Damodar Raja Narasimha | ఎడ్యుకేషన్ హబ్‌గా ఆందోల్.. 60 కోట్లతో ఫార్మసీ, 35 కోట్లతో లా కళాశాలల ఏర్పాటు: మంత్రి దామోదర రాజనర్సింహ
Damodar Raja Narasimha | సంగారెడ్డి జిల్లాలో 18 వేలకు పైగా, ఆందోల్ (Andole) నియోజకవర్గంలో 3 వేలకు పైగా నూతన పింఛన్లు (New Pensions) మంజూరయ్యాయని మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) తెలిపారు.
Damodar Raja Narasimha | త్రినేత్ర న్యూస్: సంగారెడ్డి జిల్లాలో 18 వేలకు పైగా, ఆందోల్ (Andole) నియోజకవర్గంలో 3 వేలకు పైగా నూతన పింఛన్లు (New Pensions) మంజూరయ్యాయని మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4.50 లక్షల చేయూత పింఛన్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఆందోల్ నియోజకవర్గం విద్యా హబ్‌గా అభివృద్ధి చెందుతోందన్నారు. ఆందోల్ గుట్ట వద్ద రూ.60 కోట్లతో ఫార్మసీ కళాశాల, ఆందోల్‌లో రూ.35 కోట్లతో లా కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సోమవారం ఆందోల్ మండలం సంగుపేట ఎక్స్ రోడ్డులోని శ్రీలక్ష్మీదేవి గార్డెన్స్‌లో సోమవారం నిర్వహించిన నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆందోల్-జోగిపేట మున్సిపాలిటీతో పాటు ఆందోల్, చౌటకూర్, పుల్కల్, వట్‌పల్లి మండలాలకు చెందిన నూతన పింఛన్ లబ్ధిదారులకు మంజూరు ప్రొసీడింగ్స్‌ను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు.
సమాజంలోని ప్రతి పేదవాడికి విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేయూత పింఛన్లను మంజూరు చేస్తోందని తెలిపారు.
దేశ చరిత్రలోనే తొలిసారిగా పేదలకు సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డుల మంజూరుతో పాటు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఆందోల్ నియోజకవర్గంలో 4 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు సుమారు వెయ్యి ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగిలిన ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని వివరించారు. సొంత స్థలం ఉన్న పేదలకు ఇళ్లు మంజూరు చేయడంతో పాటు, స్థలం లేని నిరుపేదలకు కూడా ఇళ్లు మంజూరు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించి కోటీశ్వరులుగా ఎదగాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు పెద్దఎత్తున బ్యాంకు లింకేజీ రుణాలు, వడ్డీ లేని రుణాలు అందిస్తూ ప్రోత్సహిస్తోందని మంత్రి తెలిపారు. మహిళా సంఘాలు తీసుకున్న రుణాలపై వడ్డీ చెల్లించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటోందన్నారు. ఇందిరమ్మ క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, డ్రోన్ల నిర్వహణ వంటి వివిధ రంగాల్లో మహిళలకు అవకాశాలు కల్పిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతోందని పేర్కొన్నారు. హుమ్నాపూర్‌లో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
10 నుంచి 15 పరిశ్రమలు
ఆందోల్‌లో త్వరలో నర్సింగ్ కళాశాలను కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా బాలికలు ఉన్నత విద్యను అభ్యసించి, నైపుణ్యాలు పెంపొందించుకుని పోటీ ప్రపంచంలో ధైర్యంగా ముందుకు సాగాలని మంత్రి సూచించారు. యువతకు స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆందోల్ నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ ప్రాంతంలో కనీసం 10 నుంచి 15 పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని పేర్కొన్నారు. సింగూరు, ఆందోల్ ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. మెట్ట ప్రాంతాలకు సైతం సాగునీరు అందించాలనే లక్ష్యంతో పెద్దారెడ్డిపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా కొనసాగిస్తూ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, ప్రభుత్వం సమాజంలోని చివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందేలా పనిచేస్తోందని అన్నారు. జిల్లాలో ప్రస్తుతం 1,48,562 మంది లబ్ధిదారులకు ప్రతి నెల రూ.32.73 కోట్ల పింఛన్లు అందిస్తున్నట్లు వివరించారు. తాజాగా మరో 18,591 మందికి నూతనంగా చేయూత పింఛన్లు మంజూరు చేయగా, వీరికి ప్రతి నెల రూ.4.24 కోట్ల పింఛన్ అందించనున్నట్లు తెలిపారు. ఆందోల్ నియోజకవర్గంలో కొత్తగా 3,130 మందికి చేయూత పింఛన్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరుకాలేక మంజూరు ప్రొసీడింగ్స్ పొందని లబ్ధిదారులు సంబంధిత మండల కార్యాలయాల్లో వాటిని తీసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
తాజావార్తలు
- ●Tenth Exam Fee | టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పది పరీక్షల ఫీజు గడువు పొడిగింపు
- ●Yadagirigutta | యాదగిరిగుట్టలో 20 నుంచి కార్తికోత్సవాలు
- ●Heavy Rain | 20న తెలంగాణలో అతి భారీ వర్షం..! జర జాగ్రత్త..!!
- ●Horoscope | నవంబర్ 17 రాశిఫలాలు.. ఈ రాశి వారు ఏ పని చేపట్టినా విజయం తథ్యం..!
- ●Telangana Employees JAC | తెలంగాణ ఉద్యోగుల జేఏసీ భేటీ: ఓపీఎస్ పునరుద్ధరణ, 2వ పీఆర్సీ అమలు సహా 41 ప్రధాన డిమాండ్లు ఇవే!
- ●Couple Photos in Divorce Case | వైష్ణోదేవి, ఉజ్జయిని పుణ్యక్షేత్రాల్లో కలిసి ఫోటోలు దిగినంత మాత్రాన వేధింపులు లేనట్టా?

Tenth Exam Fee | టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పది పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

Yadagirigutta | యాదగిరిగుట్టలో 20 నుంచి కార్తికోత్సవాలు

Heavy Rain | 20న తెలంగాణలో అతి భారీ వర్షం..! జర జాగ్రత్త..!!

Horoscope | నవంబర్ 17 రాశిఫలాలు.. ఈ రాశి వారు ఏ పని చేపట్టినా విజయం తథ్యం..!







