త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | మూడు నెల‌ల్లోనే పిల్ల‌లు పుట్టించ‌లేరు క‌దా..! ఇదేనా సీఎం మాట్లాడే భాష‌..! రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

KTR | సీఎం రేవంత్ రెడ్డి భాష‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఎంత కండ‌లు తిరిగినా ప‌హిల్వాన్ అయినా కూడా మూడు నెల‌ల్లోనే పిల్ల‌లు పుట్టించ‌లేరు క‌దా..! అని సీఎం మాట్లాడారు. ఇది సీఎం మాట్లాడే భాష‌నా..? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Apr 9, 2026, 6.01 pm IST

KTR | మూడు నెల‌ల్లోనే పిల్ల‌లు పుట్టించ‌లేరు క‌దా..! ఇదేనా సీఎం మాట్లాడే భాష‌..! రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : సీఎం రేవంత్ రెడ్డి భాష‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఎంత కండ‌లు తిరిగినా ప‌హిల్వాన్ అయినా కూడా మూడు నెల‌ల్లోనే పిల్ల‌లు పుట్టించ‌లేరు క‌దా..! అని సీఎం మాట్లాడారు. ఇది సీఎం మాట్లాడే భాష‌నా..? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. జ‌గిత్యాలో జీవ‌న్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.

ప్ర‌జా పాల‌న‌పై రైతులు, మ‌హిళ‌లు, నిరుద్యోగుల్లో తీవ్ర ఆక్రోశం ఉంది. ఈ ప్ర‌భుత్వం రేవంత్ నాయ‌క‌త్వంలో గ‌త రెండున్న‌రేండ్లుగా ప‌రిపాల‌న వైఫ‌ల్యాల‌ను క‌ప్పింపుచ్చుకునేందుకు డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తూ కాలం నెట్టుకొస్తున్నారు.. త‌ప్ప ఒరిగిందేమీ లేదు. మూడు సార్లు రైతుబంధు ఎగ్గొట్టారు. రూ. 9 వేల కోట్లు లెక్క‌న రూ. 27 వేల కోట్లు 70 ల‌క్ష‌ల మంది రైతుల‌కు బాకీ ప‌డ్డారు. రైతుల‌ను, మ‌హిళ‌ల‌ను మ‌భ్య పెడుతున్నారు అని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

బాస‌ర‌లో సీఎం రేవంత్ మాట్లాడిన భాష దారుణంగా, అవ‌మాన‌క‌రంగా ఉంది. ఎంత కండ‌లు తిరిగిన ప‌హిల్వాన్ అయినా మూడు నెల‌ల‌ల్లోనే పిల్ల‌లు పుట్టించ‌లేరు క‌దా.. అని మాట్లాడిండు. ఇది సీఎం మాట్లాడే భాష‌నా..? మూడు నెల‌లు అని చెప్పింది మీరే క‌దా.. ప్ర‌జ‌లు, మేం అడిగామా..? ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమ‌లు చేస్తామ‌ని చెప్పింది మీరు.. ఆర్థిక ప‌రిస్థితి అద్భుతంగా ఉంద‌ని ఊద‌ర‌గొట్టింది మీరు అని కాంగ్రెస్ నాయ‌క‌త్వంపై కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

Advertisement
Advertisement