IOB Apprentice Recruitment | ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకులో అప్రెంటిస్‌లు..
IOB Apprentice Recruitment | చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 750 అప్రెంటిస్ పోస్టులను (Apprentice Recruitment) భర్తీ చేస్తున్నది.
IOB Apprentice Recruitment | త్రినేత్ర.న్యూస్: చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 750 అప్రెంటిస్ పోస్టులను (Apprentice Recruitment) భర్తీ చేస్తున్నది. అభ్యర్థులు జూలై 20 వరకు www.iob.bank.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తెలంగాణలో 6, ఆంధ్రప్రదేశ్‌లో 15 ఖాళీలు ఉన్నాయి. అత్యధికంగా తమిళనాడులో 200, ఉత్తరప్రదేశ్‌లో 110 పోస్టులు ఉన్నాయి.
మొత్తం ఖాళీలు: 750
అర్హత: ఏదైనా డిగ్రీ పూర్తిచేయాలి. జూలై 31 నాటికి ఫలితాలు వెలువడాలి. జూలై 1 నాటికి 20 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి. లేదా 1998, జూలై 1 నుంచి 2006, జూలై 1 మధ్య జన్మించినవారై ఉండాలి. బీసీ, ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. స్థానిక భాష చదవడం, రాయడం తప్పనిసరిగా తెలిసి ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష ద్వారా. పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. వంద ప్రశ్నలు అడుగుతారు. జనరల్, ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 25, జనరల్ ఇంగ్లిష్ 25, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25, కంప్యూటర్, సబ్జక్ట్ నాలెడ్జ్ 25 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. 90 నిమిషాల్లో పరీక్ష పూర్తిచేయాలి.
ఎంపికైనవారికి ప్రతినెల మెట్రో నగరాల్లో రూ.15,500, అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో రూ.14,500 స్టయిఫండ్ అందిస్తారు.
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు ఫీజు: రూ.900 (పురుష అభ్యర్థులకు), రూ.708 (మహిళలు), ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.236
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 20
వెబ్‌సైట్: www.iob.bank.in
తాజావార్తలు
- ●Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!

Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం




