త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold Prices Surge | భారీగా పెరుగుతున్న బంగారం ధరలు: కారణం ఇదేనన్న నిర్మలా సీతారామన్!

ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తుండటమే ప్రస్తుత ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధర రూ. 1.60 లక్షల మార్క్‌ను తాకగా, భౌగోళిక ఉద్రిక్తతలు కూడా పసిడికి డిమాండ్‌ను పెంచుతున్నాయని ఆమె పేర్కొన్నారు.

J

Business | Published On Feb 23, 2026, 4.11 pm IST

Gold Prices Surge | భారీగా పెరుగుతున్న బంగారం ధరలు: కారణం ఇదేనన్న నిర్మలా సీతారామన్!
Advertisement

Gold Prices Surge | త్రినేత్ర.న్యూస్ : గత కొన్ని రోజులుగా పసిడి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. దేశీయ మార్కెట్లో బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయనే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. సోమవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెంట్రల్ బోర్డ్ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లే ప్రధాన కారణం

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని నిల్వ చేసుకుంటున్నాయని, అందుకే పసిడి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని నిర్మలా సీతారామన్ వివరించారు. "ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి, దీనివల్ల డిమాండ్ పెరిగి ధరలు పైకి వెళ్తున్నాయి" అని ఆమె పేర్కొన్నారు. గ్లోబల్ రిజర్వ్ వ్యూహాల్లో వస్తున్న మార్పుల వల్ల ఈ పరిస్థితి నెలకొందని ఆమె విశ్లేషించారు.

రికార్డు స్థాయిలో ధరలు

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,60,040 మార్క్‌ను తాకింది. ఒక్క రోజులోనే దాదాపు 2 శాతం పైగా పెరుగుదల కనిపించింది. అటు వెండి ధర కూడా కేజీకి రూ.2.63 లక్షల వద్ద ట్రేడ్ అవుతూ ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ధరల పెరుగుదలకు ఇతర కారణాలు

కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లతో పాటు మరికొన్ని అంశాలు వల్ల కూడా పసిడి రేట్లకు రెక్కలు వస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్ నిర్ణయాల వల్ల మార్కెట్లో అస్థిరత నెలకొంది. స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతుండటంతో, ఇన్వెస్టర్లు సురక్షితమైన మార్గంగా భావించి బంగారంపై పెట్టుబడులు పెంచుతున్నారు.

నిపుణుల అంచనా ప్రకారం, అంతర్జాతీయంగా 5,100 డాలర్లు నుంచి 5,200 డాలర్ల జోన్‌లో బంగారం ట్రేడ్ అవుతోంది. ధరలు ఇదే రీతిలో కొనసాగితే భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement
Advertisement