త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Unbelievable Facts World | నదులు, రైళ్లు, కనీసం దోమలు కూడా లేని దేశాలు ఉన్నాయని మీకు తెలుసా? ప్రపంచంలోని 12 ఆశ్చర్యకరమైన నిజాలు!

ప్రపంచంలో కొన్ని దేశాల గురించి వింటే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అక్కడ నదులు, పాములు, రైల్వే వ్యవస్థ, కనీసం దోమలు కూడా ఉండవు! ఆ వింతైన దేశాలేంటో తెలుసుకుందాం రండి.

J

Viral news | Published On Jun 9, 2026, 1.00 am IST

Unbelievable Facts World | నదులు, రైళ్లు, కనీసం దోమలు కూడా లేని దేశాలు ఉన్నాయని మీకు తెలుసా? ప్రపంచంలోని 12 ఆశ్చర్యకరమైన నిజాలు!
Advertisement
  • ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన, వింతైన నిజాలు (Facts)
  • ఐస్‌లాండ్‌లో దోమలు ఉండవు, ఐర్లాండ్‌లో పాములు కనిపించవు
  • నార్వేలో రాత్రి ఉండదు, సౌదీ అరేబియాలో నదులు, దేవాలయాలు లేవు
  • కువైట్‌లో రైల్వే, శాన్ మారినోలో విమానాశ్రయం లేవు. ఇవే కాకుండా మరిన్ని అద్భుత నిజాలు

Unbelievable Facts World | త్రినేత్ర.న్యూస్ : మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు, వింతలు దాగి ఉన్నాయి. మనకు సర్వసాధారణం అనిపించేవి.. కొన్ని దేశాల్లో అస్సలు కనిపించవు. నదులు (Rivers), అడవులు (Forests), రైళ్లు (Trains).. చివరకు రాత్రి (Night) కూడా లేని దేశాలు భూమి మీద ఉన్నాయని మీకు తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్న అలాంటి కొన్ని అద్భుతమైన ఫ్యాక్ట్స్ (Facts) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దోమలు, పాములు లేని దేశాలు: మనకు రోజూ నిద్రలేకుండా చేసే దోమలు (Mosquitoes) ఐస్‌లాండ్ (Iceland) లో అస్సలు కనిపించవు! వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అక్కడ దోమలు బతకలేవు. అలాగే, ప్రపంచంలో అసలు పాములు (Snakes) లేని దేశంగా ఐర్లాండ్ (Ireland) ప్రసిద్ధి చెందింది.

రైల్వే, ఎయిర్‌పోర్ట్ లేని దేశాలివే: ప్రపంచవ్యాప్తంగా రవాణాకు అత్యంత కీలకమైన రైల్వే వ్యవస్థ (Railway system) కువైట్ (Kuwait) లో లేదు. ఇక శాన్ మారినో (San Marino) దేశంలో కనీసం విమానాశ్రయం (Airport) కూడా లేదు! అక్కడి ప్రజలు పక్కనే ఉన్న ఇటలీ ఎయిర్‌పోర్ట్స్ పై ఆధారపడతారు.

ప్రకృతి వింతలు.. చెట్లు, రాత్రి లేని ప్రదేశాలు: ప్రపంచంలో చాలా దేశాల్లో అడవులు దట్టంగా ఉంటాయి.. కానీ ఖతార్ (Qatar) లో అసలు అడవులే (Forests) లేవు. అలాగే గ్రీన్‌లాండ్‌లో (Greenland) అసలు చెట్లే (Trees) ఉండవు, కేవలం మంచు మాత్రమే ఉంటుంది. ఇక నార్వే (Norway) లో వేసవి కాలంలో అర్ధరాత్రి కూడా సూర్యుడు కనిపిస్తాడు.. అంటే అక్కడ కొన్ని నెలల పాటు రాత్రి (Night) ఉండదన్నమాట! పర్యాటకానికి కేరాఫ్ అడ్రస్ అయిన మాల్దీవుల్లో (Maldives) సహజమైన సరస్సులు (Natural lakes) లేవు.

నదులు, గుడులు లేని దేశం: భూభాగం అంతా ఎడారితో నిండి ఉండే సౌదీ అరేబియాలో (Saudi Arabia) ఒక్క నది (River) కూడా లేదు. అంతేకాదు, అక్కడ ఇతర మతాలకు చెందిన దేవాలయాలు (Temples) లేదా చర్చిలు కూడా ఉండవు.

ఇన్‌కమ్ టాక్స్, సైన్యం లేని దేశాలు: ఏ దేశానికైనా రక్షణ కల్పించే సైన్యం (Army) కోస్టారికా (Costa Rica) లో లేదు. అలాగే ఐరోపాలోని మొనాకో (Monaco) దేశంలో ప్రజలు ఎలాంటి ఆదాయపు పన్ను (Income Tax) కట్టాల్సిన అవసరం లేదు. ట్యాక్స్ హెవెన్‌గా దీనికి పేరుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement