KCR | నోటీసులు గోడకు అతికించడం చట్ట విరుద్ధం.. సిట్‌పై కేసీఆర్ ఫైర్
KCR | ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల వ్యవహార శైలిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. 160 సీఆర్పీసీ కింద నోటీసులను వ్యక్తిగతంగా అందజేయాలి.. కానీ చట్టవిరుద్ధంగా రాత్రి వేళ నందినగర్‌లోని ఇంటి గోడకు నోటీసులు అతికించడం చట్ట విరుద్ధమని కేసీఆర్ పేర్కొన్నారు.
160 సీఆర్పీసీ కింద నోటీసులు వ్యక్తిగతంగా అందజేయాలి..
సిట్ అధికారులకు నోటీసు ఇచ్చే అధికారమే లేదు..
సిట్ నోటీసు నా రాజ్యాంగ హక్కులను కాలరాయడమే..
ఎర్రవల్లిలో విచారించలేమనడం సరికాదు..
అయినా భారత పౌరుడిగా దర్యాప్తునకు సహకరిస్తా..
రేపు నందినగర్ నివాసంలోనే అందుబాటులో ఉంటా..
సిట్ విచారణపై కేసీఆర్ బహిరంగ లేఖ
KCR | త్రినేత్ర.న్యూస్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల వ్యవహార శైలిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. నోటీసుల జారీ విషయంలో ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుందని ఆయన మండిపడ్డారు. 160 సీఆర్పీసీ కింద నోటీసులను వ్యక్తిగతంగా అందజేయాలి.. కానీ చట్టవిరుద్ధంగా రాత్రి వేళ నందినగర్‌లోని ఇంటి గోడకు నోటీసులు అతికించడం చట్ట విరుద్ధమని కేసీఆర్ పేర్కొన్నారు. అయినప్పటికీ మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడిగా, బాధ్యతాయుతమైన భారత పౌరుడిగా దర్యాప్తుకు సహకరించాలని నిర్ణయించుకున్నాను. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నంది నగర్ నివాసంలో అందుబాటులో ఉంటానని కేసీఆర్ స్పష్టం చేశారు. సిట్ నోటీసులపై ఆరు పేజీలతో కూడిన లేఖను జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ ఏసీపీకి కేసీఆర్ రాశారు.
లేఖలోని ముఖ్యాంశాలు..
సిట్ అధికారులు వ్యవహరించిన తీరు చట్టాలకి వ్యతిరేకం. సుప్రీంకోర్టు తీర్పులను సిట్ అధికారులు తుంగలో తొక్కారు. సిట్ అధికారులకి నోటీసు ఇచ్చే అధికారమే లేదు.. ఈ చర్య నా రాజ్యాంగ హక్కులను కాలరాయడమే. మొన్న రెండు సార్లు సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులు చట్టవిరుద్ధం, చట్టాలకు అతిక్రమించారు. మీరు ఇచ్చిన మొదటి నోటీసుకు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉండటం వల్ల వేరే రోజు విచారణకు తేదీ ఇవ్వాలని చెప్పాను. దాంతో పాటు 65 ఏళ్ల పైబడిన వ్యక్తులను వారు నివసించే చోటనే విచారించాలని చెప్పే సెక్షన్ 160 సీఆర్పీసీ నిబంధనలను మీ దృష్టికి తెచ్చాను. దాంతో పాటు తదుపరి నోటీసులన్నీ కూడా ఎర్రవల్లిలోని నా నివాసానికే పంపాలని చెప్పాను. కానీ, ఇది చెప్పిన తర్వాత కూడా గుర్తుతెలియని వ్యక్తులు మీ సంతకంతో ఉన్న లేఖను రాత్రి 9 గంటలకు నందినగర్ నివాసంలోని మా ఇంటి గోడకు అతికించినట్లు తెలుస్తోంది. ఆ లేఖ మీరే పంపినట్లయితే, మీ సూచనల మేరకే అతికించినట్లయితే, ఆ లేఖను తీవ్రంగా ఆక్షేపిస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు..
ఇది భారత రాజ్యాంగం, చట్టం, సుప్రీంకోర్టుల పట్ల మీకు ఏమాత్రం గౌరవం లేదు అనే విషయాన్ని సూచిస్తుంది. గతంలో సుప్రీంకోర్టు 'సతేంద్ర కుమార్ యాంటిల్ వర్సెస్ సిబిఐ' అనే కేసులో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వాట్సాప్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా నోటీసులు పంపడం చట్టబద్ధమైన పద్ధతి కాదని, చట్టం నిర్దేశించిన రీతిలోనే నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. సీఆర్పీపీ 160 కింద నోటీసులను వ్యక్తిగతంగా అందజేయాలి. కానీ మీరు కావాలనే చట్టాన్ని, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. భవిష్యత్తు నోటీసులన్నీ ఎర్రవల్లికే పంపాలని చెప్పినప్పటికీ మీరు దాన్ని విస్మరించారు. కాబట్టి మీరు ఇచ్చిన రెండవ నోటీసు చట్టబద్ధంగా అందలేదు, అది చెల్లదు. మీరు ఇచ్చిన నోటీసు నా రాజ్యాంగబద్ధ హక్కులను ఉల్లంఘించడమే అని కేసీఆర్ స్పష్టం చేశారు.
నన్ను కట్టడి చేసే అధికారం లేదు..
నేను మీ పోలీస్ స్టేషన్ పరిధిలో గానీ, పొరుగు పోలీస్ స్టేషన్ పరిధిలో గానీ నివసించడం లేదు. కాబట్టి మీకు నోటీసు ఇచ్చే అధికార పరిధి లేదు. ఈ నోటీసు నన్ను కట్టడి చేసే అధికారం లేదు. ఎలక్షన్ అఫిడవిట్‌లో, అసెంబ్లీ రికార్డులో ఉన్న అడ్రస్ ఆధారంగా ఎర్రవల్లిలో విచారించలేమని మీరు చెప్పడం సరికాదు. నోటీసు ఇచ్చే సమయానికి వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నారు అన్నదే ముఖ్యం. నేను కొన్ని సంవత్సరాలుగా ఎర్రవల్లిలో నివసిస్తున్నాను అన్నది నిర్వివాద అంశం. అక్కడే నా స్టేట్మెంట్ రికార్డ్ చేయవలసిన బాధ్యత మీపై ఉన్నది అని కేసీఆర్ గుర్తు చేశారు.
ఇది మీ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం..
హరీష్ రావు అఫిడవిట్‌లో సిద్దిపేట అని చిరునామా ఉన్నప్పటికీ హైదరాబాద్‌లో నోటీసు ఇచ్చారు. ఇది మీ ద్వంద్వ ప్రమాణాలను సూచిస్తున్నది. మీరు నాకు ఇచ్చిన గోడకు నోటీసు అతికించడం చట్టవిరుద్ధం. మీరు నాకు నోటీసు ఇచ్చే అధికార పరిధి లేదు. చట్టం ప్రకారం నా స్టేట్‌మెంట్‌ను ఎర్రవల్లిలోనే రికార్డ్ చేయాలి. అయితే చట్టపరమైన అంశాలు ఎలా ఉన్నప్పటికీ, మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడిగా, బాధ్యతాయుతమైన భారత పౌరుడిగా దర్యాప్తుకు సహకరించాలని నిర్ణయించుకున్నాను. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలో అందుబాటులో ఉంటాను. మీరు నందినగర్ నివాసంలోనే స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాలని పట్టుబట్టినందున అక్కడే అందుబాటులో ఉంటాను అని కేసీఆర్ స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



