్ చౌదరి ఏమన్నారంటే..

"కవలల గొంతు కోసి హత్య చేసిన తండ్రిని అరెస్టు చేశాం. మృతదేహాలకు పంచనామా నిర్వహించి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించాం. ఈ ఘటనపై అన్ని కోణాల్లో లోతైన విచారణ జరుపుతున్నాం. ప్రస్తుతం ఆ ప్రాంతంలో శాంతిభద్రతల పరిస్థితి అదుపులోనే ఉంది. చట్టపరమైన చర్యల అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలిస్తాం." అని తెలిపారు.

Advertisement
Advertisement