Maruti Suzuki Price Hike | మారుతి కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా? అయితే వెంటనే కొనేయండి..!
మారుతి కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా? అయితే వెంటనే కొనేయండి. ఆగస్టు 2026 నుంచి కార్ల ధరలను గరిష్టంగా రూ. 30 వేల వరకు పెంచుతున్నట్లు మారుతి సుజుకి ప్రకటించింది.
Automobiles | Published On Jul 21, 2026, 8.18 pm IST
- ఆగస్టు 2026 నుంచి తమ కార్ల ధరలను రూ.30,000 వరకు పెంచుతున్నట్లు మారుతి సుజుకి (Maruti Suzuki) ప్రకటన
- ముడిసరుకు, తయారీ ఖర్చులు విపరీతంగా పెరగడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం
- పెరిగిన ఈ ధరలు కారు మోడల్‌ను బట్టి మారుతుంటాయని స్పష్టం చేసిన కంపెనీ
- ఈ ఏడాదిలో మారుతి సుజుకి తమ కార్ల ధరలను పెంచడం ఇది వరుసగా మూడోసారి
Maruti Suzuki Price Hike | త్రినేత్ర.న్యూస్ : భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) కొత్త కారు కొనేవారికి బ్యాడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెల, అంటే ఆగస్టు 2026 నుంచి తమ కార్ల మోడల్స్ పై గరిష్టంగా రూ. 30,000 వరకు ధరలను పెంచుతున్నట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించింది. మీరు మారుతి కారు కొనాలని ప్లాన్ చేసుకుంటున్నట్లయితే, జులై నెలలోనే ఆ నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
ఎందుకు ధరలు పెంచుతున్నారు?
కారు ముడిసరుకు (Input costs), తయారీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడమే ఈ ధరల పెంపునకు కారణమని కంపెనీ తెలిపింది. ఖర్చులను తగ్గించుకోవడానికి గత కొద్ది నెలలుగా ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని మారుతి సుజుకి వెల్లడించింది.
పెరిగిన ఖర్చుల భారాన్ని చాలా వరకు సంస్థే భరించినప్పటికీ, తప్పనిసరి పరిస్థితుల్లో కస్టమర్లపై కొద్దిపాటి భారం వేస్తున్నట్లు సంస్థ వివరించింది. అయితే, ఈ పెరిగే ధరలు అన్ని మోడల్స్ పై ఒకేలా ఉండవని.. మోడల్ (Model), వేరియంట్‌ను బట్టి ధరల పెంపులో మార్పులు ఉంటాయని స్పష్టం చేసింది.
ఈ ఏడాదిలో ఇది మూడోసారి..
కమోడిటీ ధరలు, లాజిస్టిక్స్ (Logistics), నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో ఆటోమొబైల్ సంస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మారుతి సుజుకి ఈ ఏడాది కార్ల ధరలు పెంచడం ఇది వరుసగా మూడోసారి. ఇంతకుముందు విలువైన లోహాలు, ముడిసరుకు ధరలు పెరిగాయన్న కారణంతో ఫిబ్రవరి, మే నెలల్లో కూడా ఇలాగే ధరలు పెంచింది.
ఇదిలా ఉండగా.. ధరల పెంపు ప్రకటన వెలువడిన తర్వాత స్టాక్ మార్కెట్‌లో (Stock market) మారుతి సుజుకి షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం బీఎస్‌ఈ (BSE) లో మారుతి షేరు ధర దాదాపు రూ. 13,630 వద్ద ట్రేడ్ అయింది.
తాజావార్తలు
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?
- ●Telangana Movie Ticket Prices | సినిమా టికెట్ ధరలపై తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఏసీ, నాన్-ఏసీ థియేటర్లలో కొత్త రేట్లు ఇవే!
- ●Konda Surekha TPCC Notice | కొండా సురేఖకు టీపీసీసీ బిగ్ షాక్.. కూతురు కామెంట్స్‌పై 3 రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందే
- ●Telangana Intermediate Board Scandal | ఇంటర్ బోర్డులో ప్రకంపనలు: గ్లోబరీనా స్కామ్‌పై విజిలెన్స్ ఎంక్వైరీ.. మాజీ సెక్రటరీ అశోక్ విచారణ
- ●Vemula Prashanth Reddy | ఆర్భాటాలకు వందల కోట్లు.. భీమ్‌గల్ అభివృద్ధికి రూ.20 కోట్లు లేవా?
- ●Tamannaah Bhatia | ‘నో కిస్సింగ్ పాలసీ’కి గుడ్‌బై.. తమన్నా ఎందుకిలా?

Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

Telangana Movie Ticket Prices | సినిమా టికెట్ ధరలపై తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఏసీ, నాన్-ఏసీ థియేటర్లలో కొత్త రేట్లు ఇవే!

Konda Surekha TPCC Notice | కొండా సురేఖకు టీపీసీసీ బిగ్ షాక్.. కూతురు కామెంట్స్‌పై 3 రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందే

Telangana Intermediate Board Scandal | ఇంటర్ బోర్డులో ప్రకంపనలు: గ్లోబరీనా స్కామ్‌పై విజిలెన్స్ ఎంక్వైరీ.. మాజీ సెక్రటరీ అశోక్ విచారణ



