త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Goldiam International | గోల్డియామ్ ఇంట‌ర్నేష‌న‌ల్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. 3 షేర్ల‌కు 1 షేర్ ఫ్రీ..

Goldiam International | వజ్రాభరణాల తయారీ, ఎగుమతి సంస్థ గోల్డియామ్ ఇంట‌ర్నేష‌న‌ల్ తన షేర్‌హోల్డర్లకు భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక (క్యూ4) ఫలితాలతోపాటు 1:3 బోనస్ షేర్ ఇష్యూను ఆమోదించారు.

S

Business | Published On May 30, 2026, 11.41 am IST

Goldiam International | గోల్డియామ్ ఇంట‌ర్నేష‌న‌ల్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. 3 షేర్ల‌కు 1 షేర్ ఫ్రీ..
Advertisement

Goldiam International | వజ్రాభరణాల తయారీ, ఎగుమతి సంస్థ గోల్డియామ్ ఇంట‌ర్నేష‌న‌ల్ తన షేర్‌హోల్డర్లకు భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక (క్యూ4) ఫలితాలతోపాటు 1:3 బోనస్ షేర్ ఇష్యూను ఆమోదించారు. స్టాక్ ఎక్స్చేంజ్‌లో సమర్పించిన వివరాల ప్రకారం షేర్‌హోల్డర్లు కలిగి ఉన్న ప్రతి మూడు ఈక్విటీ షేర్లకు రూ.2 ముఖ విలువ కలిగిన ఒక బోనస్ షేర్‌ను కంపెనీ ఉచితంగా జారీ చేయనుంది. బోనస్ షేర్లకు అర్హులైన పెట్టుబడిదారులను నిర్ణయించేందుకు రికార్డ్ డేట్‌ను తర్వాత ప్రకటిస్తామని కంపెనీ తెలిపింది. ఈ బోనస్ ఇష్యూ కింద దాదాపు 4 కోట్ల కొత్త షేర్లను జారీ చేయనున్నారు. మొత్తం ఇష్యూ విలువ రూ.7.53 కోట్లుగా ఉంటుంది. ఇందుకు కంపెనీ క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వులు (సీఆర్‌ఆర్), సెక్యూరిటీస్ ప్రీమియం ఖాతా, ఫ్రీ రిజర్వులు లేదా 2026 మార్చి 31 నాటికి ఉన్న రిటెయిన్డ్‌ ఎర్నింగ్స్‌ను వినియోగించనుంది.

21 సంవ‌త్స‌రాల్లో తొలిసారిగా..

2026 మార్చి 31 నాటికి కంపెనీ సీఆర్‌ఆర్ రూ.5.67 కోట్లు, సెక్యూరిటీస్ ప్రీమియం ఖాతాలో రూ.196 కోట్లు, ఫ్రీ రిజర్వుల్లో రూ.311 కోట్లు ఉన్నాయని వెల్లడించింది. షేర్‌హోల్డర్ల ఆమోదానికి లోబడి బోనస్ షేర్ల‌ను ఈ ఏడాది జూలై 25 నాటికి వారి డీమ్యాట్ ఖాతాల్లో జమ చేస్తారు. బోనస్ షేర్లు అంటే కంపెనీ తన నిల్వ నిధుల నుంచి షేర్‌హోల్డర్లకు ఉచితంగా ఇచ్చే అదనపు షేర్లు. సాధారణంగా దీన్ని కంపెనీ బలమైన ఆర్థిక స్థితి, భవిష్యత్ వృద్ధిపై ఉన్న విశ్వాసానికి సంకేతంగా పరిగణిస్తారు. బోనస్ ఇష్యూ వల్ల కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో మార్పు ఉండదు. అయితే షేర్ల సంఖ్య పెరగడం వల్ల ట్రేడింగ్ లిక్విడిటీ మెరుగుపడి, చిన్న పెట్టుబడిదారులకు షేర్లు మరింత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ట్రెండ్‌లైన్ డేటా ప్రకారం గోల్డియామ్ ఇంటర్నేషనల్ గత సుమారు 21 సంవత్సరాల్లో బోనస్ షేర్ ల‌ను ఇష్యూ చేయ‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం.

మెరుగైన ఫ‌లితాలు..

2025-26 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో గోల్డియామ్ ఇంటర్నేషనల్ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.37 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నమోదైన రూ.23 కోట్లతో పోలిస్తే ఇది 61 శాతం వృద్ధిని నమోదు చేసింది. సమీక్షా త్రైమాసికంలో కార్యకలాపాల ఆదాయం కూడా ఏడాది ప్రాతిపదికన 18 శాతానికి పైగా పెరిగి రూ.235 కోట్లకు చేరింది. అమెరికా టారిఫ్‌లు, బంగారం ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ 2025-26లో అత్యుత్తమ ఆర్థిక ఫలితాలను సాధించామని కంపెనీ తెలిపింది. గోల్డియామ్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ అన్మోల్ భ‌న్సాలి మాట్లాడుతూ సవాళ్లతో కూడిన సంవత్సరంలోనూ సంస్థ అత్యుత్తమ ఆర్థిక ప్రదర్శన కనబరిచిందన్నారు. బ్రైడల్ విభాగంలో తమ బీ2బీ వ్యాపారం బలపడుతోందని, త్వరలో బ్రేస్‌లెట్లు, నెక్లెస్‌లు వంటి విభాగాల్లో అధిక సగటు విక్రయ ధర కలిగిన జ్యువెలరీ ఉత్పత్తులను పరీక్షించనున్నట్లు తెలిపారు.

విస్త‌ర‌ణ‌పై ప్ర‌త్యేక దృష్టి..

అలాగే ఒరిజెమ్ బ్రాండ్ కింద ప్రస్తుతం 24 కోకో స్టోర్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, ఇది దేశంలోని ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ బ్రాండ్లలో అతిపెద్ద నెట్‌వర్క్‌లలో ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు. వినియోగదారుల విశ్వాసాన్ని మరింత పెంచేందుకు ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్, పేమెంట్ స్కీమ్స్, వీవీఎస్ క్వాలిటీ డైమండ్ లైన్లను పరీక్షించనున్నట్లు తెలిపారు. అలాగే దేశంలోనే తొలి 3డీ రింగ్ బిల్డర్‌ను స్టోర్‌లలోనూ, ఆన్‌లైన్‌లోనూ అందుబాటులోకి తీసుకువచ్చామని, దీంతో వినియోగదారులు తమకు కావ‌ల్సిన‌ ఉంగరాన్ని ప్రత్యక్షంగా డిజైన్ చేసుకునే అవకాశం పొందుతున్నారని చెప్పారు.

Advertisement
Advertisement