Gold Silver Price | పట్టపగ్గాలేని బంగారం, వెండి.. సరికొత్త గరిష్టాలకు చేరిన ధరలు..!
Gold Silver Price | దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సరికొత్త గరిష్టాలకు చేరాయి. ప్రపంచ మార్కెట్‌లో గందరగోళ పరిస్థితులు అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడిదారులు పసడి, వెండిపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
Gold Silver Price | దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సరికొత్త గరిష్టాలకు చేరాయి. ప్రపంచ మార్కెట్‌లో గందరగోళ పరిస్థితులు అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడిదారులు పసడి, వెండిపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం మార్కెట్‌లో పుత్తడి, వెండి ధరలు గత రికార్డులన్ని బద్దలు కొట్టాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వెండి ధర కిలోగ్రాముకు రూ. 3.59 లక్షలు దాటింది. గోల్డ్ తులానికి రూ.1.60లక్షలకు చేరువైంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అగ్రరాజ్యం అమెరికాలో మారుతున్న ఆర్థిక విధానాలు మార్కెట్‌పై పెను ప్రభావం చూపుతున్నాయి.
ఎంసీఎక్స్ ఫ్యూచర్ ట్రేడింగ్‌లో మంగళవారం వెండి ధరలు భారీగా పెరిగాయి. మార్చి డెలివరీ ధర రూ.25,010 పెరిగి కిలోకు రూ.3,59,800 వద్ద రికార్డు స్థాయికి చేరుకుంది. గతవారంలో వెండి తొలిసారిగా రూ.3లక్షల మార్క్‌ని చేరిన విషయం తెలిసిందే. కేవలం వారంలోనే 16.3శాతం లాభపడడం గమనార్హం. మరో పసిడి సైతం మెరిసింది. ఫిబ్రవరి కాంట్రాక్టుకు సంబంధించిన గోల్డ్ రూ.3,783 పెరిగి.. తులానికి రూ.1,59,820 వద్ద సరికొత్తగా జీవితకాల గరిష్టానికి చేరుకుంది. గతవారంలో బంగారం ధర 9.5శాతం (రూ.13,520) పెరిగాయి.
బంగారం, వెండి ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులేనని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ట్రంప్ టారిఫ్ భయాలు ప్రపంచ మార్కెట్లను కలవరానికి గురి చేస్తున్నాయి. దక్షిణ కొరియా దిగుమతులపై సుంకాలను పెంచుతామని ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలంత్రి తెలిపారు. ఆర్థిక క్రమశిక్షణ, పెరుగుతున్న ఆందోళనలు గోల్డ్ స్కీమ్స్, కరెన్సీపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తగ్గించి బంగారం, వెండి వైపుగా మళ్లించేలా చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
రిలయన్స్ సెక్యూరిటీస్‌కు చెందిన జిగర్ త్రివేది మాట్లాడుతూ.. ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారీ ప్రభుత్వ వ్యయం దృష్ట్యా, పెట్టుబడిదారులు బాండ్ల నుంచి డబ్బును ఉపసంహరించుకుని, రియల్ అసెట్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారన్నారు. దీన్ని డిబేస్‌మెంట్ ట్రేడ్‌గా పిలుస్తారన్నారు. భారత మార్కెట్‌లో ధరలు పెరుగుతున్నప్పటికీ.. మంగళవారం అంతర్జాతీయ మార్కెట్‌లో మార్చి డెలివరీకి సంబంధించిన వెండి ధర 6.27శాతం తగ్గి ఔన్సుకు 108.26 డాలర్లకు చేరింది. ఇంతకు ముందు ఔన్స్‌కు ఔన్సుకు 117.26 డాలర్ల రికార్డు గరిష్ట స్థాయిని తాకింది. గోల్డ్ ధర 5,107.9 డాలర్ల రికార్డు గరిష్ట స్థాయిని తాకి.. స్వల్పంగా తగ్గి ఔన్సుకు 5,096.05 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
ప్రస్తుతం పెట్టుబడిదారులు బడ్జెట్‌తో పాటు ఫెడ్ నిర్ణయంపై దృష్టి సారించారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ త్వరలో సమావేశం కానున్నది. ఫెడ్ రిజర్వ్‌కు ట్రంప్ కొత్త చైర్మన్‌ను నియమించనున్నారనే ఊహాగానాలున్నాయి. ఇది మార్కెట్ దిశను నిర్దేశించనున్నది. వాస్తవానికి ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్, ట్రంప్‌కు ఏమాత్రం పొసగడం లేదు. వడ్డీ రేట్లలో కోత విధించాలని ట్రంప్ కోరుతుండగా.. పావెల్ అందుకు నిరాకరిస్తున్నారు. ట్రంప్ ఒత్తిడి మేరకు గతంలో ఒకసారి వడ్డీ రేట్లను కోత విధించారు. తాజాగా మరోసారి వడ్డీ రేట్లను తగ్గించాలని ట్రంప్ కోరుతున్నారు.
ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌ను మార్కెట్ నిశితంగా పరిశీలిస్తున్నది. దిగుమతి సుంకాల్లో ఏమైనా మార్పులు చేస్తారా? అన్న ఆసక్తి నెలకొంది. ఇదే జరిగితే బంగారం, వెండి ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నది. ప్రస్తుత మార్కెట్‌లో భయం, అనిశ్చితి వాతావరణం నెలకొంది. ఫెడ్ సమావేశం, బడ్జెట్ వరకు బులియన్ మార్కెట్‌లో ఈ అస్థిరత కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






