త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

​Bhatti Vikramarka | బావ, బామ్మర్దులకు గతం లేదు.. భవిష్యత్తూ లేదు : భ‌ట్టి విక్ర‌మార్క‌

​Bhatti Vikramarka | తెలంగాణలో దొరల రాజ్యాన్ని కాదని, ప్రజలు కోరుకున్న ప్రజా ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకున్నారు. గత పాలకుల అరాచకాలను భరించలేకే 2023లో ప్రజలు బుద్ధి చెప్పారు. మళ్లీ ఏ మొహం పెట్టుకుని వస్తున్నారు? అని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బిఆర్ఎస్ నేతలను నిలదీశారు.

S

Telangana | Published On Jul 14, 2026, 6.48 pm IST

​Bhatti Vikramarka | బావ, బామ్మర్దులకు గతం లేదు.. భవిష్యత్తూ లేదు : భ‌ట్టి విక్ర‌మార్క‌
Advertisement

​Bhatti Vikramarka | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణలో దొరల రాజ్యాన్ని కాదని, ప్రజలు కోరుకున్న ప్రజా ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకున్నారు. గత పాలకుల అరాచకాలను భరించలేకే 2023లో ప్రజలు బుద్ధి చెప్పారు. మళ్లీ ఏ మొహం పెట్టుకుని వస్తున్నారు? అని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బిఆర్ఎస్ నేతలను నిలదీశారు. గ‌ద్వాల నియోజ‌క‌వ‌ర్గం మల్ద‌క‌ల్ మండ‌ల ప‌రిధిలోని కుర్తి రావుల చెరువు గ్రామంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌సంగించారు.

ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ​గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. గత పాలకులు కేవలం భూమి పూజలు చేసి, ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప, క్షేత్రస్థాయిలో ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందించలేదు అని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును గాలికి వదిలేసి, కనీసం భూసేకరణకు కూడా నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. మొదలుపెట్టిన పనులను అర్ధాంతరంగా వదిలేసి జిల్లా రైతాంగానికి ద్రోహం చేశారని ఆరోపించారు.

​కృష్ణా జలాలతో పాలమూరును సస్యశ్యామలం చేస్తాం

​నార్లపూర్ నుండి ఉదండాపూర్ వరకు పెండింగ్‌లో ఉన్న రిజర్వాయర్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి, పాలమూరు జిల్లాను కృష్ణా జలాలతో సస్యశ్యామలం చేస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారని, ఇప్పటికే అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించారని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎన్ని వేల కోట్ల నిధులైనా సరే విడుదల చేసి, పనులను వడివడిగా పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారని స్పష్టం చేశారు.

​ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ విప్లవం

​తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం ఒక అదృష్టంగా భావించేలా ప్రజా ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత మరియు ఆర్థిక భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు. ​"కాంగ్రెస్ అంటేనే కరెంటు.. కరెంటు అంటేనే కాంగ్రెస్! ఉచిత విద్యుత్‌కు పేటెంట్ హక్కు కాంగ్రెస్ పార్టీదే అని గుర్తు చేశారు. రాష్ట్రంలోని 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు అంతరాయం లేని ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాం. ఇందుకోసం ఏటా రైతుల తరఫున రూ. 14,000 కోట్లను ప్రభుత్వమే డిస్కమ్‌లకు చెల్లిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు ఇప్పటివరకు రూ. 67,000 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశామన్నారు. కోటి ఆరు లక్షల కుటుంబాలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని అందిస్తున్నది దేశంలో తెలంగాణ రాష్ట్రం ఒకటేనని పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులకు పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న గత ప్రజా ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. గద్వాల నియోజకవర్గానికి కావలసిన విద్యుత్ అవసరాలన్నింటినీ ప్రభుత్వం పూర్తిగా తీరుస్తుందని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.

​‘బావ-బామ్మర్దుల’ ఆటలు సాగవు!

​ప్రతిపక్ష నాయకులపై భట్టి విక్రమార్క తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. "వస్తున్నాం.. వస్తున్నాం అంటున్నారు.. ఎక్కడికి వస్తున్నారు? మీ పార్టీ అసలు నాయకుడు ఎక్కడున్నారో మీకు తెలుసా? బావ-బామ్మర్దులకు గతం లేదు.. భవిష్యత్తూ లేదు. ఎవరిని మాయ చేయడానికి వస్తున్నారు? ఎంతకాలం ప్రజలను మోసం చేస్తారు?" అని ప్రశ్నించారు. ​గతంలో వారు చేసిన పాపాలన్నింటికీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ గుండు సున్నా ఇచ్చి తిరస్కరించారని గుర్తు చేశారు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పినట్టుగా రాబోయే ఎంపీటీసీ ఎన్నికల్లోనూ బుద్ధి చెప్తారని హెచ్చరించారు. తెలంగాణ సమాజం ప్రజా ప్రభుత్వాన్ని దీవిస్తోందని, ఇక దొరల రాజ్యాన్ని కోరుకోవడం లేదని, వారి ఆటలు తెలంగాణలో సాగవని భ‌ట్టి విక్ర‌మార్క స్పష్టం చేశారు.

Advertisement
Advertisement