Niranjan | పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మృతి.. హనుమకొండలో విషాద ఛాయలు
Niranjan | పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వీరాభిమాని హనుమకొండకు చెందిన పొనుగంటి నిరంజన్ (17) మృతి చెందారు.
Niranjan | త్రినేత్ర.న్యూస్: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వీరాభిమాని హనుమకొండకు చెందిన పొనుగంటి నిరంజన్ (17) మృతి చెందారు. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ ఎదుగుదల లోపించి, మంచానికే పరిమితమైన నిరంజన్ (Niranjan) ఆరోగ్యం మరింత క్షీణించడంతో చికిత్స నిమిత్తం ఇటీవల హైదరాబాద్‌లోని ఓ దవాఖానకు తీసుకొచ్చారు. అయితే పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గత నెలలో నిరంజన్‌ను పవన్ కల్యాణ్ పరామర్శించిన విషయం తెలిసిందే.

జూన్ 17న నిరంజన్ నివాసానికి స్వయంగా వెళ్లిన పవన్ కల్యాణ్.. అతడిని ఆత్మీయంగా హత్తుకుని ధైర్యం చెప్పారు. అతడు గతంలో తన పాటలకు వేసిన డ్యాన్స్ వీడియోలను చూసి మురిసిపోయారు. ఇద్దరం కలిసి ఓజీ సినిమా చూద్దామని చెప్పారు. ఒకవేళ ఓజీ 2 తీస్తే అందులో నువ్వే నా స్పెషల్ గెస్ట్ అంటూ మాటిచ్చారు. తిరుమల శ్రీవారి ప్రసాదంతోపాటు పలు బహుమతులు అందించారు. తనకు ఒక అందమైన పెంపుడు కుక్క కావాలని, ముఖ్యంగా పూడిల్ జాతికి చెందిన కుక్కపిల్ల కావాలని నిరంజన్ కోరారు. తన ఫోన్‌లో ఫొటో చూపిస్తూ, నటుడు రామ్‌చరణ్ పెంచుకునే పూడిల్ బ్రీడ్‌లాంటి కుక్కపిల్ల కావాలని చెప్పారు. నిరంజన్ కోరిక విన్న వెంటనే పవన్ కల్యాణ్ స్పందించి, అదే జాతికి చెందిన కుక్కపిల్లను అందజేస్తానని హామీ ఇచ్చారు. తన వ్యక్తిగత సిబ్బందికి వెంటనే ఆదేశాలు జారీ చేసి, పూడిల్ బ్రీడ్ కుక్కపిల్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అయితే 20 రోజుల్లోనే నిరంజన్ మృతిచెందడంతో హనుమకొండలోని (Hanumakonda) హనుమాన్ నగరంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
సంబంధిత వార్తలు

Tollywood | గ్రాండ్‌గా డైరెక్టర్ మెహర్ రమేష్ కూతురి పెళ్లి – హాజరైన పవన్ కళ్యాణ్, చిరంజీవి
జులై 2, 2026

Pawan Kalyan on social media abuse | సోషల్ మీడియాలో ఇక ఆ ఆటలు సాగవు.. అసభ్య ప్రచారాలపై పవన్ కళ్యాణ్ సీరియస్
జులై 1, 2026

Pooja Hegde | పవన్ కళ్యాణ్ ఓజీ యూనివర్స్‌లో బుట్టబొమ్మ – అప్పుడు ఛాన్స్ మిస్ – ఇప్పుడు జాక్‌పాట్
జూన్ 28, 2026
తాజావార్తలు
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!
- ●Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!



